బడ్జెట్ దెబ్బకు రూ.4000 పడిపోయిన బంగారం ధరలు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Gold, silver prices fall: కేంద్రంలో మూడోసారి ప్ర‌ధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మ‌రోసారి పూర్తి బడ్జెట్‌ను ప్రకటించారు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతం నుంచి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
 

Gold silver prices fall by up to Rs 4,000 after budget cuts custom duty, Finance Minister Nirmala Sitharaman RMA

Gold, silver prices fall : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్ల‌మెంట్ లో కేంద్ర‌ బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. మోడీ కొత్త ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ను ప్రకటించారు. చాలా విషయాలపై పన్ను మినహాయింపులు ఇచ్చారు. అలాగే కొన్ని వస్తువులపై పన్నుల‌ను పెంచారు. కొత్త బ‌డ్జెట్ ప్ర‌కారం.. బంగారం, వెండి ధరలు కూడా తగ్గుముఖం ప‌ట్ట‌నున్నాయి. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని ఆరు శాతం తగ్గిస్తున్నట్లు నిర్మల తెలిపారు. చాలా మంది ఆర్థిక‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణ‌యం బంగారం, వెండి ధరలను చాలా తగ్గిస్తుంది. ఈ లోహాలకు డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా సామాన్యులు బంగారం లేదా వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. ఫలితంగా విలువైన లోహాల స్మగ్లింగ్ త‌గ్గుతుంద‌ని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 

బ‌డ్జెట్ దెబ్బ‌కు ప‌డిపోయిన బంగారం ధ‌ర‌లు.. 

బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ ప్రకటించారు. ఈ ప‌న్నులు త‌గ్గించ‌డంతో బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి. అలాగే, మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచుతుంది. అలాగే, ప్ర‌స్తుతం కొన‌సాగిస్తున్న మార్కెట్ పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ప‌రిస్థితుల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌వు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6%కి ఆర్థిక మంత్రి తగ్గించారు. ఇందులో ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (BCD) 10%  నుంచి 5%కి, మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (AIDC) 5% నుండి 1%కి తగ్గింది.

జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ హెడ్ హరీష్ వి మాట్లాడుతూ.. "కస్టమ్స్ డ్యూటీని 15% నుండి 6%కి తగ్గించడం వల్ల దేశీయ ధరలు తగ్గవచ్చు. అలాగే, డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. గతంలో డ్యూటీలో 10% BCD, 5% AIDCలు ఉన్నాయి" అని చెప్పారు. ఇదే స‌మ‌యంలో బంగారం ధ‌ర‌ల‌పై బ‌డ్జెట్ ప్ర‌భావం క‌నిపించింది. మ‌ల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల‌ బంగారం ధరలు రూ. 72,838 నుంచి రూ.68,500కి పడిపోయాయి. ఇది రూ.4,000ల‌కు పైగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో, బంగారం ధరలు ఔన్సుకు దాదాపు $2,397.13గా నమోదయ్యాయి. ఇక్క‌డ కూడా త‌గ్గుద‌ల క‌నిపించింది. అలాగే, MCXలో వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. కిలో వెండి ధ‌ర‌ రూ.88,995 నుంచి రూ.84,275కు ప‌డిపోయింది. 

ఆగ్‌మాంట్ - గోల్డ్ ఫర్ ఆల్ డైరెక్టర్ సచిన్ కొఠారి మాట్లాడుతూ.. "కస్టమ్స్ డ్యూటీని 15% నుండి 6%కి తగ్గించడం ఒక కీల‌క ప‌రిణామం. 5% కోత అంచనా వేయబడినప్పటికీ, వాస్తవానికి 9% తగ్గింపు ప్రశంసనీయం. ఈ తగ్గుదల వినియోగదారులను తక్కువ రేటుకు బంగారాన్ని కొనుగోలు చేయడానికి సానుకూలంగా ఉంటుంది. కొనుగోళ్లు పెరుగుతాయి. MCX బంగారం ధరలు రూ. 73,000 నుండి రూ. 69,000కి పడిపోయాయి. 10 గ్రాముల బంగారం ధ‌ర‌లు రూ.67,000 మించి తగ్గవచ్చని" చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios