బంగారం గడిచిన వారం రోజులుగా గమనిస్తే దాదాపు రూ. 800 వరకూ తగ్గాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు పతనం కావడంతో దేశీయ మార్కెట్లోనూ ఈ ఫలితం కనిపించింది. 

ఈ వారం బంగారం ధరల్లో భారీగా తగ్గుదల కనిపించింది ప్రస్తుతం బంగారం రిటైల్ ధరలను చూసినట్లయితే 10 గ్రాముల ధర రూ.56 వేల సమీపంలో ట్రేడవుతోంది. ఈ వారం చివరి ట్రేడింగ్ రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.56,204 వద్ద ముగిసింది. ఈ వారం బంగారం ధరలు కాస్త తగ్గాయి. గత వారం చివరి ట్రేడింగ్ రోజున బంగారం ధర రూ.56,983 వద్ద ముగిసింది. అయితే, ఈ వారం బంగారం ధర 10 గ్రాములకు గానూ దాదాపు 800 రూపాయలు తగ్గడం విశేషం.

ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) రేట్ల ప్రకారం, ఈ వారం మొదటి ట్రేడింగ్ రోజైన సోమవారం బంగారం ధరలు రూ.57,076 వద్ద ముగిశాయి. మంగళవారం బంగారం ధర రూ.57,025 వద్ద ముగిసింది. బుధవారం ధరలు తగ్గి రూ.56,770 వద్ద ముగిసింది. గురువారం బంగారం ధర స్వల్పంగా తగ్గి 10 గ్రాములకు రూ.56,343 వద్ద ముగిసింది. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.56,204 వద్ద ముగిసింది.

బంగారం ఎంత చౌకగా మారింది?
గత వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం బంగారం ధర రూ.56,983 వద్ద ముగిసింది. ఈ విధంగా ఈ వారం బంగారం ధరలు 10 గ్రాములకు కనిష్టంగా రూ.779 వద్ద ముగిసింది. ఈ వారంలో బంగారం ధర సోమవారం అత్యంత ఖరీదైనది. ఈ రోజు 10 గ్రాముల ధర రూ.57,072 వద్ద ముగిసింది. ఆ తర్వాత వారం మొత్తం బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది.

24 క్యారెట్ల బంగారం ధర
ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకారం ఫిబ్రవరి 18న 24 క్యారెట్ల బంగారం ధర గరిష్టంగా రూ.56,204గా ఉంది. నేడు ఆదివారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బంగారం ధర (ఫిబ్రవరి 19) నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 56,180 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 50,460గా నమోదు అయ్యింది. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.56,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.50,527గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 56,660 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 50,950. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.56,510 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.50,800గా ఉంది.