Asianet News TeluguAsianet News Telugu

Gold And Silver Price Today: ప‌సిడి ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్‌.. జోరు పెంచిన బంగారం ధ‌ర‌లు..!

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నిన్నటితో పోలిస్తే నేడు పెరిగింది. 10 గ్రాములకు రూ.200 పెరిగింది. గత రెండు రోజులు రూ.100 చొప్పున తగ్గగా, నేడు ఎకాఎకి రెట్టింపు ఎగబాకినట్లయింది. ఇక వెండి ధర నేడు స్థిరంగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.47,650గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.51,990గా ఉంది.
 

Gold And Silver Price Today
Author
Hyderabad, First Published Jun 24, 2022, 8:45 AM IST

హైదరాబాద్‌లో జూన్ 24న బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230పైకి చేరింది. రూ. 51,990కు ఎగసింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 200 పెరుగుదలతో రూ. 47,650కు ఎగసింది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. దీంతో బంగారం ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయని చెప్పుకోవచ్చు. పసిడి రేటు రెండు రోజులుగా తగ్గుతూనే వచ్చిన విషయం తెలిసిందే.  బంగారం బాటలో కాకుండా వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. వెండి ధ‌ర‌ కేజీకి రూ. 66,000 వద్ద ఉంది. వెండి ధ‌ర‌ నిన్న రూ. 300 పడిపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు శుక్ర‌వారం ఈ విధంగా ఉన్నాయి. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్ర‌వారం (జూన్ 24, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..! 

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,990గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.51,990 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,990గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,650 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,990గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,650 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,990గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 60,200 ఉండగా, ముంబైలో రూ.60,200గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, కోల్‌కతాలో రూ.60,200గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, కేరళలో రూ.66,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, విజయవాడలో రూ.66,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios