IDBI Privatisation | కేంద్ర ప్రభుత్వం వాటాల ఉపసంహరణపై ఆచీతూచీ అడుగులు వేస్తోంది. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ ప్రక్రియలో కూడా ఈ విధానమే అవలంబిస్తోంంది. హడావుడిగా ఐడీబీఐ బ్యాంకులో వాటాల ఉపసంహరణ చేయకుండా, వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే, రెండు విడతల్లో ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం తన వాటాలను ఉపసంహరించనున్నదని తెలియవచ్చింది.
IDBI Privatisation: ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం జులై చివరి నాటికి ప్రాథమిక బిడ్‌లను ఆహ్వానించవచ్చని, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డిఐపిఎఎమ్) అధికారి ఒకరు తెలిపారు. అయితే ప్రస్తుతం యుఎస్‌లోని పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, తద్వారా బ్యాంకు కొనేందుకు వచ్చే వారిని ప్రోత్సహిస్తున్నట్లు బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి మరికొన్ని ఇన్వెస్టర్ల సమావేశాల తర్వాత విక్రయానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.
“IDBI యొక్క వ్యూహాత్మక విక్రయానికి RBIతో మరో రౌండ్ చర్చలు అవసరం కావచ్చు. ఆసక్తి వ్యక్తీకరణను (Expression of interest) జూలై చివరి నాటికి ఆహ్వానించవచ్చు.” బ్యాంకులో ప్రభుత్వ వాటా 45.48 శాతం ఉండగా, LIC వాటా 49.24 శాతంగా ఉంది.
గతేడాది మేలో సూత్రప్రాయ ఆమోదం లభించింది
బ్యాంకులో ప్రభుత్వం, ఎల్‌ఐసీ వాటా ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదని అధికారి తెలిపారు. అయితే, IDBI బ్యాంక్‌లో నిర్వహణ నియంత్రణ ఈ వ్యూహాత్మక విక్రయానికి బదిలీ చేయబడుతుంది. ఐడిబిఐ బ్యాంక్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, నిర్వహణ నియంత్రణ బదిలీకి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ గత ఏడాది మేలో సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఐడీబీఐ బ్యాంక్ చట్టంలో అవసరమైన సవరణలు చేశారు.
పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.65,000 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.24,000 కోట్లకు పైగా సమీకరించింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి రూ.65,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ద్వారా వచ్చిన మొత్తంతో సహా, కేంద్ర సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.13,500 కోట్లకు పైగా వచ్చాయి. ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా ప్రభుత్వం రూ.20,560 కోట్లు ఆర్జించింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కింద నిర్వహించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM) కార్యక్రమంలో కంపెనీల పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం వెనుక ఉన్న సూత్రం పబ్లిక్ ఎంటిటీ లేదా కంపెనీని మరింత సమర్థవంతంగా నడపడమే తప్ప దాన్ని మూసివేయడం కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం అన్నారు.
1994 - 2004 మధ్య ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు చేతులకు అప్పగించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఈ సంస్థలు వృత్తిపరంగా నడిచే బోర్డులచే నిర్వహించబడుతున్నాయని, వాటి పనితీరు మెరుగుపడిందని సీతారామన్ అన్నారు.
ప్రభుత్వం వ్యూహాత్మక విక్రయం కోసం అర డజనుకు పైగా పబ్లిక్ కంపెనీలను జాబితా చేసింది. వీటిలో షిప్పింగ్ కార్ప్, కాంకర్, వైజాగ్ స్టీల్, IDBI బ్యాంక్, NMDC నాగర్నార్ స్టీల్ ప్లాంట్, HLL లైఫ్‌కేర్ ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.24,000 కోట్లకు పైగా సమీకరించింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి రూ.65,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ద్వారా వచ్చిన మొత్తంతో సహా, కేంద్ర సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.13,500 కోట్లకు పైగా వచ్చాయి.
