UIDAI వెబ్‌సైట్‌లో ఆధార్ అతేంటికేషన్ హిస్టరీ సర్వీస్ లభిస్తుంది. ఈ సౌకర్యం గతంలో ఆధార్ కార్డ్ హోల్డర్ చేసిన అతేంటికేషన్ వివరాలను అందిస్తుంది.  

న్యూఢిల్లీ: ఆధార్ అనేది చాలా ముఖ్యమైన గుర్తింపు డాక్యుమెంట్, ఆధార్ ఆన్‌లైన్ సేవలను పొందేందుకు 12 అంకెల గుర్తింపు నంబరుకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను లింక్ చేయడం కూడా చాలా ముఖ్యం.

ఇదిలా ఉంటే, ట్రాక్‌ను మెరుగ్గా ఉంచడం కోసం ఆధార్ జారీ చేసే సంస్థ UIDAI మీకు ఆన్‌లైన్ ఆప్షన్ కూడా అందిస్తుంది. ఇందులో మీరు గత 6 నెలల్లో మీ ఆధార్ కార్డ్ ఎక్కడ, ఎన్ని సార్లు ఉపయోగించారో చెక్ చేయవచ్చు. ఆధార్ అతేంటికేషన్ హిస్టరీ ద్వారా ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.

UIDAI వెబ్‌సైట్‌లో ఆధార్ అతేంటికేషన్ హిస్టరీ సర్వీస్ లభిస్తుంది. ఈ సౌకర్యం గతంలో ఆధార్ కార్డ్ హోల్డర్ చేసిన అతేంటికేషన్ వివరాలను అందిస్తుంది. 

ఆధార్ కార్డ్ హోల్డర్ వారి వివరాలను చెక్ చేయడానికి https://resident.uidai.gov.in/aadhaar-auth-history కి లాగిన్ చేయవచ్చు. ఆధార్ కార్డ్ హోల్డర్ అతని/ఆమె ఆధార్ నంబర్/VIDని ఉపయోగించి ఇంకా వెబ్‌సైట్‌లోని ఆదేశాలను అనుసరించడం ద్వారా UIDAI వెబ్‌సైట్‌ల నుండి అతని/ఆమె ఆధార్ అతేంటికేషన్ హిస్టరీ చెక్ చేయవచ్చు.

అయితే ఈ సర్వీస్ పొందేందుకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తప్పనిసరి అని గమనించాలి. ఆధార్ నంబర్ హోల్డర్ ఏదైనా అతేంటికేషన్ యూజర్ ఏజెన్సీ (AUA) లేదా అతను/ఆమె గత 6 నెలల్లో నిర్వహించే అన్ని అతేంటికేషన్ రికార్డుల వివరాలను చూడవచ్చు.

అయితే, ఒక సమయంలో గరిష్టంగా 50 రికార్డులను వీక్షించవచ్చు. ఆన్‌లైన్‌లో ఆధార్ అతేంటికేషన్ ఎలా చెక్ చేయాలంటే..


1. మొదట ఆధార్ అతేంటికేషన్ హిస్టరీ పేజీని సందర్శించండి

2. తరువాత ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

3. ఇక్కడ చూపించిన సెక్యూరిటి కోడ్‌ను ఎంటర్ చేయండి.

4. తరువాత 'జనరేట్ OTP'పై క్లిక్ చేయండి.

5. మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్‌కి OTP వస్తుంది.

6. సమాచార వ్యవధి అండ్ లావాదేవీలను ఎంచుకోండి.

7. OTPని ఎంటర్ చేశాక 'submit'పై క్లిక్ చేయండి. 

8. ఎంచుకున్న వ్యవధిలో చేసిన అన్ని ఆధార్ అతేంటికేషన్ రిక్వెస్ట్ తేదీ, సమయం, రకం అన్నీ చూపబడతాయి.