ఐదేండ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 5.45 శాతం వడ్డీరేటు అమల్లో ఉంది. ఇక ఆర్‌బీఐ రెపో రేటును పెంచడంతో రుణాలపై వడ్డీరేట్లు అధికం కావడంతో కస్టమర్లపై ఈఎంఐల భారం పెరగనుంది.
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. ఆర్బీఐ రెపో రేటు పెంచిన నేపథ్యంలో వడ్డీరేట్లను పెంచింది. ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేందుకు ఎస్‌బీఐ సన్నద్ధమైంది. ఆర్‌బీఐ బుధవారం రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన క్రమంలో రుణాలపై వడ్డీరేట్లతో పాటు ఎఫ్‌డీలపైనా వడ్డీ రేట్ల పెంపుకు బ్యాంకులు కసరత్తు సాగిస్తున్నాయి. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెరుగుతాయని ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా పేర్కొన్నారు. నూతన ఎఫ్‌డీలపై తాజా వడ్డీ రేట్లు వర్తిస్తాయని, ఇప్పటికే వివిధ కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై తాము వడ్డీరేట్లను పెంచామని ఎస్‌బీఐ చీఫ్ చెప్పారు. ప్రస్తుతం ఏడాది నుంచి రెండేండ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై ఎస్‌బీఐ కస్టమర్లకు 5.10 శాతం చొప్పున వడ్డీ లభిస్తోంది.
రెపో రేటు పెరగడం కొంతమందికి భారమైతే..మరి కొంతమంది లాభం కల్గిస్తుంది. గత నెల రోజుల వ్యవధిలో ఆర్బీఐ రెండవసారి రెపో రేటు పెంచింది. తాజాగా 50 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ. ఈ క్రమంలో వడ్డీరేట్లు భారీగా పెరగనున్నాయి. ద్వైమాసిక సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ ప్రభావం అటు రుణాలపై, ఇటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పడనుంది. ఈఎంఐలు భారంగా మారనుంటే..ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన ఖాతాదారులకు అధిక వడ్డీ లభించనుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన నేపధ్యంలో ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచనున్నట్టు వెల్లడించింది. ఎస్బీఐ ప్రస్తుతం 12-24 నెలల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.10శాతం వడ్డీ అందిస్తుంది. అటు 3-5 ఏళ్ల డిపాజిట్లపై 5.45 శాతం వడ్డీ ఇస్తోంది. ఇప్పుడు రెపో రేటు పెరిగిన నేపధ్యంలో వడ్డీ రేట్లను మరింత పెంచనుంది. అయితే ఏ మేరకనేది ఇంకా తెలియలేదు. ఐదేండ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 5.45 శాతం వడ్డీరేటు అమల్లో ఉంది. ఇక ఆర్‌బీఐ రెపో రేటును పెంచడంతో రుణాలపై వడ్డీరేట్లు అధికం కావడంతో కస్టమర్లపై ఈఎంఐల భారం పెరగనుంది. రెపో రేటుకు అనుగుణంగా రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయని దినేష్ కుమార్ వెల్లడించారు.
