Maruti Suzuki WagonR: రూ. 7 లక్షలు విలువ చేసే మారుతి వ్యాగన్ ఆర్ కారు కేవలం రూ. 2 లక్షలకే కొనే చాన్స్..
మార్కెట్లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) ధర రూ. 5.54 లక్షల నుండి రూ. 7.42 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. బెస్ట్ మైలేజ్ కార్లను క్లెయిమ్ చేసే పెద్ద సంఖ్యలో కార్లు మార్కెట్‌లో ఉన్నాయి, వీటిలో గరిష్ట సంఖ్యలో హ్యాచ్‌బ్యాక్ కార్లు ఉన్నాయి. ప్రస్తుత అత్యుత్తమ మైలేజ్ కార్లలో ఒకటి మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR), దాని మైలేజీతో పాటు దాని ధర, బూట్ స్పేస్, క్యాబిన్ స్పేస్ కూడా చాలా కలిసి వస్తోంది.
మీరు షో రూమ్ నుండి మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) కొనుగోలు చేస్తే, దీని కోసం మీరు రూ.5.54 లక్షల నుండి రూ.7.42 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. మీరు ఈ కారును ఇష్టపడితే, కొనుగోలు చేయడానికి బడ్జెట్ లేకపోతే, సెకండ్ హ్యాండ్ వాగన్ఆర్ మోడల్‌పై లభించే చౌక ఆఫర్‌ల వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) సెకండ్ హ్యాండ్ మోడల్స్‌పై ఈ ఆఫర్‌లు వివిధ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ల నుండి సేకరించడం జరిగింది. ఇందులో మీరు మూడు రకాల మంచి డీల్స్ తెలుసుకోవచ్చు.
సర్టిఫైడ్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR)
సర్టిఫైడ్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR)పై మొదటి చౌక డీల్ మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఢిల్లీతో మారుతి వ్యాగన్ఆర్ 2015 మోడల్ అందుబాటులో ఉంచారు. ఈ కారు ఓనర్ ఫస్ట్ హ్యాండ్ వాడారు. ఇది ఇప్పటివరకు 90 వేల కిలోమీటర్లు నడిచింది. కంపెనీ నుండి ఈ కారు కోసం రూ. 1,99,000 ధర నిర్ణయించారు, దీనిపై కంపెనీ ఫైనాన్స్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఇది కాకుండా, ఈ కారు కొనుగోలుపై ఆరు నెలల వారంటీ, 3 ఉచిత సర్వీసులు కూడా ఉన్నాయి.
సర్టిఫైడ్ మారుతి వ్యాగన్ఆర్
సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) పై మరో చౌక ఆఫర్ DROOM వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో మారుతి వ్యాగన్ఆర్ 2016 మోడల్ ఇక్కడ చూపించారు. ఈ కారు ధర రూ. 2.5 లక్షలుగా నిర్ణయించారు. ఈ కారు కొనుగోలుపై సులభమైన డౌన్ పేమెంట్‌తో కూడిన ఫైనాన్స్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంటుంది.
>> మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR)పై మరో డీల్ OLXలో అప్‌లోడ్ చేసి ఉంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో మారుతి వ్యాగన్ఆర్ 2017 మోడల్ ఇక్కడ లిస్ట్ అయి ఉంది. మారుతి వ్యాగన్ఆర్ ఈ మోడల్ కోసం విక్రేత రూ. 3.5 లక్షల ధరను ఉంచారు, అయితే కొనుగోలు చేసిన తర్వాత విక్రేత ఎలాంటి ఫైనాన్స్ ప్లాన్ అందించడం లేదు.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR)లో అందుబాటులో ఉన్న ఈ ఆఫర్‌ల వివరాలను చదివిన తర్వాత, మీరు మీ బడ్జెట్ మరియు ఎంపిక ప్రకారం ఏదైనా ఎంపికను కొనుగోలు చేయవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో ఏదైనా కారును కొనుగోలు చేసే ముందు, మీరు తప్పనిసరిగా లొకేషన్‌కి వెళ్లి దాని ఒరిజినల్ కండిషన్, పేపర్లను చెక్ చేసుకోవాలి, తద్వారా డీల్ పూర్తయిన తర్వాత మీరు ఎటువంటి నష్టాన్ని ఎదర్కోవాల్సిన అవసరం ఉండదు.