Asianet News TeluguAsianet News Telugu

భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఫిచ్ తాజా అంచనా.. ఊహించిన దానికంటే మెరుగైన పేరుగుదల..

అంతకుముందు భారత ఆర్థిక వ్యవస్థలో -10.5 శాతం క్షీణత ఉంటుందని ఫిచ్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో రేటింగ్ ఏజెన్సీ భారత ఆర్థిక వ్యవస్థలో ఊహించిన దానికంటే మెరుగైన పేరుగుదల దృష్ట్యా అంచనాలను సవరించింది.

Fitch revises India's financial year 21 GDP contraction forecast to 9.4%
Author
Hyderabad, First Published Dec 8, 2020, 1:05 PM IST

రేటింగ్ ఏజెన్సీ సంస్థ ఫిచ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాను -9.4 శాతానికి సవరించింది. అంతకుముందు భారత ఆర్థిక వ్యవస్థలో -10.5 శాతం క్షీణత ఉంటుందని ఫిచ్ అంచనా వేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో రేటింగ్ ఏజెన్సీ భారత ఆర్థిక వ్యవస్థలో ఊహించిన దానికంటే మెరుగైన పేరుగుదల దృష్ట్యా అంచనాలను సవరించింది.  కరోనా వైరస్ మహమ్మారి వల్ల కలిగిన మాంద్యం దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసిందని మంగళవారం విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక స్థాయిలో ఫిచ్ తెలిపింది. 

"2020-21లో భారత జిడిపి -9.4 శాతం ఉంటుందని మేము ఊహించాము" అని ఫిచ్ తెలిపింది.

also read ఎల్‌పి‌జి గ్యాస్ సిలిండర్ పై ప్రత్యేకమైన ఆఫర్.. ఈ యాప్‌తో రూ.500 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.. ...

కరోనా వైరస్ మహమ్మారి నివారణకు విధించిన 'లాక్ డౌన్' కారణంగా ఏప్రిల్-జూన్ నెలలో ఆర్థిక వ్యవస్థ -23.9 శాతం పడిపోయింది. ఇది ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల క్షీణత అత్యధిక గణాంకాలలో ఒకటి. మొదటి త్రైమాసికంలోని రెండు నెలలు అంటే ఏప్రిల్, మే నెలల్లో దేశంలో పూర్తి లాక్ డౌన్ విధించింది.  

2021-22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్లస్ స్థాయికి చేరుకుంటుందని ఎన్‌ఐటిఐ ఆయోగ్ అంచనా వేసిన విషయం తెలిసిందే.  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సవరించిన సూచనలో ఆర్థిక వృద్ధి రేటు -7.5 శాతంగా ఉండే అవకాశం ఉందని ఆర్‌బిఐ ప్రకటించింది, అంతకుముందు ఇది -9.5 శాతంగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ సెప్టెంబర్ త్రైమాసికంలో ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంటుందని, తయారీలో విజృంభణ దీనికి ఒక ముఖ్య కారణమని, ఇది జిడిపి -7.5 శాతనికి చేరుకోవడానికి సహాయపడింది తెలిపింది.

యు.ఎస్ జిడిపి ఇప్పుడు 4 శాతం నుండి 4.5 శాతనికి, చైనా జిడిపి  7.7 శాతం నుండి  8 శాతనికి విస్తరిస్తుందని అంచనా వేసింది, అయితే యూరోజోన్ వృద్ధి ఇప్పుడు 5.5 శాతం నుండి   4.7 శాతనికి తగ్గింది.  

Follow Us:
Download App:
  • android
  • ios