వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నుండి వచ్చే ఆదాయం నవంబర్‌లో రూ.1.4 లక్షల కోట్లకు పైగా దాటింది. అంతకుముందు నెలలో రూ.1.55 లక్షల కోట్లు వసూల్ చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిఎస్‌టి ఆదాయం లక్ష కోట్లకు చేరుకున్న రెండవ నెల ఇది.జిఎస్‌టి వసూల్ గత ఏడాది 2019 నవంబర్ తో  పోల్చితే రూ .1,03,491 కోట్లు నుండి నవంబర్ 2020లో 1.4 శాతం ఎక్కువ పెరిగింది.

also read కరోనా కష్టకాలం: అమెజాన్ సి‌ఈ‌ఓ మాజీ భార్య 4 నెలల్లో 29వేల కోట్లు దానం.. ...

2020 నవంబర్‌లో వసూలు చేసిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ .1,04,963 కోట్లు, అందులో సెంట్రల్ జీఎస్టీ రూ .19,189 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ .25,540 కోట్లు, ఐజీఎస్‌టీ రూ .51,992 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ .22,078 కోట్లతో సహా), సెస్ రూ .8,242 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.809 కోట్లతో సహా) అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

2019-20లోని మొత్తం నెలల్లో 8నెలలు జీఎస్టీ ఆదాయం రూ.1 లక్ష కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాక్ డౌన్, ఆర్ధికవ్యవస్థ మందగమనం కారణంగా ఆదాయం దెబ్బతింది.

ఏప్రిల్‌లో జి‌ఎస్‌టి ఆదాయం రూ .32,172 కోట్లు, మేలో రూ. 62,151 కోట్లు, జూన్ లో రూ .90,917 కోట్లు, జూలై లో రూ. 87,422 కోట్లు, ఆగస్టులో రూ .86,449 కోట్లు, సెప్టెంబర్ లో రూ .95,480 కోట్లు, అక్టోబర్ లో రూ .1,05,155 కోట్లు, నవంబర్ లో రూ .1,04,963 కోట్లు.