మీరు 2020-21 ఆర్థిక సంవత్సరానికి లేదా 2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌కి సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను ఇంకా ఫైల్ చేయకుంటే మార్చి 31 వరకు ఫైల్ చేయడానికి మీకు ఇంకా అవకాశం ఉంది. 

ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలుకు చివరి తేదీ సమీపిస్తోంది. కేవలం రెండు రోజుల్లో అంటే మార్చి 31లోపు నింపల్సి ఉంటుంది. ఇలా చేయడంలో విఫలమైతే జరిమానా విధించవచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసేటప్పుడు మీ వద్ద ఏ డాక్యుమెంట్లు ఉంచుకోవాలో, గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటో తెలుసుకోండి.

ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఆదాయపు పన్ను శాఖ విధించిన చివరి గడువు 31 డిసెంబర్ 2021తో ముగిసింది. మీరు 2020-21 ఆర్థిక సంవత్సరానికి లేదా 2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌కి సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను ఇంకా ఫైల్ చేయకుంటే మార్చి 31 వరకు ఫైల్ చేయడానికి మీకు ఇంకా అవకాశం ఉంది. అంటే, ఈ ముఖ్యమైన పని చేయడానికి మీకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ITR పెనాల్టీతో నింపాల్సి ఉంటుంది,
మీ సమాచారం కోసం మీరు 31 డిసెంబర్ 2021లోగా మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయకుంటే మార్చ్ 31 వరకు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ మినహాయింపునిచ్చింది. మార్చి 2022 తరువాత అయితే మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఈ పెనాల్టీ రూ.5000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే మీరు రూ. 1000 జరిమానా చెల్లించాలి. మార్చి 31 తర్వాత రిటర్నులు దాఖలు చేస్తే ఇది మరింత పెరుగుతుంది. మీరు 31 మార్చి 2022 తర్వాత 2021-22 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసినట్లయితే మీరు రూ. 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువ ఉంటే, జరిమానా లేకుండా రిటర్న్‌ను దాఖలు చేయవచ్చని గమనించాలి.


ఇంతకుముందు ఆదాయపు పన్ను శాఖ సమాచారం ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరానికి మార్చి 15 వరకు 6.63 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు జరిగాయి. గతేడాది దాఖలైన ఆదాయపు పన్ను రిటర్న్ కంటే 16.7 లక్షలు ఎక్కువ. 2021-22 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి మొదటి చివరి తేదీ 31 జూలై 2021, తరువాత సెప్టెంబర్ 20 వరకు పొడిగించబడింది. దీని తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2021గా నిర్ణయించింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(1) ప్రకారం, నిర్ణీత గడువులోగా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయనందుకు సెక్షన్ 234A కింద జరిమానా విధించబడటం గమనార్హం. 

రిటర్న్ దాఖలు చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
 వ్యవస్థాపకుడు అండ్ CEO అర్చిత్ గుప్తా ప్రకారం, ITR రిటర్న్‌ను ఫైల్ చేసేటప్పుడు సమాచారాన్ని చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయడం ముఖ్యం. 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి ClearTax CEO అండ్ వ్యవస్థాపకుడు అర్చిత్ గుప్తా ప్రకారం పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానం మధ్య ఎంచుకోవచ్చు, ఇది రాయితీ పన్ను రేట్లను అందిస్తుంది లేదా ఇప్పటికే ఉన్న పన్ను విధానాన్ని అనుసరించడం కొనసాగించవచ్చు. జీతం, క్యాపిటల్ గేన్స్, హౌస్ ప్రాపర్టీ, ఇతర వనరుల నుండి ఆదాయాన్ని ఆర్జించే వ్యక్తులు ప్రతి సంవత్సరం ఏదైనా ఒక పన్ను విధానాలను స్వీకరించే అవకాశం ఉంటుంది. 

ఫారమ్ 26ASతో 
ఏ పన్ను విధానం మీకు అనుకూలంగా ఉందో తెలుసుకోవాలంటే, ముందుగా అన్ని ఆదాయ వనరులు, సంవత్సరంలో చేసిన పన్ను ఆదాలను సేకరించాలి. మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ లేదా బ్యాంక్ డిపాజిట్ల మొదలైన వాటి నుండి మీరు ఆదాయాన్ని సంపాదించి ఉండవచ్చు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ బ్యాంక్ లావాదేవీలను సంగ్రహించడం ద్వారా మీరు మీ బ్యాంక్ ఖాతాకు జమ అయిన ఆదాయాన్ని, సంవత్సరంలో చేసిన పెట్టుబడులను ధృవీకరించవచ్చు. అలాగే, ఫారమ్ 26ASతో మీ ఆదాయం లేదా TDS మొత్తానికి మధ్య ఏదైనా అసమతుల్యత ఉంటే నిర్ధారించుకోండి. ఫారమ్ 26ASలోని సమాచారం తప్పుగా ఉన్నట్లయితే, TDS రిటర్న్‌లో దిద్దుబాట్లు చేయడం ద్వారా డిడక్టర్‌ను సంప్రదించండి, తద్వారా మీ ఫారమ్‌లో సరైన సమాచారం కనిపిస్తుంది.

సరైన ITR ఫారమ్‌ను ఎంచుకోవడం 
పన్ను చెల్లింపుదారులు సరైన ITR ఫారమ్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ఏడు ఐటీఆర్ ఫారమ్‌లను పేర్కొంది. ITR ఫారమ్‌లు ITR-1, ITR-2, ITR-3, ITR-4 వ్యక్తులకు వర్తిస్తాయి. పన్ను చెల్లింపుదారులు వారి ఆదాయం, క్యాటగిరి ఆధారంగా ఫారమ్‌ను ఎంచుకోవాలి. ITR ఫారమ్‌లు సరిగ్గా ఎంచుకోకపోతే, ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు అందిన తర్వాత పన్ను చెల్లింపుదారు మళ్లీ ITRని ఫైల్ చేయాల్సి ఉంటుంది.

ఒకసారి నింపిన ఫారమ్‌ని చెక్ చేయండి
ఫారం 26AS నుండి జీతం ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్, డివిడెండ్ అండ్ ఇతర సమాచారం వంటి ప్రీ-ఫైలింగ్ సౌకర్యాన్ని ఆదాయపు పన్ను శాఖ ప్రవేశపెట్టింది. ఈ సమాచారాన్ని తప్పనిసరిగా ధృవీకరించాలి అలాగే ఆదాయపు పన్ను రిటర్న్‌లో నివేదించని సమాచారాన్ని చేర్చాలి. అలాగే, మీరు సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ వాటి నుండి ఆదాయాన్ని సంపాదించి ఉంటే మీ ఆదాయాన్ని ప్రస్తుత దానితో నివేదించడంలో విఫలమైతే, మీ ఆదాయం మీ ఫారమ్ 26ASలో చూపబడదు. అందువల్ల, మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లో సంపాదించిన ఆదాయాన్ని చేర్చడం మర్చిపోవద్దు. 

రిటర్న్ ఫైల్ చేయడానికి ముందు బకాయి చెల్లింపు చేయండి
దీనితో పాటుగా, రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు తీసుకోవలసిన మరో జాగ్రత్త ఏమిటంటే, మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని గుర్తించడం ఇంకా పన్ను బాధ్యతను లెక్కించడం. వడ్డీని నివారించడానికి, ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి ముందు ఆదాయపు పన్ను బకాయి చెల్లించాలి. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారుడు గడువుకు కట్టుబడి ఉండాలీ. లేకపోతే, ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఆలస్యంగా దాఖలు చేసినందుకు జరిమానా, మిగిలిన ఆదాయపు పన్ను బాధ్యతపై వడ్డీ, నాన్ క్యారీ ఫార్వార్డ్ నష్టం మొదలైన పరిణామాలు ఉండవచ్చు. 

ఈ డాక్యుమెంట్స్ మీ వద్ద ఉంచుకోవడం అవసరం
1- పాన్ కార్డ్
2- ఆధార్ కార్డ్
3- బ్యాంక్ ఖాతా వివరాలు
4- పెట్టుబడి ప్రూఫ్ వివరాలు
5- ఫారం 16

ఇలా ఐటిఆర్ ఫైల్ చేయండి 
ముందుగా (https://eportal.incometax.gov.in/)కి లాగిన్ అవ్వండి. 
మీ యూజర్ IDని ఎంటర్ చేసి, కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి. 
పాస్‌వర్డ్ గుర్తుకు రాకపోతే, ఫర్ గాట్ పాస్‌వర్డ్ ఆప్షన్ ఉపయోగించి మీరు కొత్త పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుక్లోవచ్చు.
ఇప్పుడు లాగిన్ పేజీలో తెరవబడుతుంది, ఇక్కడ ఇ-ఫైల్‌పై క్లిక్ చేయండి (e-file పై క్లిక్ చేయండి).
దీని తర్వాత, మీరు ఫైల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆప్షన్ ఎంచుకోవాలి.
ఇప్పుడు అసెస్‌మెంట్ ఇయర్ 2021-22ని ఎంచుకుని, ఆపై కొనసాగించండి.
దీని తర్వాత మీరు ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ఆప్షన్ పొందుతారు.
మీరు ఆన్‌లైన్‌ని ఎంచుకుని, పర్సనల్ ఆప్షన్ ఎంచుకోండి. 
ఆపై ITR-1 (ITR-1) లేదా ITR-4 ఆప్షన్ ఎంచుకోండి.
మీరు జీతం పొందుతున్నట్లయితే, మీరు ITR-1 ఆప్షన్ ఎంచుకోవాలి. 
దీని తర్వాత ITR రిటర్న్ ఫారమ్ మీ సిస్టమ్‌లో డౌన్‌లోడ్ చేయబడుతుంది.
ఇప్పుడు ఫిల్లింగ్ టైప్‌లో 139(1)- ఒరిజినల్ రిటర్న్‌ని ఎంచుకోండి. ఇది మీరు ఎంచుకున్న ఫారమ్‌ను తెరుస్తుంది.
అందులో అభ్యర్థించిన సమాచారాన్ని నింపి సేవ్ చేసుకోండి. బ్యాంకు ఖాతా వివరాలను సరిగ్గా నింపండి.
ఆన్‌లైన్ ప్రక్రియలో వెరిఫై చేయండి తరువాత రిటర్న్ హార్డ్ కాపీని ఆదాయపు పన్ను శాఖకు పంపండి.