కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు డీఏ పెంపు వార్త కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. జూలై నుంచి డిసెంబర్ మధ్యలో ఎప్పుడైనా డీఏ పెంపు వార్తను వారు వినే అవకాశం ఉంది. ఎప్పుడూ దీపావళికి ముందు ఈ బంపర్ బొనాంజా ప్రకటిస్తారు. కానీ ఈసారి రాఖీ పండుగకు వివనవచ్చు.
కోటి మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలో వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ఉద్యోగుల జీతం, పింఛనును ప్రభావితం చేసే డీఏ పెంపు విడుదల కాబోతోంది. ఈరోజు కేంద్ర ఉద్యోగులు డిఏకు సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. జూలై - డిసెంబర్ నెలల మధ్యలో డీఏను ప్రకటిస్తూ ఉంటారు. డిఏ పెంపు కోసం కేంద్ర ఉద్యోగులు అలాగే పింఛను దారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రతి ఏడాది దీపావళికి ముందే డిఏ పెంపు వార్తను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ప్రతి ఏడాది దీపావళికి ముందు ఈ డీఏ పెంపును ప్రకటిస్తారు. అయితే ఈసారి ఇంకా ముందే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జూలై -డిసెంబర్ 2025కి చెందిన డీఏ భత్యం పెంపును అతి త్వరలో ప్రకటించబోతున్నారు. ఏడవ వేతన సంఘం చెబుతున్న ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏ పెంచుతూ ఉంటారు. ఎంత పెంచాలన్నది ద్రవ్యోల్బణ రేటు పై ఆధారపడి ఉంటుంది.
ఎంత డీఏ పెరుగుతుంది?
డీఏ ఎంత పెంచుతారు అన్నది ఖచ్చితంగా తెలియనప్పటికీ... ఈసారి మూడు శాతం పెరుగుదల ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ డీఏ పెంపుతో కేంద్ర ఉద్యోగుల డిఏ 55 శాతం నుండి 58 శాతానికి పెరగవచ్చు. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం డిఏను 53 నుండి 55 శాతానికి పెంచింది. అంటే రెండు శాతం పెంచింది. అయితే లేబర్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం ఈసారి డీఏ మూడు శాతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
డీఏ అంటే డియర్ నెస్ అలవెన్స్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెరిగే మొత్తం ఇది. జీతంలో పెద్ద పెరుగుదలకు కారణమవుతుంది. ఉదాహరణకు 40,000 జీతం తీసుకుంటున్న వ్యక్తికి డిఏ మూడు శాతం పెరిగితే అతడి జీతం లో 1200 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. డిఏ పెరిగితే ప్రయాణభత్యాలు అంటే ట్రావెల్ అలవెన్సులు, ఇంటి అద్దె భత్యం కూడా పెరుగుతాయి. కాబట్టి మొత్తం మీద జీతంలో ఎక్కువ పెరుగుదలే కనిపించే అవకాశం ఉంది. అందుకే డీఏ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఏడాది అతి త్వరలోనే ఆ శుభవార్తను కేంద్ర ప్రభుత్వం వినిపించబోతున్నట్టు తెలుస్తోంది.
