LIC IPO: ఎల్ఐసీ ఐపీఓ కీలక తేదీలు ఈ వారంలోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే వీలుంది. తాజాగా పబ్లిక్‌ ఇష్యూ పరిమాణాన్ని భారీగా తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా దాదాపు రూ. 65,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావించిన్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం రూ.30 వేల కోట్లు మాత్రమే సమీకరించాలని ఆలోచిస్తున్నట్లు ఈ మేరకు పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. 

LIC IPO: మార్కెట్ బాహుబలి ఐపీవోగా వస్తున్న LIC IPO కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోందా, అనే అనుమానాలు ఉత్కంఠతను రేపుతున్నాయి. దాదాపు రూ.65,000 కోట్ల ఎల్‌ఐసీ బాహుబలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)పై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్పాయి. సెబీకి సమర్పించిన పత్రాల ప్రకారం వచ్చే నెల 12లోగా ఎల్‌ఐసీ ఐపీఓ జారీ చేయవచ్చనే సూచనలు తెలుస్తోంది. అయితే తాజాగా మరికొంత ముందే LIC IPO వస్తోందని తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఎఫ్‌పీఐల అమ్మకాలు కేంద్ర ప్రభుత్వాన్ని సందిగ్ధంలో పడేశాయి. ముఖ్యంగా మే 12లోపు ఐపీఓ సాధ్యం కాకపోతే మళ్లీ జూన్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆధారంగా ఎల్‌ఐసీ విలువను మదింపు చేసి సెబీకి సమర్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయి సెబీ ఆమోదం లభించినా ఆగస్టు లేదా సెప్టెంబరులోగానీ ఎల్‌ఐసీ ఐపీఓ సాధ్యం కాదు. 

ఇదిలా ఉంటే LIC IPO కోసం వెయిటింగ్ టైం ముగింపునకు వచ్చేసిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే నెల ప్రారంభంలో LIC IPO వచ్చే అవకాశం ఉందని పేర్కొంన్నారు. సోర్సెస్ ద్వారా వస్తున్న సమాచారం ప్రకారం మే 2న ఐపీవో ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు బయటకు వస్తున్నాయి. 

వచ్చే వారం, జీవిత బీమా సంస్థ LIC IPO (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ధరల బ్యాండ్‌ను నిర్ణయించడంతో సహా, ప్రభుత్వం తన మార్కెట్ ఇష్యూ తేదీని ప్రకటించవచ్చనే వార్తలు వస్తున్నాయి. 

ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా దాదాపు రూ.65,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పుడు దీని ద్వారా రూ.30 వేల కోట్లు మాత్రమే సమీకరించాలని ఆలోచిస్తోంది. ఇందులో రూ.21,000 కోట్లు పబ్లిక్ ఇష్యూ ద్వారా, రూ.9,000 కోట్లు గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా సమీకరించే అవకాశం ఉంది. LIC IPOకు సంబంధించిన ఈ సమాచారాన్ని బిజినెస్ స్టాండర్డ్‌ పోర్టల్ పేర్కొంది. 

ఐపీఓ గ్రీన్‌ షూ ఆప్షన్‌ ద్వారా రూ. 9000 కోట్ల విలువైన అదనపు షేర్ల జారీ చేసేందుకు ఇప్పటికే సెబీ నుంచి అనుమతి తీసుకుంది. మార్కెట్‌ లో అన్ని పరిస్థితులు సానుకూలంగా ఉండి, సబ్‌స్క్రిప్షన్‌ ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం గ్రీన్‌ షూ ఆప్షన్‌ ద్వారా ఈ అదనపు షేర్లను కేటాయిస్తారు. రూ.9,000 కోట్లు విలువ చేసే షేర్లను ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ గడువు ముగిసిన తర్వాత కూడా మదుపర్లకు కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా పబ్లిక్‌ ఇష్యూ విలువ రూ.30,000 కోట్లకు చేరుతుంది.

మే మొదటి వారంలో ఐపీఓ రానుంది
ఎల్‌ఐసీ ఐపీఓ మే 2న ప్రారంభం కావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. పరిమాణం తగ్గినప్పటికీ, ఇది ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ అవుతుంది. ఇంతకుముందు పేటీఎం ఐపీఓ ద్వారా రూ.18,300 కోట్లు సమీకరించింది. ఈ జీవిత బీమా దిగ్గజంలో ప్రభుత్వం తన 5 శాతం వాటాను విక్రయించాలనుకుంటోంది. ప్రస్తుతం ఈ కంపెనీలో ప్రభుత్వం 100% వాటాను కలిగి ఉంది.

విలువ భారీగా కట్ 
కంపెనీ విలువ కూడా రూ.6 లక్షల కోట్లకు తగ్గినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎల్‌ఐసి ఐపిఓ కోసం ఫిబ్రవరి 2022లో మార్కెట్ రెగ్యులేటర్ సెబికి సమర్పించిన పత్రాలలో, ఐపిఓ ద్వారా రూ. 12 లక్షల కోట్ల మార్కెట్ విలువతో సుమారు రూ.65,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొంది. ఎల్ఐసీ విలువలో భారీగా కోత కారణంగా ఇప్పుడు దాని ఐపీఓ విజయవంతమయ్యే అవకాశాలు చాలా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు దీని ద్వారా గరిష్ట ప్రయోజనం పొందాలనేది ప్రభుత్వ ప్రయత్నంగా ఉంది. 

గ్రీన్ షూ ఆప్షన్ కింద, IPOని తీసుకువచ్చే కంపెనీకి మరిన్ని ఇష్యూలను ఉంచుకునే అవకాశం ఇవ్వబడింది, తద్వారా మార్కెట్ డిమాండ్, పరిస్థితులకు అనుగుణంగా IPO పరిమాణం మారుతుంది. అలాగే కంపెనీ షేర్ల లిస్టింగ్ కూడా మంచి ధరకే జరగాల్సి ఉంది. ఇది లిస్టింగ్ సమయంలో ఇష్యూ ధర కంటే తక్కువగా ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు.