ఏటీఎం ద్వారా నెలకు రూ.60 వేలు సంపాదించొచ్చు. ఎలాగో తెలుసా
కాదేదీ కవితకు అనర్హం కాదన్నట్టు.. ప్రస్తుత కాలంలో కాదేదీ వ్యాపారానికి అనర్హం. అందుకే తెలివి తేటలు ఉపయోగించి ATM మిషన్ ఏర్పాటు చేసుకుంటే, ఏ పని చేయక్కరలేకుండానే నెలకు రూ.60 వరకు సంపాదించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ ఇండియా పేరుతో యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నాయి. నూతన స్టార్ట్‌అప్‌లను ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మనం ఏటీఎంలు ఏర్పాటుచేసుకొని డబ్బులు సంపాదించవచ్చు. సాధారణంగా బ్యాంకులు వినియోగదారులతో వ్యాపారం చేస్తుంటాయి. లోన్లు ఇచ్చి వడ్డీలు కట్టించుకుంటాయి. అయితే మనమే బ్యాంకులతో వ్యాపారం చేయవచ్చు. నికర ఆదాయం కూడా పొందవచ్చు. అదెలా అంటే..
ATM ఏర్పాటుకు అవకాశం ఇలా..
చాలా బ్యాంకులు ఏటీఎంలు వాటంతట అవే ఏర్పాటు చేయవు. ఏటీఎంలు ఏర్పాటు చేయమని ప్రైవేటు ఏజెన్సీలకు టెండర్లు ఇస్తాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు మాత్రం అవే ఏటీఎంలు సొంతంగా నిర్వహిస్తాయి. భారతదేశంలో అత్యంత పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆప్ ఇండియా(SBI) తన ఏటీఎంల ఏర్పాటును ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తుంది. వారిని మనం సంప్రదించి SBI బ్యాంకు ఏటీఎంను ఏర్పాటు చేసుకోవచ్చు.
ప్రైవేటు ఏజెన్సీలను ఎలా సంప్రదించాలి..
SBI తన సొంత ఏటీఎంలతో పాటు మరికొన్ని చోట్ల ఏటీఎంల ఏర్పాటు, నిర్వహణను టాటా ఇండిక్యాష్, మూత్తూట్ ఏటీఎం, ఇండియా వన్ ఏటీఎం కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చింది. ఈ కంపెనీలకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా మీ గ్రామం, పట్టణం, నగరంలో మంచి సెంటర్లో ఏటీఎం ఏర్పాటు చేయవచ్చు. దీనికి సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2 లక్షలు కట్టాలి. మరో రూ.3 లక్షలు వర్కింగ్ క్యాపిటల్ కింద ఇవ్వాలి. అంటే మొత్తం రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే ఏటీఎం ఏర్పాటు చేయవచ్చు.
దరఖాస్తు ఇలా చేసుకోండి..
ఏటీఎం ఏర్పాటుకు కనీసం 50 నుంచి 60 స్కేర్ ఫీట్ స్థలం ఉన్న గది అవసరం. షట్టర్ డోర్, భద్రతా చర్యలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఈ ఏటీఎం సెంటర్‌కు 24 గంటలు పవర్ ఉండేలా చూడాలి. 1 కె.వి. పవర్ కనెక్షన్ పెట్టాలి. ఈ ఏటీఎంకు 100 మీటర్ల సమీపంలో మరో ఏటీఎం ఉండకుండా చూసుకోవాలి. రోజుకు కనీసం 300 ట్రాన్సాక్షన్స్ జరిగేలా చూడాలి. అప్పుడు మీరు కనీసం నెలకు రూ.60 వేల పైగా సంపాదించవచ్చు.