Asianet News TeluguAsianet News Telugu

ఒక్కరోజులో 3 రోల్స్ రాయిస్ కార్లు కొన్న కళ్యాణ్ జ్యువెలరీ అధినేత.. అక్షరాల వీరి ధర ఎంతంటే !

ఇండియా  సహా విదేశాలలో కళ్యాణ్ జ్యువెలర్స్  బ్రాంచెస్  ప్రారంభించిన ప్రముఖ దక్షిణ భారత వ్యాపారవేత్త టిఎస్ కళ్యాణరామన్ కారు కొనడం సంచలనం సృష్టించారు. ధనవంతులైన వ్యాపారవేత్తలు ఖరీదైన కార్లను కొనుగోలు చేయడంలో ప్రత్యేకత ఏంటి  అనుకుంటున్నారా.. ? ఎందుకంటే కళ్యాణరామన్ ఒకే రోజు 3 రోల్స్ రాయిస్ కల్లినన్ కార్లను కొనుగోలు చేశారు.  
 

Kalyan Jewelery chairman  bought 3 Rolls Royce cars in one day,  price is Rs 25 crore!-sak
Author
First Published Mar 22, 2024, 7:38 PM IST

ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ధనవంతులు విలాసవంతమైన, ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం సర్వసాధారణం. కస్టమైజ్డ్ కారు, ప్రత్యేక నంబర్ ప్లేట్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు భారతదేశపు అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాపారవేత్త కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత TS కళ్యాణరామన్ ఒకే రోజులో 3 రోల్స్ రాయిస్ కల్లినన్ SUV కార్లను కొనుగోలు చేశారు. వీటి  విలువ దాదాపు 25 కోట్ల రూపాయలు.

కళ్యాణ్ గ్రూప్ యజమాని టిస్ కళ్యాణరామన్ ఒకే రోజు మూడు రోల్స్ రాయిస్ కల్లినన్ కార్ల  డెలివరీ పొందారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కళ్యాణరామన్ రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్ అండ్  మరో రెండు సాధారణ కులినన్ కార్లను కొనుగోలు చేశారు. ఈ మూడు కార్ల ఎక్స్-షోరూమ్ ధర రూ.25 కోట్లు.

కేరళకు చెందిన టీఎస్ కళ్యాణరామన్ ఈ కారును కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు. కేరళలో ఇంత ఖరీదైన కార్లను ఏకంగా ఒకేసారి కొనుగోలు చేసిన ఘనత కల్యాణరామన్‌కు దక్కింది. ఇది మాత్రమే కాదు, కేరళలో బ్లాక్ బ్యాడ్జ్ రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసిన మొదటి కేరళీయుడు కూడా ఇతనే.

కళ్యాణరామన్ కార్ కలెక్షన్‌లో అనేక విలాసవంతమైన ఇంకా ఖరీదైన కార్లు ఉన్నాయి. దాదాపు అన్ని లగ్జరీ బ్రాండ్ల కార్లు కల్యాణరామన్ వద్ద  ఉన్నాయి. కళ్యాణరామన్‌కు రోల్స్ రాయిస్ బ్రాండ్ కారు కొత్త కాదు. అతని దగ్గర  ఇప్పటికే రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ 1 అండ్  ఫాంటమ్ సిరీస్ 2 తో  మొత్తం 3 కార్లు  ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్లకి మరో మూడు కార్లు వచ్చి చేరాయి. 

ఇవి కాకుండా కళ్యారామన్‌కు ప్రైవేట్ జెట్  కూడా ఉంది. కళ్యాణరామన్ రూ.178 కోట్లతో ఎంబ్రేయర్ లెగసీ 650 జెట్‌ను కొనుగోలు చేశారు. ఇది కాకుండా, అతను బెల్ 427 హెలికాప్టర్ను కూడా  కొన్నాడు. ఈ హెలికాప్టర్ ధర 48 కోట్ల రూపాయలు.

1993లో కళ్యాణ్ జ్యువెలర్స్   మొదటి ఆభరణాల స్టోర్ ప్రారంభించింది. ఇప్పుడు దేశ విదేశాల్లో 200కి పైగా బ్రాంచీలు  ఉన్నాయి. UAE, ఖతార్, కువైట్, ఒమన్ సహా విదేశాలలో 30కి పైగా బ్రాంచీలు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios