ముత్యాల నగరి హైదరాబాద్‌లో  తమ వ్యాపార విభాగం, భారతదేశంలో  సుప్రసిద్ధ ఫర్నిచర్‌ మరియు ఇంటీరియల్‌ సొల్యూషన్స్‌ బ్రాండ్‌ గోద్రేజ్‌ ఇంటీరియో తమ నూతన ఔట్‌లెట్‌ను తెరిచిందని  గోద్రేజ్‌ గ్రూప్‌కు చెందిన ప్రతిష్టాత్మక కంపెనీ గోద్రేజ్‌ అండ్‌ బాయ్‌సీ వెల్లడించింది. దాదాపు 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి  ఈ అత్యాధునిక స్టోర్‌ను హీరో కార్తికేయ ప్రారంభించారు. 

Hero Karthikeya Launches Godrej Interio Showroom in Jubilee Hills | తెలంగాణా మరియు దక్షిణ భారతదేశపు మార్కెట్‌లలో గోద్రేజ్‌ ఇంటీరియో యొక్క వాణిజ్య ఉనికికి తగిన శక్తిని ఈ స్టోర్‌ అందించనుంది. ఈ స్టోర్‌ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఉత్పత్తులను భారతదేశంలో అత్యధికంగా విక్రయించబడుతున్న విభాగమైన హోమ్‌ స్టోరేజీ మరియు ఇంటీరియర్‌ సొల్యూషన్స్‌లో అందిస్తుంది. తమ ఓమ్నీ ఛానెల్‌ విస్తరణ వ్యూహంలో భాగంగా గోద్రేజ్‌ ఇంటీరియో , రాబోయే కొద్ది నెలల్లో , హైదరాబాద్‌లోని కొంపల్లి వద్ద ఫ్రాంచైజీ ఔట్‌లెట్‌ను ప్రారంభించనుంది.

నగర మార్కెట్‌ ప్రాముఖ్యతను గురించి గోద్రేజ్‌ ఇంటీరియో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (బీ2సీ) సుబోధ్‌ మెహతా మాట్లాడుతూ ‘‘తమ భారీ బ్రాండ్‌ రీకాల్‌ మరియు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అసంఖ్యాక వినియోగదారుల కారణంగా తెలంగాణా మార్కెట్‌లో అత్యంత శక్తివంతంగా గోద్రేజ్‌ ఇంటీరియో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇటీవలి కాలంలో, ఈ ముత్యాల నగరం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సుప్రసిద్ధ బ్రాండ్లను ఆకర్షించింది. సమీప భవిష్యత్‌లో మా ఆదాయానికి మరింత తోడ్పాటును ఈ ప్రాంతం అందించగలదని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము. ఈ స్టోర్‌ను అత్యద్భుతమైన, అతి ముఖ్యమైన వ్యాపార కూడలిలో ఏర్పాటుచేయడంతో పాటుగా ఈ ప్రాంతంలో గోద్రేజ్‌ ఇంటీరియో యొక్క శక్తివంతమైన బ్రాండ్‌ రీకాల్‌ కారణంగా మొదటి సంవత్సరంలోనే ఈ స్టోర్‌ ఆదాయం 300 లక్షల రూపాయలను అందుకోగలదని ఆశిస్తున్నాము.

సరాసరిన, తెలంగాణా మార్కెట్‌ నుంచి మేము దాదాపు 80 కోట్ల రూపాయల వ్యాపారం చేయడంతో పాటుగా అన్ని ఫర్నిచర్‌ విభాగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుండటం వల్ల12%కు పైగా మార్కెట్‌ వాటాను మేము కలిగి ఉన్నాము. 2023 ఆర్ధిక సంవత్సరాంతానికి రాష్ట్రంలో మరో 7 ఔట్‌లెట్లను తెరిచేందుకు, అలాగే రాబోయే మూడేళ్లలో 22% వృద్ధి చెందేందుకు మేము ప్రణాళిక చేశాము. బ్రాండ్‌కు ఈ ప్రాంతంలో ఉన్న చక్కటి గుర్తింపు కారణంగా , ఈ బ్రాండ్‌ మరింతగా తమ వినియోగదారుల సంఖ్యను విస్తరించడంతో పాటుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న గోద్రేజ్‌ ఇంటీరియో కుటుంబానికి మరింత మంది అభిమానులను తీసుకురానుంది’’అని అన్నారు.

నూతన గోద్రేజ్‌ ఇంటీరియో స్టోర్‌ ప్రారంభోత్సవం పట్ల తన ఆనందాన్ని వ్యక్తీకరించిన కార్తికేయ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఒకరి వ్యక్తిత్వానికి కొనసాగింపు ఇల్లు అని నేను నమ్ముతుంటాను. దానికి తగినట్లుగానే మా ఇంటి డెకార్‌, ఫర్నిచర్‌ ఉండటానికి ప్రాధాన్యతనిస్తుంటాను. మా తొలి ఇంటి నిర్మాణ సమయంలో అంటే 2004లో ఓ పిల్లాడిగా ఇంటీరియర్‌ డిజైన్‌కు తోడ్పాటునందించడంలో పొందిన ఆనందం ఇప్పటికీ నాకు గుర్తు ఉంది.

చాలామంది భారతీయులకు ఇంటి పేరుగా గోద్రేజ్‌ ఇంటీరియో నిలిచింది. నా వరకూ ఈ బ్రాండ్‌తో వ్యక్తిగతంగా బంధం ఉంది. సంపూర్ణ శ్రేణిలో హోమ్‌ ఫర్నిచర్‌ను భారతీయ గృహాలకు తగినట్లుగా అందించడం తో పాటుగా అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడం ద్వారా గోద్రేజ్‌ ఇంటీరియో సుప్రసిద్ధమైనది. జూబ్లీహిల్స్‌లో ఈ నూతన స్టోర్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి అవసరాలు, ఆకర్షణకు తగినట్లుగా అత్యంత నాణ్యమైన హోమ్‌ ఫర్నిచర్‌ కలెక్షన్‌ ఈ స్టోర్‌ అందించనుంది’’ అని అన్నారు.