Jio Financial Services: నేడు స్టాక్ మార్కెట్లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్...రూ.265 వద్ద ఎంట్రీ..
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నేడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి మరో కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. జియో ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమర్జర్ అయినా అనంతరం సరికొత్త కంపెనీగా ఏర్పడింది. కస్టమర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించేందుకు ఈ సంస్థను ప్రారంభించారు.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్ (JFSL) నేడు స్టాక్ మార్కెట్లో చోటు చేసుకుంది. జియో ఫైనాన్షియల్ (JFSL) షేర్ రూ. 265 వద్ద స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది. దీంతో జియో ఫైనాన్స్ సర్వీసెస్ దేశంలోనే రెండవ అతిపెద్ద ఎన్‌బిఎఫ్‌సిగా అవతరించింది.ఇదిలా ఉంటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు మొదటి 10 రోజులు టి-గ్రూప్‌లో ట్రేడ్ అవుతాయి. అంటే 10 రోజుల పాటు స్టాక్‌లో ఇంట్రాడే ట్రేడింగ్ ఉండదు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFSL) అనేది ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి ఇటీవల విడిపోయిన సంస్థ. ఈ కంపెనీ షేర్లు నేడు బిఎస్‌ఇలో రూ.265 వద్ద లిస్ట్ అవడం విశేషం. జూలై 20న ఈ స్టాక్ ప్రీ-లిస్టింగ్ ధర రూ.261.85గా నిర్ణయించారు. జూలై 19 న రికార్డ్ తేదీ ఆధారంగా, రిలయన్స్ వాటాదారులు ప్రతి షేరుకు JFSL యొక్క ఒక షేరును పొందారు.
దేశంలోని రెండవ అతిపెద్ద NBFCగా ఆవిర్భవించిని JFSL
సుమారు రెండు దశాబ్దాల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్‌లో మరో కంపెనీ ద్వారా అడుగుపెట్టనుంది. రూ. 1.65 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జెఎఫ్‌ఎస్) ఆగస్టు 21న బజాజ్ ఫైనాన్స్ తర్వాత రెండవ అతిపెద్ద లిస్టెడ్ ఎన్‌బిఎఫ్‌సిగా మార్కెట్‌లోకి ప్రవేశించింది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ. 4.15 లక్షల కోట్లు అని గమనించాలి. అయితే JFSL కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 1.6 లక్షల కోట్లు అని పేర్కొనవచ్చు. అయితే ఈ రోజు లిస్టింగ్ కూడా ఈ ధర చుట్టూనే జరిగింది. స్టాక్‌లో మరింత పెరుగుదల ఉంటే, అప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుంది.
JFSL మార్కెట్ విలువ బజాజ్ ఇన్వెస్ట్‌మెంట్స్, SBI cards, శ్రీరామ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, Paytm కంటే ఎక్కువగా ఉంటుంది. తాజా షేర్ హోల్డింగ్ విధానం ప్రకారం కంపెనీలో ప్రమోటర్లకు 45.08 శాతం వాటా ఉంది. ఇందులో మ్యూచువల్ ఫండ్స్‌కు 6.27 శాతం, విదేశీ సంస్థలకు 26.44 శాతం వాటా ఉంది. JFSL కంపెనీ ఇప్పటికే బలమైన కస్టమర్ బేస్‌ను కలిగి ఉంది, కంపెనీ ఎక్కువగా కస్టమర్ ఫైనాన్స్ బీమా సేవల నుండి ప్రయోజనం పొందుతుంది.
షేర్ల విభజన జూలై 20న జరిగింది
జూలై 20న, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారం 'స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్'తో పేరుతో విడదీశారు . విభజన తర్వాత, రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ పేరు 'జియో ఫైనాన్షియల్ సర్వీసెస్' (JFSL)గా మార్చబడింది.
విభజన తర్వాత, జూలై 20న జరిగిన ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్‌లో Jio ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ధర రూ.261.85గా నిర్ణయించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాటాదారులు ప్రతి ఒక్క షేరుకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఒక షేరును పొందారు.
కంపెనీ చేయబోయే వ్యాపారాలు ఇవే..
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వినియోగదారు మరియు మర్చంట్ లోన్ వ్యాపారాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చాలా ఫిన్‌టెక్‌ల నుండి భిన్నంగా ఉంటుంది, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్, జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ ఫైనాన్స్ లిమిటెడ్, జియో ఇన్ఫర్మేషన్ అగ్రిగేటర్ సర్వీసెస్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ లిమిటెడ్ రిలయన్స్ ఆర్థిక సేవల వ్యాపారంలో పెట్టుబడి పెట్టాయి.