గత ఐదేళ్లలో అతి తక్కువ... భారీగా తగ్గిన ద్రవ్యోల్బణం
భారతదేశంలో ద్రవ్యోల్బణం భారీగా తగ్గింది. గత నెలలో కేవలం 3.5 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది.
భారతదేశంలో ద్రవ్యోల్భణం భారీగా తగ్గింది. గత 59 నెలల్లోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం 3.5 శాతంగా నమోదయ్యింది. గత త్రైమాసికంలో 5.1 శాతంగా ఉన్న ద్రవ్యోల్భణం జూలైలో కేవలం 3.5 శాతంగా నమోదయ్యింది. ఇదే గత ఐదు సంవత్సరాల్లో అతి తక్కువ.
వినియోగదారులు ద్రవ్యోల్భణం గత సంవత్సరం సరిగ్గా ఇదేనెలలో(జూలై 2023) 7.4 శాతంగా వుంది. దీంతో ఆహార పదార్దాల ధరలు 2.8 శాతం, ధాన్యం ధరలయితే ఏకంగా 8.4 శాతం పెరిగాయి. కానీ ఇప్పుడు ఇదే సమయంలో కాస్త తక్కువగా ద్రవ్యోల్బణం నమోదయ్యింది.
ఆర్థికవేత్తలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 జూలై-సెప్టెంబర్ లో 4.4 శాతం ద్రవ్యోల్బణ అంచనా వేసింది. కానీ ఆశ్చర్యపరుస్తూ జూలై 2024లో ద్రవ్యోల్భణం 3.5 శాతంగా నమోదయ్యింది.