Asianet News TeluguAsianet News Telugu

చెక్, యుపిఐ పేమెంట్ నుండి జిఎస్‌టి వరకు ఈ 10 రూల్స్ జనవరి 1 నుండి మారనున్నాయి.. అవేంటో తెలుసుకొండి..

ఈ రూల్స్ మీ జీవితంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చూపనున్నాయి, ఈ కొత్త మార్పుల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. జనవరి 1 నుండి మారబోయే కొన్ని రూల్స్ ఇక్కడ ఉన్నాయి..

From cheque and UPI payments to GST these 10 rules are changing from January 1 2020 check  Details here
Author
Hyderabad, First Published Dec 17, 2020, 6:09 PM IST

న్యూ ఢీల్లీ: సాధారణ ప్రజల జీవితాల్లో పెద్ద ప్రభావాన్ని చూపే చెక్ చెల్లింపులు, ఎల్‌పిజి సిలిండర్ ధరలు, జిఎస్‌టి నుండి యుపిఐ లావాదేవీల చెల్లింపుల వరకు అన్నీ రూల్స్ జనవరి 1 నుండి మారబోతున్నాయి.

ఈ రూల్స్ మీ జీవితంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చూపనున్నాయి, ఈ కొత్త మార్పుల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. జనవరి 1 నుండి మారబోయే కొన్ని రూల్స్ ఇక్కడ ఉన్నాయి..

1. చెక్ పేమెంట్ నియమాలు: బ్యాంకింగ్ మోసాలను అరికట్టే  ప్రయత్నంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నెలల క్రితం చెక్ పేమెంట్ల కోసం 'పాజిటివ్ పే సిస్టమ్' ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది, దీని కింద రూ.50 వేలకు మించిన చెల్లింపులపై కీలకమైన వివరాలను తిరిగి ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది. చెక్ చెల్లింపుల నియమాలలో పాజిటివ్ పే సిస్టమ్  1 జనవరి 2021 నుండి అమల్లోకి వస్తుంది. ఈ సదుపాయాన్ని పొందడం ఖాతాదారుడి అభీష్టానుసారం ఉన్నప్పటికీ రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి చెక్కుల విషయంలో తప్పనిసరి చేయాలని బ్యాంకులు పరిగణిస్తాయి.

2. కాంటాక్ట్‌లెస్ కార్డ్ పేమెంట్ లిమిట్ : కాంటాక్ట్‌లెస్ కార్డ్ పేమెంట్ పరిమితి కార్డులు, యుపిఐల ద్వారా పునరావృతమయ్యే లావాదేవీల పరిమితులు 1  జనవరి 2021  నుంచి రూ.2,000 నుంచి రూ.5 వేలకు పెంచనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తెలిపింది. డిజిటల్ చెల్లింపును సురక్షితమైన పద్ధతిలో విస్తరించడం ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో సురక్షితమైన పద్ధతిలో చెల్లింపులు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. వినియోగదారుల ఆదేశం, అభీష్టానుసారం మీద ఇది ఆధారపడి ఉంటుందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

3. ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు: పాపులర్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ జనవరి 1 నుండి కొన్ని ప్లాట్‌ఫారమ్‌లకు  సపోర్ట్ ను నిలిపివేయనుంది. సపోర్ట్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్‌ల గురించి ప్రస్తావిస్తూ వాట్సాప్ పేజీ ఈ డివైజెస్ కి  సపోర్ట్ ఇస్తుందని, వీటిని మాత్రమే ఉపయోగించమని సిఫారసు చేస్తుందని పేర్కొంది: ఆండ్రాయిడ్ రన్నింగ్ ఓ‌ఎస్ 4.0.3 లేదా కోత్తది,  ఐఫోన్ ఐ‌ఓ‌ఎస్ 9 లేదా కోత్తది, జియో ఫోన్, జియో ఫోన్ 2 తో సహా కాయ్ ఓఎస్ 2.5.1 కొత్తగా పనిచేస్తున్న ఫోన్‌లకు  సపోర్ట్ చేస్తుంది.

4. కార్ల ధరలు: పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల ప్రతికూల ప్రభావాన్ని అధిగమించడానికి కార్ల మార్కెట్ లీడర్ మారుతి సుజుకి ఇండియా,  మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు జనవరి 1 నుండి కార్ల ధరలను పెంచనున్నాయి.

5.  ల్యాండ్‌లైన్ నుండి మొబైల్ ఫోన్ కాల్స్ : దేశంలో ల్యాండ్‌లైన్‌ల నుండి మొబైల్ ఫోన్‌లకు కాల్ చేయడానికి త్వరలో '0' జోడించాల్సి ఉంటుంది, కొత్త వ్యవస్థను అమలు చేయడానికి జనవరి 1 లోగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని టెలికాం విభాగం టెల్కోస్‌ని కోరింది. ల్యాండ్‌లైన్ కాల్స్ కి '0' జోడించాలని సెక్టోరల్ రెగ్యులేటర్ ట్రాయ్ చేసిన సిఫారసును ఈ విభాగం అంగీకరించింది, ఈ చర్య టెలికం సేవలకు మరిన్ని  కొత్త నంబర్లను సృష్టిస్తుంది.

also read నవంబర్‌లో జీఎస్‌టి ఆదాయం రికార్డు... గత ఏడాదితో పోల్చితే 1.4 శాతం ఎక్కువ:ఆర్థిక మంత్రిత్వ శాఖ ...

6. నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్: కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2021 జనవరి 1 నుండి నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 1, 2017 లోపు విక్రయించిన ఎం, ఎన్ క్లాస్ నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది. దీని కోసం, సెంట్రల్ మోటారు వాహనాల నియమాలు, 1989 సవరించబడ్డాయి. దీనికి సంబంధించి నవంబర్ 6న మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

7. యుపిఐ పేమెంట్ : అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీలపై వినియోగదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 1 నుండి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు నిర్వహిస్తున్న యుపిఐ పేమెంట్ సర్వీస్ (యుపిఐ పేమెంట్ ) పై అదనపు ఛార్జీ విధించాలని ఎన్‌పిసిఐ నిర్ణయించినట్లు తెలిపింది. కొత్త సంవత్సరం నుంచి థర్డ్ పార్టీ యాప్‌లపై ఎన్‌పిసిఐ 30 శాతం పరిమితిని విధించింది. ఈ ఛార్జీని చెల్లించడానికి పేటి‌ఎం అవసరం అని  నివేదించింది.

8. గూగుల్ పే వెబ్ యాప్ : గూగుల్ పేమెంట్ అప్లికేషన్  గూగుల్ పే  జనవరి నుండి వెబ్ యాప్ పేమెంట్ అప్లికేషన్  తొలగించనుంది. ఇన్స్టంట్ మని ట్రాన్స్ఫర్ కోసం వినియోగదారుల నుండి చార్జీలు వసూలు చేయనుంది. గూగుల్ పేలో కస్టమర్లు ఇప్పటి వరకు పేమెంట్లను నిర్వహించగలిగారు అలాగే మొబైల్ యాప్ నుండి లేదా pay.google.com నుండి డబ్బు పంపించగలిగారు. అయితే తాజా నోటీసు ప్రకారం ఇప్పుడు వెబ్ యాప్ సైట్ వచ్చే ఏడాది జనవరి నుండి పనిచేయదని గూగుల్ తెలిపింది.

9. ఎల్‌పిజి సిలిండర్ ధరలు: చమురు మార్కెటింగ్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు  ధరలను బట్టి ప్రతి నెల మొదటి రోజు ఎల్‌పిజి ధరలను సవరించనున్నాయి. దీని బట్టి ఎల్‌పిజి ధరలు ప్రతినెల మారనున్నాయి. అలాగే ప్రతి రాష్ట్రనికి ధరలలో మార్పు ఉండనుంది.

10. జీఎస్‌టి-రిజిస్టర్డ్ స్మాల్ బిజ్: 5 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న వ్యాపారాలు ప్రస్తుతం 12కి బదులుగా జనవరి నుంచి 4 జిఎస్‌టి సేల్స్ రిటర్న్స్ లేదా జిఎస్‌టిఆర్ -3 బి మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుందని వార్తా సంస్థ పిటిఐ పేర్కొన్న వర్గాలు తెలిపాయి. త్రైమాసిక రిటర్న్ విత్ మంత్లీ పేమెంట్ (క్యూఆర్ఎంపి) పథకం దాదాపు 94 లక్షల పన్ను చెల్లింపుదారులపై ప్రభావం చూపుతుంది, ఇది వస్తువుల, సేవల పన్ను (జిఎస్‌టి) మొత్తం పన్ను స్థావరంలో 92 శాతం. దీనితో పాటు జనవరి నుండి చిన్న పన్ను చెల్లింపుదారులు సంవత్సరంలో ఎనిమిది రిటర్నులను (నాలుగు జిఎస్‌టిఆర్ -3 బి ఇంకా 4 జిఎస్‌టిఆర్ -1 రిటర్న్స్) మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios