జియోలో అన్లిమిటెడ్ 5జి డేటా సేవలు పొందాలంటే ఇంత తక్కువ చెల్లిస్తే సరిపోతుందా? ఇంత తక్కువలో 5జీ సేవలు మీరు ఎక్కడా పొందలేరు. అద్భుతమైన ఈ డాటా ప్లాన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
దేశవ్యాప్తంగా జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పాటు పోటీపడి నెట్వర్క్ సేవలు అందిస్తున్నాయి. వీటితో పోటీ పడుతూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ కూడా టెలికాం సేవలను అందిస్తోంది. అయితే కొన్నాళ్ల క్రితం జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచాయి. ఈ చర్య వాటి కొంప ముంచిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కంపెనీల వినియోగదారులు చాలా మంది బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు.
తగ్గుతున్న రీఛార్జ్ ధరలు
దీంతో ప్రైవేట్ టెలికాం కంపెనీలు పోటీ పడి తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. ఆ కోవలోనే జియో రూ.198 ధర కలిగిన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2 జిబి డేటా లభిస్తుంది. అంతేకాకుండా అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా పొందొచ్చు. వీటితో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా లభిస్తాయి.
ఉచితంగా జియో సబ్స్క్రిప్షన్స్
ఈ రీఛార్జ్ ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్లాన్‌లో 5జి అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది. మీ వద్ద 5జి స్మార్ట్‌ఫోన్ ఉంటే అన్లిమిటెడ్ 5జి డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇంత తక్కువలో 5జీ సేవలు అందిస్తుండటం జియోకే సొంతమైంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ మొత్తం 14 రోజులు మాత్రమే.
జియో మరికొన్ని ప్లాన్స్ ఇవే..
అదేవిధంగా రూ.199 ధర కలిగిన రీఛార్జ్ ప్లాన్‌ను కూడా జియో అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులు. దీని ద్వారా రోజుకు 1.5 జిబి డేటా లభిస్తుంది. రోజువారీ 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపవచ్చు. అన్లిమిటెడ్ కాల్ సౌకర్యం కూడా ఉంది. ఈ ప్లాన్‌లో కూడా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు.
జియో అందిస్తున్న మరో అద్భుతమైన ప్లాన్ ఏంటంటే.. రూ.399 రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా మీరు రోజుకు 2.5 జిబి డేటా పొందవచ్చు. మొత్తం 70 జిబి డేటా లభిస్తుంది. దీనితో పాటు అన్లిమిటెడ్ కాల్ సౌకర్యం, రోజువారీ 100 ఎస్ఎంఎస్లు వంటి ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ లోనూ జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు.
జియో అందిస్తున్న మరో సూపర్ ప్లాన్ ఏంటంటే.. రూ.349 ధర కలిగిన రీఛార్జ్ ప్లాన్. ఇందులో రోజుకు 2జిబి డేటా చొప్పున మొత్తం 56 జిబి డేటా లభిస్తుంది. పైన తెలిపిన రీఛార్జ్ ల మాదిరే ఇందులోనూ అన్లిమిటెడ్ కాల్ సౌకర్యం, రోజువారీ 100 ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసి 28 రోజులు. నాణ్యమైన 5జీ సేవలు పొందాలంటే రిలయన్స్ జియో అందిస్తున్న తక్కువ ధరకు 5జీ ప్లాన్స్ ని రీఛార్జ్ చేసుకోండి.