తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు నిన్నటితో పోలిస్తే నేడు నిలకడగా ఉంది. అంతకుముందు మూడు రోజుల్లోనే ధర రూ.950 పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర నేడు కిలోకు రూ.200 తగ్గింది.  

బంగారం ధ‌ర‌లు ఆదివారం దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. శనివారం ధరలతో పోలిస్తే ధరలలో పెద్దగా వ్యత్యాసం లేదు. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.49,550 పలుకుతోంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.54,060గా ఉంది. అయితే హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధ‌ర‌ మాత్రం నేడు నేలచూపులు చూసింది. కేజీ వెండి ధర ఆదివారం రూ.200 తగ్గి రూ.74,200గా నమోదైంది. హైదరాబాద్‌తో పాటు పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రంలోని విజయవాడలో కూడా వెండి ధరలు ఈ విధంగానే నమోదయ్యాయి. రూ.200 తగ్గిన వెండి ధర విజయవాడలో రూ.74,200గా ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మ‌రోసారి స్థిరంగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఆదివారం ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పులేదు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (ఏప్రిల్ 17, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,060గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.50,140 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,700గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,550 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.54,060 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.49,550 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.54,060గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.49,550 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.54,060గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,100 ఉండగా, ముంబైలో రూ.74,200గా (ముంబై మార్కెట్‌లో కేజీ వెండి ధర అక్కడ మార్కెట్‌లో రూ.4,200 పెరిగి రూ.74,200కు చేరుకుంది) ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.74,200 ఉండగా, కోల్‌కతాలో రూ.69,100గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,200 ఉండగా, కేరళలో రూ.74,400గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,200 ఉండగా, విజయవాడలో రూ.74,200 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.