బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి మార్కెట్లో నగలు కొనుగోలు చేసేవారికి ఉత్సాహం నింపుతోంది. అయితే బంగారం ధర త్వరలోనే రూ. 50 వేల దిగువకు పడిపోయే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 

బంగారం ధరలు నేడు కూడా భారీగా తగుముఖం పడ్డాయి ముఖ్యంగా బంగారం ధర గరిష్ట స్థాయితో పోల్చి చూసినట్లయితే దాదాపు 3 వేల రూపాయలు తక్కువగా ట్రేడ్ అవుతోంది దీంతో పసిడి ప్రేమికులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. మీరు బంగారం షాపింగ్ కు వెళుతున్నట్లయితే ఎప్పటికప్పుడు తాజా ధరలను చెక్ చేసుకుని వెళ్ళటం మంచిది లేకపోతే మీరు భారీ ఎత్తున నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,000 దిగువన ట్రేడ్ అవుతోంది. అదే సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50 వేల దిగువకు చేరింది దీంతో ఆభరణాల మార్కెట్లో జోష్ కనిపిస్తోంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఇది సరైన సమయం అని భావిస్తున్నారు 

నిజానికి బంగారం ధర ఈ స్థాయిలో పడిపోవడం వెనక అంతర్జాతీయ అంశాలు కూడా కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా యూరోపియన్ మార్కెట్లో ఆర్థిక మాంద్యం భయాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి ఈ నేపథ్యంలో అపారమైనటువంటి బంగారు నిలువలు ఉన్నటువంటి దేశాలైన జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, సహా పలు దేశాలు తమ గోల్డ్ రిజర్వ్ నుంచి ఆపత్కాలంలో పెద్ద ఎత్తున బంగారాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసి ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడాలని భావిస్తున్నాయి. 2012లో సైప్రస్ సంక్షోభం, గ్రీసు సంక్షోభం సమయంలో సైతం ఆయా దేశాలు ఇలాంటి నిర్ణయాలను తీసుకున్నాయి. ఫలితంగా మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. పెద్ద ఎత్తున మార్కెట్లోకి బంగారం రావడంతో ధరలు భారీగా తగ్గిపోయాయి.

బంగారం ధరలు ఈ స్థాయిలో తగ్గిపోవడం వెనక డాలర్ బలపడటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా డాలర్ ప్రస్తుతం యూరోపియన్ కరెన్సీ అయినటువంటి యూరో విలువకు అత్యంత సమీపంలో ట్రేడ్ అవుతోంది. భవిష్యత్తులో యూరోను డాలర్ దాటిపోయిన ఆశ్చర్యం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మదుపరులు చాలామంది డాలర్ పై విశ్వాసంతో అమెరికన్ బాండ్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బంగారం ధర రిటైల్ మార్కెట్లో సైతం తగ్గుతూ వస్తోంది. అటు ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా బంగారం ఇప్పుడు నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో బంగారం ధర భవిష్యత్తులో భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక కొనసాగితే బంగారం ధర అతి త్వరలోనే 50 వేల దిగువకు పడిపోయే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.