24 మంది దిగుమతిదారులు 11 వేల కోట్ల రూపాయల IGST పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సమాచారం..నోటీసులు పంపిన కేంద్రం
దేశంలోని 24 పెద్ద దిగుమతిదారులు రూ. 11,000 కోట్ల ఇంటిగ్రేటెడ్ GST ఎగవేతను గుర్తించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ (DGGI), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) తెలిపాయి. ఇప్పటివరకు సుమారు 24 కేసుల్లో సుమారు రూ.11,000 కోట్ల చోరీ జరిగినట్లు గుర్తించామని, ఇందుకు సంబంధించి ఏడు యూనిట్లకు నోటీసులు పంపామని ఏజెన్సీ సీనియర్ అధికారి ఓ మీడియా సంస్థకు తెలిపారు.
24 మంది పెద్ద దిగుమతిదారులు రూ. 11,000 కోట్ల ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి ఎగవేతను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) గుర్తించాయి. ఎకనామిక్ టైమ్స్ అందించిన నివేదిక ప్రకారం, ఇప్పటివరకు సుమారు 24 కేసులలో, సుమారు 11,000 కోట్ల రూపాయల ఎగవేతలను గుర్తించినట్లు తెలిపింది. ఈ విషయంలో ఏడు యూనిట్లకు నోటీసులు పంపినట్లు సమాచారం అందుతోంది. ఏజెన్సీ సీనియర్ అధికారి ఎకనామిక్ టైమ్స్ కు తెలిపిన ఇచ్చిన సమాచారం ప్రకారం, గత 20 రోజులలో ముంబై, కోల్‌కతా చెన్నై అధికార పరిధిలోని దిగుమతిదారులకు ఈ నోటీసులు పంపారు.
నివేదికల ప్రకారం, ఇతర దిగుమతిదారులకు కూడా నోటీసులు పంపే ప్రక్రియను ఏజెన్సీలు ప్రారంభించాయి. పన్ను ఎగవేసిన కంపెనీలు స్టీల్, ఫార్మాస్యూటికల్స్, రత్నాలు ఆభరణాలు వస్త్ర వ్యాపారంలో పాలుపంచుకున్నాయి. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాన్ని ఏజన్సీలు తప్పుగా పొందుతున్న అనేక ఉదంతాలు సైతం ఈ సందర్భంగా తెరపైకి వచ్చాయి.
పన్ను ఎగవేతలను పట్టుకునేందుకు రూపొందించిన వ్యవస్థ అయిన అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ ఇన్ ఇన్‌డైరెక్ట్ టాక్సేషన్ (ADVIT) రూపొందించిన డేటా ఆధారంగా, కొంతమంది దిగుమతిదారులు GSTని మార్చడం ద్వారా పన్ను ఎగవేస్తున్నట్లు కనుగొన్నారు. పరోక్ష పన్నుల (ADVIT)లో అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ ఉపయోగాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆలోచిస్తోంది. బోగస్ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు, తప్పుడు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లను గుర్తించేందుకు మే 16 నుంచి రెండు నెలల పాటు ఇంటెన్సివ్ క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు.