Asianet News TeluguAsianet News Telugu

Meesho: ఆరు లక్షల విక్రేతల మైలురాయిని చేరుకున్న మీషో...హైదరాబాద్‌లో ఆరు రెట్లు కస్టమర్ల వృద్ధి

భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఇంటర్నెట్‌ కామర్స్‌ కంపెనీ, మీషో  తాము ఆరు లక్షల విక్రేతల రిజిస్ట్రేషన్‌లను తమ ప్లాట్‌ఫామ్‌పై అధిగమించినట్లు వెల్లడించింది.  ఏప్రిల్‌ 2021 తరువాత  ఏడు రెట్ల వృద్ధిని ఇది నమోదు చేసింది.  

Meesho Crosses 6 Lakh Vendor Registration on Platform
Author
Hyderabad, First Published May 25, 2022, 6:16 PM IST

గత సంవత్సర కాలంగా భారీ సంఖ్యలో చిరు వ్యాపార సంస్ధలకు వేదికగా మారిన  మీషో ఆరు లక్షల విక్రేతల రిజిస్ట్రేషన్‌లను అందుకుంది. దీనికి పరిశ్రమలో మొట్టమొదటిసారిగా కంపెనీ ప్రారంభించిన కార్యక్రమాలైనటువంటి  ‘జీరో కమీషన్‌ అండ్‌ జీరో పెనాల్టీ’ వంటివి తోడ్పడ్డాయి. ఈ విక్రేతలలో దాదాపు సగం మంది విక్రేతలు కేవలం మీషోపై మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తద్వారా దేశవ్యాప్తంగా చిరు, మధ్య తరహా వ్యాపార సంస్ధలకు ప్రాధాన్యతా ఈ–కామర్స్‌ వేదికగా మీషో నిలిచింది.

హైదరాబాద్‌ నగరంలో ఈ ప్లాట్‌ఫామ్‌పై విక్రేతల సంఖ్య పరంగా అత్యంత ఆకర్షణీయంగా ఆరు రెట్ల వృద్ధి నమోదు అయింది. దీనితో పాటుగా మే 2021 నుంచి ఆర్డర్ల సంఖ్య పరంగా ఏడు రెట్ల వృద్ధి ఇక్కడ కనిపించింది. ఈ నగరంలో అత్యధికంగా విక్రయించబడిన విభాగాలలో అప్పెరల్‌, ఆభరణాలు, హోమ్‌ డెకార్‌, ఫర్నిషింగ్స్‌, వ్యక్తిగత సంరక్షణ, వెల్‌నెస్‌ వంటివి ఉన్నాయి.

మీషోపై దాదాపు 70% మంది విక్రేతలు టియర్‌ 2 నగరాలైనటువంటి అమృత్‌ సర్‌, రాజ్‌కోట్‌, తిరుప్పూర్‌ లాంటి చోట్ల నుంచి ఉన్నారు. ఈ కంపెనీ దాదాపు ఒక లక్ష మంది చిరు వ్యాపార వేత్తలను లక్షాధికారులుగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించింది. అంతేకాదు, జనవరి 2021 నుంచి 5వేల మంది కోటీశ్వరులుగా మారారు. భారీ సంఖ్యలో వైవిధ్యమైన అభిరుచులు కలిగిన వినియోగదారులను చేరుకోవడం ద్వారా  ఈ విక్రేతల సంపాదనా సామర్థ్యం గణనీయంగా వృద్ధి చెందింది.

ఈ వృద్ధి గురించి లక్ష్మీ నారాయణ్‌  స్వామినాథన్‌, సీఎక్స్‌ఓ, సప్లయ్‌ గ్రోత్‌– మీషో మాట్లాడుతూ ‘‘ఎంఎస్‌ఎంఈలకు అత్యధిక వృద్ధి మరియు లాభాల స్వీకరణను అందించే వేదికను నిర్మించాము. మీషోపై విక్రేతలు తమ ఆదాయం ఏప్రిల్‌ 2021 తరువాత మూడు రెట్లు పెరగడాన్ని చూశారు. చిరు వ్యాపార సంస్ధలు తమ పూర్తి సామర్ధ్యాన్ని చేరుకోవడంలో  మీషో పోషిస్తున్న పాత్ర పట్ల మేము చాలా సంతృప్తికరంగా ఉన్నామన్నారు.

ఆ తరువాత, హైదరాబాద్‌ నగరం మాకు  అత్యంత కీలకమైన నగరాలలో ఒకటి. మా ప్లాట్‌ఫామ్‌పై  చేరిన విక్రేతల సంఖ్య పరంగా 8% వృద్ధిని ఇక్కడ మేము చూశాము. మేము ఇంటర్నెట్‌ వాణిజ్యంను ప్రజాస్వామ్యీకరిస్తున్నామంటే,  దానర్థం మేము విక్రేతలకు అత్యంత అనుకూలమైన పోటీ వాతావరణం సృష్టిస్తున్నామని. నేడు,  విక్రేతలు ఉన్న ప్రాంతాలు లేదంటే ప్రైవేట్‌ లేబుల్‌ ప్లే లేదా హోల్‌సేల్‌ ప్లే అంటూ వారిని వేరు చేయకుండా  ఒకే తీరుగా పరిగణిస్తోన్న ఒకే ఒక్క  వేదిక మీషో. మా విక్రేతల అనుకూల కార్యక్రమాల ద్వారా ,  100 మిలియన్‌లకు పైగా చిరు వ్యాపార సంస్థలను ఆన్‌లైన్‌లోకి విజయవంతంగా తీసుకురావాలనే లక్ష్య సాకార దిశగా వెళ్లనున్నాం ’’ అని అన్నారు. 

హైదరాబాద్‌ నుంచి మీషో విక్రేత రాఘవేందర్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘సాఫ్ట్‌బ్యాంక్‌ వెన్నంటి ఉందని తెలిసిన తరువాత నేను మీషో వేదికపై చేరాను. ఈ ప్లాట్‌ఫామ్‌ యొక్క వినియోగదారుల అనుకూల  ఆన్‌బోర్డింగ్‌ ప్రక్రియ పూర్తి ఉపయుక్తంగా ఉంటుంది. మరీముఖ్యంగా,  గతంలో అసలు ఆన్‌లైన్‌ ఉనికి లేనటువంటి విక్రేతలకు ఇది మరింత సహాయకారిగా ఉంటుంది. అదనంగా, దేశవ్యాప్తంగా టియర్‌ 2 + ప్రాంతాల వ్యాప్తంగా గరిష్ట చేరిక కలిగిన వేదికగానూ ఇది నిలుస్తుంది’’ అని అన్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఎలకా్ట్రనిక్స్‌ , కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన రాఘవేందర్‌, ఈ –కామర్స్‌ విభాగాన్ని పూర్తిగా అన్వేషించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ లక్ష్యంతోనే రాఘవేందర్‌ ట్వీకీమాడ్‌ ను ప్రారంభించారు.  మొబైల్‌ ఫోన్‌ యాక్ససరీలను ఆయన విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వద్ద 30 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన తన వ్యాపారాన్ని కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌, అప్పెరల్‌తో పాటుగా హోమ్‌,  కిచెన్‌ విభాగాలకు సైతం విస్తరించాలనుకుంటున్నారు.

మీషో ఓ శక్తివంతమైన డాటా ఆధారిత నమూనాను రూపొందించింది. ఇది వినియోగదారులకు స్నేహ పూర్వక అనుభవాలను సృష్టించడంలో సహాయపడటంతో పాటుగా విక్రేతలకు ఇబ్బంది కలిగించే అంశాలను పరిష్కరించడంలో మరియు ఈ–కామర్స్‌ పర్యావరణ వ్యవస్ధకు మరింత పారదర్శకతను పరిచయం చేయడంలో సహాయపడింది.

భారతదేశంలో  అత్యధిక శాతం చిరు వ్యాపార సంస్ధలు సాంకేతికంగా వెనుకబడి ఉండటంతో పాటుగా  మొబైల్‌ ఫస్ట్‌ సంస్థలు  కూడా  కాదు. భారతదేశంలో  చిరు వ్యాపార సంస్థలను డిజిటైజేషన్‌ దిశగా నడపడానికి కంపెనీ చేస్తోన్న ప్రయత్నాలలో భాగంగా  వినియోగదారులు మరియు విక్రేతలకు ఇంటిగ్రేటెడ్‌ ఈ–కామర్స్‌ మొబైల్‌యాప్‌ను ఆవిష్కరించిన మొట్టమొదటి భారతీయ  కంపెనీ మీషో. ఈ యాప్‌ ద్వారా, ఆర్డర్‌ ప్రాసెసింగ్‌, చెల్లింపుల ట్రాకింగ్‌  లేదా  ఇన్వెంటరీ నిర్వహణ  ద్వారా విక్రేతలు తమ వ్యాపారాలను అత్యుత్తమంగా నిర్వహించగలరు.

Follow Us:
Download App:
  • android
  • ios