మళ్ళీ పసిడి, వెండి ధరలకు రెక్కలు.. తగ్గినట్టే తగ్గి పెరిగిన బంగారం.. నిన్నటితో పోల్చితే నేటి ధరలు ఇవే..
3:15 pm EDT (1915 GMT) సమయానికి స్పాట్ గోల్డ్ 0.3 శాతం తగ్గి ఔన్సుకు $1,961.39కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి $1,977.20 వద్ద స్థిరపడ్డాయి. ఇండియన్ కరెన్సీ రూపాయి మారకపు విలువ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే నేడు రూ.82.463 వద్ద కొనసాగుతోంది.
నేడు 10 జూన్ 2023న ఈ రోజు ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలో బంగారం ధరలు ఎగిశాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెంపుతో రూ. 55,750, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.430 పెరుగుదలతో రూ.60,800 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.390 పెంపుతో రూ. 56,000గా ఉంది, 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెంపుతో రూ. 61,100 .
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,680. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.60,680. వెండి ధరలు కోల్‌కతా, ముంబైలలో 1 కేజీకి రూ. 74,500, చెన్నైలో వెండి ధర కేజీకి రూ. 79,700.
3:15 pm EDT (1915 GMT) సమయానికి స్పాట్ గోల్డ్ 0.3 శాతం తగ్గి ఔన్సుకు $1,961.39కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి $1,977.20 వద్ద స్థిరపడ్డాయి. ఇండియన్ కరెన్సీ రూపాయి మారకపు విలువ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే నేడు రూ.82.463 వద్ద కొనసాగుతోంది.
ప్లాటీనం ధరలు:
ఇండియాలో ప్లాటీనం ధరలు శనివారం తగ్గాయి. ప్లాటీనం ధర 10గ్రాములకి రూ.140 తగ్గి రూ 26,910కి చేరింది. నిన్నటి ధర రూ. 27,050గా ఉంది.
ఇక హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో కూడా ఈరోజు పసిడి ధరలు పెరిగాయి ప్రాముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెంపుతో రూ.55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 460 పెంపుతో రూ.60,680.
హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 400 పెంపుతో రూ. 55,600, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 460 పెంపుతో రూ. 60,680. ప్లాటీనం ధర 10గ్రాములకు రూ. 26,910గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ధరలు ఒకే విధంగా కొనసాగుతున్నాయి.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,680. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,680.
మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర కేజీకి రూ. 79,700.
ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బంగారం ధర హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.