కరెంటు ఖాతా లోటుపై నేరుగా ప్రభావం చూపే బంగారం దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో 33.34 శాతం పెరిగాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా అధిక డిమాండ్ ఉండటంతో 2021-22లో భారత బంగారం దిగుమతులు 46.14 బిలియన్ డాలర్లు (రూ. 3.50 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. 

2021-22 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 33 శాతం పెరిగి, 46.14 బిలియన్ డాల‌ర్‌కు చేరుకున్నాయి.ఇది మన కరెన్సీలో దాదాపు రూ.3.45 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం 842 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నది. బంగారం వినియోగంలో చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 50 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారీ బంగారం దిగుమతుల నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు 102.62 బిలియన్ డాలర్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరానికి 192.41 బిలియన్ డాలర్లకు చేరింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు 50 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారత కరెంట్ ఖాతా లోటు అక్టోబర్-డిసెంబర్ కాలానికి జీడీపీలో 23 బిలియన్ డాలర్లు లేదా 2.7 శాతానికి చేరుకుంది. వ్యాల్యూమ్ పరంగా గోల్డ్ ఇంపోర్ట్స్ ఏప్రిల్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు 842.28 టన్నులుగా నమోదయింది. దేశ బంగారం దిగుమతులు 2021–22 సంవత్సరంలో 33 శాతం పెరిగాయి. మొత్తం 46.14 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.45 లక్షల కోట్లు) విలువైన బంగారం (842 టన్నులు) దిగుమతి అయినట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. 

అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020–21లో బంగారం దిగుమతుల విలువ 34.62 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం బంగారం దిగుమతులు పెరిగిపోవడంతో వాణిజ్యలోటు 192 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవ త్సరంలో 103 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. బంగారం వినియోగంలో చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా భారత్‌ ఉంది. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2021–22లో 50 శాతం పెరిగి 39 బిలియన్‌ డాలర్లకు చేరాయి. కరెంటు ఖాతా లోటు గత ఆర్థిక సంవత్సరానికి 23 బిలియన్‌ డాలర్లకు విస్తరించింది. ఇది అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికం జీడీపీలో 2.7 శాతానికి సమానం. చైనా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్న భారత్‌లో ఎక్కువగా ఆభరణాల పరిశ్రమ బంగారం దిగుమతులను చేసుకుంటుంది. రానున్న రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ కారణంగా దిగుమతులు పెరిగి కరెంటు ఖాతా లోటుపై మరింత ఒత్తిడికి అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.