Gold, Silver Price: బంగారం కొనేందుకు సిద్ధం అవుతున్నారా. అయితే మీకు ఇది శుభవార్తే, ఎందుకంటే పసిడి గత కొన్ని రోజులుగా భారీగా రేట్లు పడిపోతున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు పతనం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా పసిడి రేటు తగ్గే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి. ఇక వెండి రేటు కూడా తగ్గింది.

గురువారం, MCXలో బంగారం ధర 0.21 శాతం పెరిగింది, పది గ్రాముల ధర రూ. 50,278కి పెరిగింది. అటు వెండి ధరలు 0.65 శాతం తగ్గాయి. ఈ తగ్గింపు తర్వాత కిలో వెండి ధర రూ.60,757కి పడిపోయింది. వారంలో నాలుగో ట్రేడింగ్ రోజున బంగారం, వెండి ధరల్లో అస్థిరత నెలకొంది. ఒకవైపు బంగారం ధర పెరుగుతుండగా, వెండి ధర తగ్గింది. మీరు ఈరోజే ఆభరణాలు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇంటి నుండి బయలుదేరే ముందు బంగారం, వెండి తాజా ధరలను తెలుసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. గురువారం, MCXలో బంగారం ధర 0.21 శాతం పెరిగి, పది గ్రాముల పసిడి ధర రూ. 50,278కి పెరిగింది.

ఈరోజు మార్కెట్‌లో బంగారం ధర ఇలా ఉంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన బంగారం ధర ప్రకారం, ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.50283 వద్ద ట్రేడవుతోంది. అయితే హైదరాబాద్ లో మాత్రం ఈ రేటు 10 గ్రాములకు రూ.50297 గా పలుకుతోంది. ఈ రోజు కిలో వెండి ధర ఢిల్లీ మార్కెట్లో రూ.61149 పలుకుతోంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 60961 వద్ద ప్రారంభమైంది. గత ట్రేడింగ్ రోజున ఈ రేటు కిలో రూ.61302. దీంతో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి ధర కిలోకు రూ.153 తగ్గింది.

వెండి ధర తగ్గింది...
బంగారం ధర పెరగగా, వెండి ధరలో 0.65 శాతం తగ్గుదల నమోదైంది. ఈ తగ్గింపు తర్వాత కిలో వెండి ధర రూ.60,757కి పడిపోయింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా 22 క్యారెట్లు మాత్రమే వినియోగిస్తారు. కొంతమంది 18 క్యారెట్ల బంగారాన్ని కూడా ఉపయోగిస్తారు. ఆభరణాలపై క్యారెట్‌ను బట్టి హాల్‌ మార్క్‌ను తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని ఉంటుంది.

మీ నగరంలో రేటును తెలుసుకోండి..
ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, మేకింగ్ ఛార్జీల కారణంగా బంగారు ఆభరణాల ధరలు దేశవ్యాప్తంగా మారుతూ ఉంటాయి. మీరు మీ నగరం బంగారం ధరను మొబైల్‌లో కూడా తనిఖీ చేయవచ్చు. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, మీరు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ధరను తనిఖీ చేయవచ్చు. మీరు మెసేజ్ చేసే నంబర్‌కు మీ మెసేజ్ వస్తుంది. ఈ విధంగా ఇంట్లో కూర్చున్న బంగారం తాజా ధర మీకు తెలుస్తుంది.