పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం కూడా స్థిరంగానే ఉన్నాయి. నేడు హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఎంత ధర పలుకుతుందో తెలుసుకోండి..

ఫిబ్రవరి 19, 2023న దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్ లో ఈరోజు హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 109.66 /లీటర్, డీజిల్ ధర రూ. 97.82 /లీటర్ గా ఉంది. ఇదిలా ఉంటే నేడు క్రూడాయిల్ ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 83 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో క్రూడాయిల్ ధర తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే భారత మార్కెట్‌లో పెట్రోల్ ధరలు గత 8 నెలలుగా స్థిరంగా ఉంది. జాతీయ స్థాయిలో ఈరోజు (ఆదివారం) కూడా దేశవ్యాప్తంగా పెట్రోల్-డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 

ఢిల్లీలో ఈరోజు, 19 ఫిబ్రవరి 2023 కూడా, పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర లీటరుకు రూ. 89.62 వద్ద ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24 గా ఉంది. 

పెట్రోల్‌, డీజిల్‌పై జీఎస్టీని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు
రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం అన్నారు. GST కౌన్సిల్ 49వ సమావేశం ఫిబ్రవరి 18, 2023న న్యూఢిల్లీలో జరగింది. ఈ సందర్భంగా కూడా ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం అందుతోంది. పరిశ్రమల సంఘం పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) సభ్యులతో బడ్జెట్ అనంతర సమావేశంలో ఆర్థిక మంత్రి ఈ హామీ ఇవ్వడం విశేషం.