Asianet News TeluguAsianet News Telugu

మై హోమ్ గ్రూప్ నుంచి మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్.. ‘మై హోమ్ అక్రిదా’ ప్రారంభం

నిర్మాణ రంగంలో ప్రసిద్ధి చెందిన మై హోమ్ గ్రూప్, ‘మై హోమ్ అక్రిడా’ పేరుతో హైదరాబాద్‌లో కొత్త మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. 12 హై-రైజ్ టవర్స్ 3,780 అపార్ట్‌మెంట్లతో కూడిన ఈ ప్రాజెక్ట్.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ఇతర ప్రధాన ప్రాంతాలకు సమీపంలో ఉండటం విశేషం.

My Home Group Launches Mega Residential Project 'My Home Akkrida' in Hyderabad GVR
Author
First Published Aug 11, 2024, 9:03 PM IST | Last Updated Aug 11, 2024, 9:03 PM IST

తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో బాహుబలి కంపెనీ అయిన మై హోమ్ గ్రూప్ మరో ఫ్లాగ్‌షిప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘మై హోమ్ అక్రిదా’ను అట్టహాసంగా ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలికి, హైటెక్ సిటీకి దగ్గరలో గోపన్‌పల్లి నుంచి తెల్లాపూర్‌ రోడ్డు మార్గంలోని ప్రైమ్‌ ఏరియాలో ఈ మై హోమ్ అక్రిదా టవర్స్ రాబోతున్నాయి. మై హోమ్ అక్రిదా కింద 12 హైరైజ్ (జీ+39 ఫ్లోర్స్‌తో) టవర్లలో 3,780 ఫ్లాట్లతో రాబోతోంది. ఇందులో భాగంగా ఫేజ్-1లో 6 టవర్లలో బుకింగ్స్ ఈరోజు (ఆదివారం) ప్రారంభమయ్యాయి. 

మై హోమ్ గ్రూప్, ప్రతిమ గ్రూప్‌ల జాయింట్ వెంచర్‌గా మై హోమ్ అక్రిదా ప్రాజెక్ట్‌ వస్తోంది. 24.99 ఎకరాల్లో G+39 అంతస్తులతో 81 శాతం ఓపెన్ ప్లేస్‌తో 12 టవర్స్‌ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 1,399 sft నుంచి 2,347 sft వరకు 2BHK, 2.5BHKతో పాటు 3BHK ప్రీమియం లైఫ్‌స్టైల్ అపార్ట్‌మెంట్‌లు నిర్మించనున్నారు. ఒక్కో అంతస్తుకు 8 ఫ్లాట్‌లతో కూడిన మొత్తం 12 టవర్లను నిర్మిస్తున్నారు.


అతివేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్‌లో ఈ ప్రాజెక్ట్ వస్తుండటం మరో హైలైట్. హైదరాబాద్‌లో అత్యంత ముఖ్యమైన ప్రదేశాలైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, ORR, ఎయిర్‌పోర్ట్, హై-ఎండ్ రెస్టారెంట్లు, మాల్స్, స్కూళ్లు.. మరెన్నో సులువుగా చేరుకునే విధంగా.. విశాలమైన రోడ్ల కనెక్టివిటీ కూడా ఉంది. శాంతియుతమైన, చక్కటి ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్.. నివాసితులకు అన్నిరకాల సౌలభ్యాలను అందిస్తోంది.

మై హోమ్ గ్రూప్, ప్రతిమ గ్రూప్ అభివృద్ధి చేస్తున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లో మరిన్ని రెసిడెన్షియల్ ఆఫర్‌లు, ప్రపంచ స్థాయి మాల్, ఇంటర్నేషనల్ స్కూల్, హాస్పిటల్ ఇలా మరెన్నో ప్రాజెక్టులు భవిష్యత్తులో రానున్నాయి.

ప్రాజెక్ట్ హైలైట్స్..

7.5 ఎకరాల సెంట్రల్ ల్యాండ్‌స్కేప్
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 5 నిమిషాల ప్రయాణం
ప్రతి టవర్‌లో డబుల్ హైట్ ఎంట్రెన్స్ లాబీ
1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 క్లబ్‌హౌస్‌లు
సాయుక్‌కు ఆనుకుని రాబోయే ఇంటర్నేషనల్ స్కూల్
2 రూఫ్‌టాప్ ఫుట్‌సాల్, పికిల్ బాల్ కోర్టులు
టెంపరేషన్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్

మై హోమ్ అక్రిదా లాంచ్ సందర్భంగా మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ రామేశ్వర్ రావు మాట్లాడుతూ.. "సౌకర్యం, లొకేషన్ సౌలభ్యం, దగ్గరగా ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేయడంలో మై హోమ్ మూడు దశాబ్దాలుగా అగ్రగామిగా ఉంది. మై హోమ్ అక్రిదా కూడా అదే నిబద్ధతకు కొనసాగింపు" అని తెలిపారు.

హైదరాబాద్‌లో మై హోం సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న, విస్తరిస్తున్న  కాస్మోపాలిటన్ మహానగరం. మై హోమ్ గ్రూప్ ఇంజనీరింగ్‌లో ఆవిష్కరణలకు నిబద్ధతతో వాణిజ్య ప్రయోజనాలను సమతుల్యం చేస్తుంది. మేము సృష్టించే గృహాల నుంచి పునరుత్పాదక శక్తిలో పెరుగుతున్న పెట్టుబడుల వరకు, మనం చేసే ప్రతిదీ భవిష్యత్తు కోసం మన దృష్టి నుంచే వస్తుంది. 

రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్‌లలో మా నైపుణ్యం అనేది.. మా ట్రాక్ రికార్డ్‌లో ప్రతిబింబిస్తుంది. మొత్తం 37 మిలియన్ sft బిల్ట్- అప్ ఏరియా డెలివరీ చేయబడింది. 32 మిలియన్ sft యాక్టివ్ నిర్మాణంలో ఉంది. పైప్‌లైన్‌లో పది మిలియన్ల sft అనేది మై హోమ్ ట్రాక్ రికార్డ్.

దాదాపు 24 సంవత్సరాలుగా.. మై హోమ్ ఇండస్ట్రీస్ బ్రాండ్ పేరు "మహా సిమెంట్"తో 10 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ సిమెంట్, క్లింకర్‌ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో మహా సిమెంట్స్ శ్రేణి ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. ISO 9001-2015, ISO 14001-2015, OHSAS 18001-2007 సర్టిఫికేట్స్, అలాగే 2017లో సుస్థిరత కోసం గోల్డెన్ పీకాక్ అవార్డు, మహాసిమెంట్‌కు విశ్వసనీయతను అందిస్తాయి.

మా వ్యవస్థాపకుడి ఆదర్శప్రాయమైన దూరదృష్టితో సాధికారత పొంది, మై హోమ్ గ్రూప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, విద్య, ఆరోగ్యం, పర్యావరణ సుస్థిరత, ధార్మిక కారణాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా సామాజిక బాధ్యతను కోల్పోకుండా.. సంవత్సరానికి స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios