Asianet News TeluguAsianet News Telugu

ఫ్రీగా మీ పిల్లల ఆధార్‌ను అప్‌డేట్‌ చేయించండి.. ఇదిగో ప్రాసెస్‌..

అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ఇప్పుడు అందరికీ ఆధార్‌ కార్డు తప్పనిసరి. మరి 3 నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్‌ అప్‌డేట్‌ చేయించుకోవాలని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(UIDAI) సూచిస్తోంది. మరి మీ పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ చేయించాలంటే ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలుసా.. వివరాలు తెలుసుకుందాం.. రండి..

Free Aadhaar Update for Children.. Complete Process sns
Author
First Published Aug 21, 2024, 10:52 AM IST | Last Updated Aug 21, 2024, 10:52 AM IST

పిల్లల నుండి సీనియర్ సిటిజన్ల వరకు ప్రతి ఒక్కరికీ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ కార్డును జారీ చేస్తుంది. ఆధార్‌ అప్‌డేషన్‌లో ప్రధానంగా పేరు, చిరునామా, జాతీయం, ఇతర వ్యక్తిగత వివరాలు అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు బయోమెట్రిక్‌ వివరాలను అప్‌ డేట్‌ చేయించడం తప్పనిసరి. దీనికి మీ సమీపంలోని ఆధార్‌ నమోదు కేంద్రం వద్దకు వెళ్లాలి. లేదా UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలు పూర్తి ఉచితంగా నమోదు చేయించవచ్చు. 

5 ఏళ్ల లోపు పిల్లలకు బయోమెట్రిక్‌ అవసరం లేదు..
UIDAI ఇచ్చిన రూల్స్‌ ప్రకారం.. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బయోమెట్రిక్స్ నమోదు చేయించాల్సిన అవసరం లేదు. వారి UID జనాభా సమాచారం.. తల్లిదండ్రుల UIDకి లింక్ ఆధారంగా ప్రాసెస్ చేయబడుతుంది. అయితే పిల్లలకు 5 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే వారి పది వేళ్లు, ఐరిస్, ముఖం, బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయాలి. 


ఆన్‌లైన్‌లో ఉచితంగా ఇలా అప్‌డేట్ చేయాలి..

1. UIDAI వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాలి.
2. ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఎంపికపై క్లిక్ చేయాలి.
3. పిల్లల పేరు, తల్లిదండ్రుల మొబైల్ నంబర్, తల్లిదండ్రుల ఇమెయిల్ ఐడి, ఇంటి చిరునామా, ప్రాంతం, రాష్ట్రం వంటి వివరాలు నింపాలి. 
4. ఫిక్స్ అపాయింట్‌మెంట్‌పై క్లిక్ చేయాలి.
5. సమీపంలోని నమోదు కేంద్రాన్ని ఎంపిక చేసుకొని, అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయాలి.
6. కేటాయించిన సమయానికి కేంద్రానికి వెళ్లి 
* రిఫరెన్స్ నంబర్
*  ఫారమ్ ప్రింటౌట్
*  గుర్తింపు రుజువు
*  చిరునామా ప్రూఫ్
*  పిల్లలతో సంబంధానికి రుజువు
*  పుట్టిన తేదీ
తదితర వివరాలు అందజేయాలి. దీనికి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios