Asianet News TeluguAsianet News Telugu

Gold And Silver Price Today: పసిడి ప్రియులకు భారీ ఊరట.. పడిపోయిన బంగారం, వెండి ధరలు..!

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నిన్నటితో పోలిస్తే నేడు ఇంకాస్త తగ్గింది. 10 గ్రాములకు రూ.200 తగ్గింది. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.300 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌  మార్కెట్‌లో రూ.47,450గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.51,760గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.66,000గా ఉంది. 
 

Gold And Silver Price Today
Author
Hyderabad, First Published Jun 23, 2022, 8:46 AM IST

బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 క్షీణించింది. దీంతో పది గ్రాముల పసిడి రేటు రూ. 47,450కు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రేటు కూడా ఇంతే. 10 గ్రాములకు రూ. 220 క్షీణించింది. రూ. 51,760కు తగ్గింది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు. ఈ రెండు రోజుల్లో బంగారం ధర రూ. 320 పడిపోయింది. వెండి రేటును గమనిస్తే.. వెండి ధ‌ర కిలోకు రూ. 300 దిగి వచ్చింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 66000కు తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు గురువారం ఈ విధంగా ఉన్నాయి. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం (జూన్ 23, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..! 

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,800గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,860గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 450 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.51,760 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,450 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,760గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,450 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,760గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 60,500 ఉండగా, ముంబైలో రూ.60,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, కోల్‌కతాలో రూ.60,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, కేరళలో రూ.66,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, విజయవాడలో రూ.66,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios