కొత్త ధరల ప్రకారం, ఆగస్టు 1 నుండి అంటే ఈ రోజు ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ రూ. 1976.50కి అందుబాటులో ఉంటుంది, అయితే అంతకుముందు దీని ధర రూ.2012.50.

పెరిగిన ఎల్‌పిజి ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సోమవారం ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. చమురు కంపెనీలు ఎల్‌పీజీ ధరలను తగ్గించాయి. ఇప్పుడు వాణిజ్య సిలిండర్ల ధర రూ.36 తగ్గనున్నాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 

కొత్త ధరల ప్రకారం, ఆగస్టు 1 నుండి అంటే ఈ రోజు ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ రూ. 1976.50కి అందుబాటులో ఉంటుంది, అయితే అంతకుముందు దీని ధర రూ.2012.50. అంతేకాకుండా కోల్‌కతాలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ రూ.2095.50, ముంబైలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ రూ.1936.50, చెన్నైలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ రూ.2141గా ఉంది. హైదరాబాద్‌లో ధర రూ.2197.50. స్థానిక వ్యాట్‌పై ఆధారపడి రాష్ట్రానికి రాష్ట్రానికి ధరలు మారుతూ ఉంటాయి.

వాణిజ్య సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు తగ్గించినప్పటికీ డొమెస్టిక్ సిలిండర్ల ధరలు మాత్రం అలాగే ఉన్నాయి. 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ పాత ధరకే లభిస్తుంది. జూలై 6న దీని ధర భారీగా పెరిగింది. దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు రూ.50 వరకు పెంచాయి. అప్పటి నుంచి దీని ధర రూ. 1000 దాటింది. ప్రస్తుతం 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ఢిల్లీలో రూ.1053, ముంబైలో రూ.1053, కోల్‌కతాలో రూ.1079, చెన్నైలో రూ.1068.50గా ఉంది. 


గత నాలుగు నెలల్లో భారత్‌లో ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌లపై తగ్గింపు ఇది నాలుగోసారి. అంతకుముందు జూన్‌లో కేంద్ర ప్రభుత్వం 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ల ధరలను సిలిండర్‌కు రూ.135 తగ్గించింది. 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధర జూలై 7న రూ.50 పెరిగింది. ఇప్పుడు సిలిండర్‌కు రూ.1090.50 చెల్లిస్తున్నారు.