న్యూఢిల్లీ:  శ్రావణ మాసంతోనే భారతదేశంలో అందునా హిందువులకు వరుసగా పండుగలు వస్తాయి. పంచంలోకెల్లా అత్యధిక జనాభా గల దేశం మనది. కనుక మార్కెట్ కూడా పెద్దదే. ఈ క్రమంలో పండుగల సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రపంచంలోకెల్లా రెండు అతిపెద్ద రిటైల్ దిగ్గజాలుగా పేరొందిన సంస్థలు వాల్‌మార్ట్, అమెజాన్ రకరకాల ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. ప్రత్యేకించి దేశంలోని వినియోగదారుల్లో 40% మందిని తమ ఖాతాదారులుగా చేర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాయి. 

ఇటీవలే భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మెజారిటీని వాల్‌మార్ట్ చేజిక్కించుకున్నది. ఫ్లిప్‌కార్ట్- వాల్‌మార్ట్ మాదిరిగానే భారతదేశంలోని ఇతర సంస్థల వాటాల కొనుగోలు చేసే ప్రయత్నాలతోనే ఇంటర్నేషనల్ ఆన్‌లైన్ ‘ఈ- కామర్స్’ సంస్థ అమెజాన్ ముందుకు సాగుతున్నది. ఈ తరుణంలో పండుగలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఫ్లిప్ కార్ట్ జోడీగా వాల్ మార్ట్, ప్రత్యర్థిగా అమెజాన్ భారత మార్కెట్ ప్రపంచంలో ఆఫర్లతో పోటీ పడేందుకు సంసిద్ధమవుతున్నాయి.

పండుగల సీజన్‌లో రెండు రెట్ల ఆర్డర్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యేకించి టెలివిజన్ సెట్లు మొదలు గ్రుహోపరణాలు, స్మార్ట్ ఫోన్లు తదితర వస్తువుల కొనుగోలు రెట్టింపు జరిగాయి. తమ ఖాతాదారులకు అతి తక్కువ ధరకే విక్రయించేందుకు ఆయా సంస్థల ఉత్పత్తి దారులతో తక్కువ ధరలకు కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నాయి. ప్రత్యేకించి నాలుగు రకాల బ్రాండ్లపై రాయితీల కోసం చర్చిస్తున్నాయని ఆయా బ్రాండ్ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు ధ్రువీకరించారు కూడా. 

అమెజాన్‌తో పోటీ పడుతూ వినియోగదారుల నుంచి ఆర్డర్లు పొందేందుకు ఫ్లిప్‌కార్ట్ మేనేజ్మెంట్‍కు పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చింది వాల్‌మార్ట్. దీని ప్రకారం ఆఫర్ల కోసం ఫ్లిప్ కార్ట్‌కు వాల్ మార్ట్ 200 కోట్ల డాలర్ల నిధిని కూడా సమకూర్చి పెట్టిందని ఆయా సంస్థల ప్రతినిధుల కథనం. ఇటీవలే ప్రపంచ అగ్రశ్రేణి డిజిటల్ విక్రయ సంస్థగా అమెజాన్ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాల్‍మార్ట్ - ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మధ్య భారీ ఆఫర్ల యుద్ధమే ఆవిష్క్రుతం కానున్నది. 

ఈ ఏడాది వినియోగదారులకు అత్యధిక సంఖ్యలో గ్రుహోపకరణాలు, టెలివిజన్ సెట్లు, స్మార్ట్ ఫోన్లు తదితర వస్తువులు భారీ రాయితీలతో తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయని ప్రముఖ గ్రుహోపకరణాల సేల్స్ అధిపతి ఒకరు చెప్పారు. ఈ ఏడాది దీపావళి పండుగ వరకు ఈ ఫండుగ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. దీపావళి పండుగతోపాటు ప్రత్యేక వేడుకల్లోనూ రాయితీలిచ్చేందుకు పలు సంస్థలు సిద్ధం అవుతున్నాయి. అత్యధిక రాయితీ, క్యాష్ బ్యాక్ ఆపర్లు అందించేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అలియాస్ వాల్‌మార్ట్ సిద్ధం అయ్యాయని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.

వాల్ మార్ట్, అమెజాన్ సంస్థలు అక్టోబర్ 9 -11 వరకు ఆన్‌లైన్‌లో 170 మిలియన్లకు పైగా వస్తువులు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 3.8 లక్షల మందికి పైగా వినియోగదారులను దరి చేర్చుకోవాలని తపన పడుతున్నాయి. 32 అంగుళాలు మొదలు 43, 50 అంగుళాల టెలివిజన్ సెట్లు ఆన్‌లైన్‌లో అతి తక్కువ ధరకు అందుబాటులోకి తేనున్నాయి. వివిధ క్యాటగిరీల్లో అతిపెద్ద బ్రాండ్ల ఉత్పత్తులను భారీ సంఖ్యలో విక్రయించనున్నాయి. అంతేకాదు ఈఎంఐ వ్యయం, ఎక్చ్సేంజ్ చెల్లింపులు ఉండబోవని చెప్పారు.

ఆఫర్ల విషయమై ఫ్లిప్‌కార్ట్ స్పందించేందుకు ముందుకు రాలేదు. కానీ అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి మాత్రం వచ్చే పండుగల సీజన్‌
డిజిటల్ పేమెంట్ విధానంలో నూతన కస్టమర్లను తమ ఖాతాలో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. భారీగా వస్తువుల విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.