ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలోన్ మస్క్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలోన్ మస్క్ కారణంగా గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ తన భార్య నికోల్ షానహాన్‌కు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం కలకలం సృష్టిస్తోంది. 

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. బిలియనీర్ గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షానహాన్‌తో మస్క్ వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని ఒక వార్తాపత్రికలో వచ్చిన కథనం సంచలనంగా మారింది.

ఈ ఎఫైర్ కారణంగా బ్రిన్‌తో మస్క్ స్నేహం విచ్ఛిన్నమైందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికలో పేర్కొంది. బ్రిన్ తన భార్యకు మస్క్‌తో ఎఫైర్ ఉందని తెలుసుకున్న తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని కథనం పేర్కొంది.

Scroll to load tweet…

ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఒక పార్టీలో మస్క్ బ్రిన్‌కి క్షమాపణలు చెప్పాడు. టెస్లా వాహనం ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు దాన్ని తొలి కస్టమర్లలో బ్రిన్ మొదటి వ్యక్తి అని అందరికీ తెలిసిందే. ఆర్థిక సంక్షోభ సమయంలో టెస్లాను నిలబెట్టడానికి 2008లో బ్రిన్ 500,000 డాలర్ల సహాయం మస్క్ కు ఇచ్చాడు.

ఎఫైర్ పై ఎలాన్ మస్క్ స్పందన
మస్క్ తనపై వచ్చిన వార్తలను పుకార్లుగా కొట్టిపారేశాడు. అంతేకాుద తాను, బ్రిన్ స్నేహితులమని, గత రాత్రి తామంతా పార్టీలో ఉన్నామని ట్వీట్ చేశాడు.

అంతేకాదు తన ట్వీట్ లో మస్క్ ఇలా వ్రాశాడు, “నేను నికోల్‌ను గత మూడు సంవత్సరాలలో రెండుసార్లు మాత్రమే చూశాను, అది కూడా చుట్టుపక్కల చాలా మంది వ్యక్తులు ఉండగా కలిశాను. అందులో రొమాంటిక్ ఏమీ లేదు." అని తెలిపాడు. 

బ్రిన్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు
ఇదిలా ఉంటే జనవరిలో, బ్రిన్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు, "సమాధానం చెప్పుకోలేని విభేదాలు తాను, తన భార్య షానహన్ డిసెంబర్ 15, 2021న విడిపోవాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. అదనంగా, బ్రిన్ తన కుమార్తె ఉమ్మడి కస్టడీని కోరాడు. 

ఇదిలా ఉంటే గత కొన్ని నెలల క్రితం మస్క్ తన స్నేహితురాలు, గాయకురాలు గ్రిమ్స్‌తో విడిపోయారు, ఆమెతో అతను ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. అంతే కాదు, కొన్ని వారాల క్రితం, మరిన్ని వార్తలు బయటకు వచ్చాయి. అందులో మస్క్ నవంబర్ 2021లో మస్క్ కంపెనీ న్యూరాలింక్‌లో ఎగ్జిక్యూటివ్ అయిన షివోన్ జిల్లిస్‌తో రహస్యంగా మరో ఇద్దరు కవలలకు జన్మనిచ్చాడన్న వార్త బయటకు పొక్కింది.