Ethos IPO: ప్రముఖ లగ్జరీ, ప్రీమియం వాచీల రిటైల్‌ బ్రాండ్ ఎథోస్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) నేడు ప్రారంభమై 20న ముగియనుంది. ఈ ఇష్యూకు ధరల శ్రేణిగా రూ.836- 878ను సంస్థ నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా రూ.375 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో 11,08,037 వరకు ఈక్విటీ షేర్లను కంపెనీ విక్రయించనుంది.

Ethos IPO: లగ్జరీ వాచ్ బ్రాండ్ ఎథోస్ ఇష్యూ ఈరోజు మే 18న తెరుచుకుంది. మే 20 వరకు ఐపీవో కోసం అప్లై చేసుకోవచ్చు. Ethos IPO ధర బ్యాండ్ రూ.836-878గా నిర్ణయించారు. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.472 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ.375 కోట్ల తాజా ఇష్యూ విడుదల కానుంది. కాగా, ఆఫర్ ఫర్ సేల్‌లో రూ.97.29 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. కంపెనీ ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్‌లో తమ వాటాను విక్రయించనున్నారు.

ఆఫర్ ఫర్ సేల్‌లో యశోవర్ధన్ సాబు, KDDL, మహన్ డిస్ట్రిబ్యూషన్, సాబు వెంచర్స్ LLP, అనురాధ సాబు, జయవర్ధన్ సాబు, VBL ఇన్నోవేషన్స్, అనిల్ ఖన్నా, నాగరాజన్ సుబ్రమణియన్, సి రాజ శేఖర్, కరణ్ సింగ్ భండారి, హర్ష్ వర్ధన్ భువల్కా, ఆనంద్ వర్ధని భువల్కా, ఆనంద్ వర్ధని భువల్కా, మంజు భువల్కా తన షేర్లను విక్రయించనున్నారు.

ఇష్యూ తెరవడానికి ఒక రోజు ముందు, ఎథోస్ యాంకర్ బుక్ నుండి 142 కోట్ల రూపాయలను సేకరించింది. కంపెనీ ఒక్కో షేరుకు రూ.878 చొప్పున 16,13,725 ఈక్విటీ షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు జారీ చేసింది. కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్లలో ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, జూపిటర్ ఇండియా ఫండ్, సెంట్ క్యాపిటల్ ఫండ్, నోమురా సింగపూర్, UPS గ్రూప్ ట్రస్ట్ ఉన్నాయి.

ఎథోస్ పబ్లిక్ ఇష్యూ గురించి అన్‌లిస్టెడ్ అరేనా.కామ్ వ్యవస్థాపకుడు అభయ్ దోషి మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద లగ్జరీ మరియు ప్రీమియం వాచ్ కంపెనీ ఎథోస్ అని అన్నారు. ప్రీమియం, లగ్జరీ సెగ్మెంట్లలో రిటైల్ అమ్మకాలలో కంపెనీ 13 శాతం వాటాను కలిగి ఉంది. అదే సమయంలో, లగ్జరీ విభాగంలో దాని వాటా 20 శాతంగా ఉంది. ఆపరేషన్స్ విషయంలో, కంపెనీ ఫలితాలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 

2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం మార్జిన్ 1.50 శాతంగా ఉంది. 2022 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో, కంపెనీ గణాంకాలు చాలా బాగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2021 గణాంకాల ఆధారంగా దీని P/E 358X గా నమోదైంది. దీని ప్రకారం సంస్థ ఇష్యూ ఖరీదైనదిగా కనిపిస్తుంది.ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, పెట్టుబడిదారులు ఇష్యూకు దూరంగా ఉంటే మంచిదని అభయ్ దోషి పేర్కొన్నారు. 

2020-21 ఆర్థిక సంవత్సరంలో దీని ఆదాయం రూ. 386.57 కోట్లుగా ఉంది. ఏడాది క్రితం ఇది రూ.457.85 కోట్లు. ఇలా ఏడాది ప్రాతిపదికన చూస్తే ఆదాయం 15.6 శాతం క్షీణించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దీని లాభం రూ. 5.79 కోట్లు. ఏడాది క్రితం కంపెనీకి రూ.1.33 కోట్ల నష్టం వచ్చింది.

గ్రే మార్కెట్ అంచనాలు ఇవే...
గ్రే మార్కెట్లో ఎథోస్ స్టాక్‌పై ప్రీమియం సూచనలు కనిపించడం లేదు. మే 25న కంపెనీ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించనుంది. షేర్లు జారీ చేయని పెట్టుబడిదారులకు మే 26న వాపసు లభిస్తుంది. మే 27న డీమ్యాట్ ఖాతాలోకి షేర్లు చేరుతాయి. కంపెనీ షేర్లు మే 30న స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కానుంది. 

ఎవరికి ఎంత వాటా రిజర్వ్ చేశారు?
IPOలో 50 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల (QIBలు) కోసం రిజర్వ్ చేయబడుతుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం రిజర్వ్ చేయనున్నారు. మిగిలిన 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు ఉంటుంది. కంపెనీ తన రుణాన్ని తిరిగి చెల్లించడానికి కొత్త షేర్ల జారీ ద్వారా వచ్చిన కొంత మొత్తాన్ని ఉపయోగిస్తుంది. 234.96 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగిస్తారు. 33.27 కోట్లతో కొత్త దుకాణాలను ప్రారంభించి పాతవాటిని మెరుగుపరచనున్నారు.