జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం ప్రస్తుతం పరిహారం కింద చెల్లిస్తోంది. ఈ ప్రక్రియకు జూన్‌తో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ఇకపై నిధుల కోసం కేంద్రంపై ఆధారపడకుండా స్వయంసమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో జీఎస్టీ మండలి పలు మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పరిహారం కింద చెల్లిస్తోంది. ఈ ప్రక్రియ జూన్ మాసంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ఇక నుండి నిధుల కోసం కేంద్రంపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతో జీఎస్టీ మండలు పలు మార్పులకు సిద్ధమవుతోంది. ఈ మేరకు వచ్చే నెల జరగనున్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

5 శాతం నుండి

ప్రస్తుతం జీఎస్టీ స్లాబ్‌లో పన్ను లేకుండా జీరో ఉంది. ఆ తర్వాత 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం స్లాబ్స్ ఉన్నాయి. వీటిలో 5 శాతం స్లాబ్‌ను పూర్తిగా ఎత్తివేయాలనే ప్రతిపాదనను మండలి పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిధిలో ఉండి సామాన్య ప్రజలు ఎక్కువగా వినియోగించే కొన్ని ఉత్పత్తులను 3 శాతం పన్ను పరిధిలోకి, మరికొన్నింటిని 8 శాతం పన్ను పరిధిలోకి తీసుకు రావాలని యోచిస్తోందని తెలుస్తోంది.

నిత్యావసరాలు.. విలాసవంత ఉత్పత్తులు 

నిత్యావసర వస్తువులు అతి తక్కువ పన్ను స్లాబ్ ఐదు శాతం పరిధిలో ఉన్నాయి. విలాసవంతమైన వస్తువులు 28 శాతం స్లాబ్‌లో ఉన్నాయి. అత్యంత విలాసవంతమైన ఉత్పత్తులు, సిన్ గూడ్స్ పైన అదనపు సెస్ ఉంది. వీటిని జీఎస్టీ అమలు వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు అందిస్తున్నారు. ప్రస్తుతం ప్యాకేజ్ లేని అన్-బ్రాండెడ్ ఆహార పదార్థాలపై ఎలాంటి జీఎస్టీ లేదు. వీటిని మూడు శాతం పరిధిలోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐదు శాతం స్లాబ్‌ను 7 లేదా 8 లేదా 9 శాతానికి పెంచాలని భావిస్తున్నారు.

రూ.50వేల కోట్ల ఆదాయం 

5 శాతం స్లాబ్‌ను 8 శాతానికి పెంచడం వల్ల ప్రభుత్వానికి ఏటా అదనంగా రూ.1.50 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది. అతి తక్కువ పన్ను స్లాబ్‌ను ఒక శాతం పెంచితే అదనంగా రూ.50వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. బ్రాండెడ్ కానీ ఫుడ్, డైరీ ఉత్పత్తులకు ప్రస్తుతం జీఎస్టీ మినహాయింపు ఉంది.