Asianet News TeluguAsianet News Telugu

9 ఏళ్ల మోడీ పాలనలో భారత్ వెలుగుతోంది..ప్రధాని మోదీ విధానాలకు జై కొట్టిన అమెరికన్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ

ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో భారతదేశం పూర్తిగా పునర్వైభవం పొందింది. అమెరికాకు చెందిన వెటరన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. గత తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని, అందుకే భారత్ ప్రపంచంలోనే భారత్ అగ్ర స్థానానికి చేరుకుంటోందని అందులో పేర్కొన్నారు.
 

India shines under Modi's 9-year rule..American bank Morgan Stanley hails Prime Minister Modi's policies MKA
Author
First Published May 31, 2023, 11:46 PM IST

యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశం జర్మనీ మాంద్యంలో కూరుకుపోగా, అమెరికా డిఫాల్టర్‌గా మారే ప్రమాదంలో ఉంది. కరోనా నుంచి చైనా పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి ఆశాకిరణంగా ఆవిర్భవించింది. ఈ ఏడాది కూడా భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని అంచనాలు వెలువడుతున్నాయి.  భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రకాశవంతమైన ప్రదేశంగా చెబుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి దిగ్గజ అమెరికన్ బ్రోకరేజ్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ పేరు కూడా చేరింది. పీఎం మోదీ నాయకత్వంలో భారతదేశం పూర్తిగా మారిపోయిందని, ప్రపంచంలోనే గొప్ప స్థానాన్ని సాధించే దిశగా పయనిస్తోందని పేర్కొంది. 

మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం మార్పు చెందిందని,  నేడు ప్రపంచ పటంలో ఒక స్థానాన్ని పొందే మార్గంలో ఉందని పేర్కొంది. ఈ రోజు ఆసియా ప్రపంచ వృద్ధిలో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని నివేదిక పేర్కొంది. ఒకప్పుడు భారతదేశంలో పెట్టుబడి పెట్టాలంటే విదేశీ పెట్టుబడిదారులు ఆలోచించే వారని, అయితే 2014 నుండి సంభవించిన మార్పులతో సులభతరం అయ్యిందని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండో ఆర్థిక వ్యవస్థగానూ, గత 25 ఏళ్లలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న స్టాక్ మార్కెట్‌గానూ భారతదేశం తన సామర్థ్యాన్ని నిరూపించిందని పేర్కొన్నారు. 

10 సంవత్సరాలలో పునరుజ్జీవం
ఒక దశాబ్దం లోపే భారతదేశం మారిపోయిందని నివేదిక చెబుతోంది. దాని ప్రకారం, 'ఈ భారతదేశం 2013 కంటే భిన్నంగా ఉంటుంది. 10 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో భారతదేశం ప్రపంచ వ్యవస్థలో స్థానం సంపాదించింది. 2014లో ప్రధాని మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 10 ప్రధాన మార్పులను జాబితా చేసింది. 

>> భారతదేశంలో కార్పొరేట్ పన్ను రేటును ఇతర దేశాలతో సమానంగా తీసుకొచ్చినట్లు బ్రోకరేజ్ తెలిపింది. దీనికి తోడు మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీంతో పాటు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నిరంతరం పెరుగుతోందని నివేదికలో పేర్కొంది. అలాగే, జీడీపీలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయని, ఇది వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థకు సంకేతం.

>>  వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, భారతదేశంలో మాంద్యం వచ్చే అవకాశం లేదు. మాంద్యం వచ్చే అవకాశం సున్నా శాతం ఉన్న పెద్ద దేశాలలో భారతదేశం మాత్రమే ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటున్నదని తాజా గణాంకాలు ధృవీకరిస్తున్నాయి. IMF ప్రకారం, ఈ సంవత్సరం కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. 

>> ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లతో గత రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఏప్రిల్‌లో చాలా ఆటో కంపెనీల అమ్మకాలు బలంగా ఉన్నాయి. ప్రపంచం మాంద్యం భయంతో గడుపుతుండగా, భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఈ అంశాలన్నీ సూచిస్తున్నాయి.

>> భారత్ మరోసారి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. గత కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు కారణంగా ఫ్రాన్స్ ను వెనక్కి నెట్టి భారత్ ఈ స్థానాన్ని సాధించింది. జనవరిలో ఫ్రాన్స్ ఈ ర్యాంకింగ్‌లో భారత్‌ను అధిగమించింది. కానీ భారతీయ స్టాక్ మార్కెట్లు మార్చి 28 నుండి స్థిరమైన పెరుగుదలను చూపుతున్నాయి. భారతీయ ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. భారతదేశ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3.31 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో భారత్ మరోసారి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios