బంగారం ధరలు వరుసగా వారం రోజులుగా పడుతున్నాయి. దీంతో పసిడి ప్రియులకు పండగ చేసుకుంటున్నారు. అయితే బంగారం భవిష్యత్తులో ఎంత వరకూ పడే అవకాశం ఉందో తెలుసుకుందాం.
బంగారం ధర భారీగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు బంగారం కొనుగోలు చేయాలని భావించడం సహజమే. అయితే బంగారం ధర ఎందుకు పడిపోతోంది. ఎంతవరకు పడిపోయే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
బంగారం ధర ఎంత పడింది..
బంగారం ధర గడచిన రెండు నెలలుగా మనం గమనించినట్లయితే రికార్డు స్థాయికి చేరింది దాదాపు 24 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 58,500 వరకు, అయితే ప్రస్తుతం బంగారం ధర గరిష్ట స్థాయి నుంచి నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది ఫిబ్రవరి నెలలో గమనించినట్లయితే గడచిన వారం రోజులుగా ప్రసిరి ధర రికార్డు స్థాయి నుంచి పడుతూ వస్తోంది తాజాగా గమనించినట్లయితే బంగారం ధర రూ. 56వేల దిగువకు పడిపోయింది అంటే దాదాపు 2000 రూపాయలు తగ్గిపోయింది. దీంతో ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది సరైన సమయం అని నిపుణులు పేర్కొంటున్నారు అంతేకాదు పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ప్రస్తుతం ఉన్న ధర వద్ద కొనుగోలు చేస్తే కాస్త లాభంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం బంగారం ధర రూ.56,500 రేంజులో పలుకుతోంది.
బంగారం ధర ఎందుకు పతనం అవుతోంది
బంగారం ధర పతనం అవడం వెనక అంతర్జాతీయ కారణాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా అమెరికా డాలర్ రోజురోజుకీ మరింత బలం పుంజుకుంటుంది ఇప్పటికే ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ అత్యధిక స్థాయికి చేరింది. యూరో కరెన్సీ సైతం డాలర్ కు సమానంగా మారుతుంది. దీంతో యూఎస్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు మదుపుదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఫలితంగా బంగారంపై పెట్టుబడి పెట్టే వారికి రిటర్న్స్ పెద్దగా రావని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు దీంతో అంతర్జాతీయంగా కూడా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. డాలర్ ఎంత బలపడితే బంగారం ధర కూడా అంత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.
బంగారం ధర ఎంత వరకు పతనం అయ్యే అవకాశం ఉంది…
సమీప భవిష్యత్తులో చూసినట్లయితే బంగారం ధర ప్రస్తుత స్థాయి నుంచి మరో రెండు వేల రూపాయల వరకు పతనమయ్యే అవకాశం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో బంగారం ధర ఔన్స్ 1830 డాలర్ల వద్ద ట్రేడవుతుంది. ఈ ధర నుంచి 1800 డాలర్లకు బంగారం ధర తగ్గినట్లయితే దేశీయంగా కూడా బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉందని బంగారం నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత రేంజ్ లో చూసినట్లయితే బంగారం గరిష్ట స్థాయి కన్నా రెండు వేల రూపాయలు తక్కువగా ఉంది. రానున్న మార్చి నెలలో బంగారం ధర రూ. 50,000 దిగువకు చేరే సూచనలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
