టీ కొట్టు నుంచి IAS దాకా: ఆ యువకుడి జీవితం తీస్తే ఓ సూపర్‌హిట్ సినిమా అవుతుంది

గట్టిగా అనుకుంటే IAS అధికారి కూడా అయిపోవచ్చని నిరూపించాడు టీ కొట్టు యజమాని కుమారుడు దేశాల్ దాన్. అలా అని ఏం కష్టపడకుండా సింపుల్‌గా UPSCని క్రాక్ చేసేశాడు అనుకుంటే పొరపాటే. అన్నయ్య మరణం, కోచింగ్ కి డబ్బులు లేని స్థితి, ఇలాంటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. పేదరికంలో పుట్టిన ఆ కుర్రాడు IAS అధికారిగా ఎదిగిన స్ఫూర్తి పయనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Inspiring Journey of Deshal Dan: From Tea Seller's Son to IAS Officer at 24 sns

టీ అమ్మే ఆ తండ్రి ఏ రోజూ అనుకొని ఉండరు తన కొడుకు IAS అధికారి అవుతాడని. ఎందుకంటే ఆ  IAS అధికారి బాల్యం అంతా టీ దుకాణంలోనే ఆడుతూ పాడుతూ సాగిపోయింది. తన తర్వాత ఆ టీ కొట్టు నడిపిస్తే చాలనుకున్న తన కొడుకు మొదటి ప్రయత్నంలోనే  UPSCని క్రాక్ చేసేసరికి ఆ తండ్రి ఆనందానికి అవధులే లేవు.

కుటుంబ నేపథ్యం..
అది రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా సుమలై అనే చిన్న పల్లె. ఆ ఊరికి చెందిన కుశాల్ దాన్ యూనియన్ సర్కిల్‌లో టీ స్టాల్ నిర్వహించేవారు. ఆయనకు అయిదుగురు సంతానం. వచ్చే అంతంత మాత్రం ఆదాయంతోనే పిల్లలను చదివించారు. వారిలో ఇద్దరు కొడుకులు మాత్రం బాగా చదివారు. తండ్రి కష్టాన్ని చూస్తూ పెరిగిన ఆ కుమారులు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలనుకున్నారు. టీ దుకాణంలో తండ్రికి సాయం చేస్తూనే  వారిలో పెద్ద కుమారుడు నేవీలో ఉద్యోగం సంపాదించారు. 

అన్న అకాల మరణం..
అన్న స్ఫూర్తితో ప్రతి తరగతిలో క్లాస్ ఫస్ట్ తెచ్చుకుంటూ చదువు కొనసాగించాడు దేశాల్. అయితే నేవీలో పనిచేస్తున్న తన అన్న అనుకోని ప్రమాదంలో మరణించేసరికి దేశాల్ తట్టుకోలేకపోయారు. ఊహించని ఈ సంఘటనతో తీవ్ర నిరాశ లోకి వెళ్లపోయిన దేశాల్ చదువు మానేద్దామని అనుకున్నారు. కాని ప్రతి మనిషి ఏదో ఒక పర్పస్ కోసం పుడతాడని నమ్మి దేశాల్ కొన్నాళ్ల తర్వాత మళ్లీ లక్ష్యం దిశగా అడుగులు వెయ్యడం ప్రారంభించారు.

తండ్రి ఆశయం సాధించడానికి..
తన పిల్లలు చదువులో రాణించాలని కుశాల్ ఎప్పుడూ కోరుకొనే వారు. అందుకే ఫైనాన్షియల్ గా కష్టంగా ఉన్నప్పటికీ తండ్రి టీ దుకాణం నడుపుతూ తమను చదివిస్తున్నారన్న విషయం ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకొని దేశాల్ చదువు కొనసాగించారు. స్కూల్ చదువు పూర్తయిన తర్వాత తన తెలివి తేటలతో ప్రతిష్టాత్మకమైన IIT జబల్‌పూర్‌లో ఫ్రీ సీట్ సంపాదించారు. బీటెక్ లో కూడా మంచి మార్కులు తెచ్చుకొని UPSCకి ప్రిపేర్ అవ్వడం ప్రారంభించారు. 

24 ఏళ్లకే IAS
దేశాల్ దాస్ తొలి ప్రయత్నంలోనే UPSC పరీక్షలో 82వ ర్యాంక్‌ సాధించి అందరినీ ఆశ్యర్య పరిచారు. పేద కుటుంబంలో జన్మించిన దేశాల్ టీ కొట్టులో తండ్రికి సాయం చేస్తూనే చదువుకొని, అన్న అకాల మరణాన్ని తట్టుకొని తన జీవిత లక్ష్యమైన ఇండియన్ అడ్మినిస్ట్రేసన్ సర్వీసెస్(IAS)లో ఉద్యోగం సంపాదించాడు. కేవలం 24 ఏళ్లకే ఇదంతా సాధించగలిగానంటే తన తండ్రి కుశాల్ దాన్ వల్లేనని గర్వంగా చెబుతారు దేశాల్ దాన్. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొంటే యువత అనుకున్న లక్ష్యాలను కచ్చితంగా సాధించగలరు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios