HDFC , ICICI బ్యాంక్‌లో అకౌంట్ ఉందా అయితే గుడ్ న్యూస్..ఇకపై మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా షాపింగ్ చేయొచ్చు..
UPI now, Pay later: HDFC , ICICI బ్యాంకులు UPI పే లేటర్ సేవలను ప్రారంభించాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI నెట్‌వర్క్ ద్వారా బ్యాంకుల నుంచి మంజూరైన క్రెడిట్ లైన్ ద్వారా, మీ బ్యాంక్ ఖాతాలో తగినంత నిధులు లేకపోయినా మీరు మీ UPI ద్వారా చెల్లింపులు చేయవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మీరు షాపింగ్ చేస్తున్న సమయంలో, మీ బ్యాంకు ఖాతాలో సరైన మొత్తంలో బ్యాలెన్స్ లేదా..అయితే కంగారు పడకండి.. ఇప్పుడు UPI వినియోగదారులకు సైతం క్రెడిట్ లైన్ సేవలను పొందే అవకాశాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కల్పించింది, అంటే, ఇప్పుడు మీరు మీ బ్యాంకులో జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
అయితే ప్రస్తుతం ఈ UPI now, Pay later సేవలను HDFC , ICICI బ్యాంకుల్లో ప్రారంభం అయ్యింది. ఈ రెండు బ్యాంకులు తమ ఖాతాదారుల కోసం UPI పే లేటర్ సేవలను ప్రారంభించాయి. ఖాతాదారుడి అర్హతను బట్టి రెండు బ్యాంకులు ఈ సేవను అందిస్తున్నాయి. సుమారు రూ. 50,000 క్రెడిట్ పరిమితితో ఈ సేవలను అందిస్తోంది. HDFC UPI Now Pay Later, ICICI PayLater పేరిట ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు ఇప్పటికే UPIకి ఈ ఫీచర్‌ను జోడించాలని RBI అన్ని ఇతర బ్యాంకులను కూడా కోరింది.
నిజానికి UPI ద్వారా 'పే లేటర్' సేవలను జోడించడానికి RBI అన్ని బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. కొన్ని బ్యాంకులు కస్టమర్‌లకు తమ ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్‌ను బట్టీ చెల్లింపులు చేయడంలో సహాయపడేందుకు 'పే లేటర్' ఆప్షన్‌ను ప్రవేశపెట్టాయి. ఇది ఎలా పని చేస్తుందో , ఎలాంటి ఛార్జీలు చెల్లించాలో తెలుసుకుందాం.
UPI పే లేటర్ అంటే ఏమిటి?
UPIకి 'పే లెటర్' సేవను జోడించడానికి ఇటీవల RBI బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇందులో, వినియోగదారులు ఇప్పుడు బ్యాంక్ ఖాతా ఖాళీగా ఉన్నప్పటికీ చెల్లింపులు చేయవచ్చు. ఈ ఎంపిక 'Buy Now Pay Later' లాగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు, UPIని ఉపయోగిస్తున్న వినియోగదారులు వారి సేవింగ్స్ ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలు, ప్రీపెయిడ్ వాలెట్లు , క్రెడిట్ కార్డ్‌లను UPIకి మాత్రమే లింక్ చేయగలరు, కానీ ఇప్పుడు UPI లావాదేవీల కోసం క్రెడిట్ లైన్ పరిమితులను ఉపయోగించవచ్చు. ఈ సేవ దాదాపు ప్రతి UPI అప్లికేషన్‌లో అందుబాటులో ఉంది.
బ్యాంకులు క్రెడిట్ లైన్ కోసం కస్టమర్ నుండి ఆమోదం తీసుకుని, ఆపై క్రెడిట్ పరిమితిని నిర్ణయిస్తాయి. వినియోగదారులు తమ UPI యాప్‌లలో 'పే లేటర్' ఎంపికను సక్రియం చేయవచ్చు. చెల్లింపు చేసిన తర్వాత, దానిని తిరిగి చెల్లించడానికి బ్యాంక్ మీకు సమయాన్ని కూడా ఇస్తుంది , దాని కోసం మీరు ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.