Asianet News TeluguAsianet News Telugu

వరుస క్షీణత తరువాత నేడు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 641 పాయింట్లు జంప్..

స్టాక్ మార్కెట్ గత ఐదు ట్రేడింగ్ రోజులలో నష్టాలతో  ముగిసింది. ఈ రోజు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్   ఇండెక్స్ సెన్సెక్స్ 641.72 పాయింట్లు వద్ద 1.30 శాతం పెరిగి 49858.24 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 186.15 పాయింట్లు వద్ద 1.28 శాతం లాభంతో 14744 వద్ద ముగిసింది. 

Continuation of decline in stock  market: Sensex closed up 641 points, Nifty also surge
Author
Hyderabad, First Published Mar 19, 2021, 4:22 PM IST

నేడు వారంలోని  చివరి ట్రేడింగ్ రోజున అంటే శుక్రవారం స్టాక్ మార్కెట్ గ్రీన్ మార్క్ మీద లాభాలతో ముగిసింది.  స్టాక్ మార్కెట్ గత ఐదు ట్రేడింగ్ రోజులలో నష్టాలతో  ముగిసింది. ఈ రోజు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్   ఇండెక్స్ సెన్సెక్స్ 641.72 పాయింట్లు వద్ద 1.30 శాతం పెరిగి 49858.24 వద్ద ముగిసింది.

అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 186.15 పాయింట్లు వద్ద 1.28 శాతం లాభంతో 14744 వద్ద ముగిసింది. 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ గతవారంలో 386.76 పాయింట్లు అంటే 0.78 శాతం పెరిగింది. 

గత ఐదు రోజులలో  స్టాక్ మార్కెట్ క్షీణత కారణంగా పెట్టుబడిదారులు రూ .8 లక్షల కోట్లు కోల్పోయారు. బిఎస్‌ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్ మార్కెట్ మందగమనం తరువాత ఐదు రోజుల్లో రూ .8,04,216.71 కోట్లు తగ్గి రూ .2,01,22,436.75 కోట్లకు చేరుకుంది.

యు.ఎస్ సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల సమావేశం తరువాత పెట్టుబడిదారులకు 2023 వరకు కీలక వడ్డీ రేట్లను సున్నా వద్ద ఉంచాలని ఆశిస్తున్నట్లు హామీ ఇచ్చింది.

 హెవీవెయిట్స్ గురించి మాట్లాడితే ఈ రోజు హిందుస్తాన్ యూనిలీవర్, ఎన్‌టిపిసి, జెఎస్‌డబల్యూ స్టీల్, యుపిఎల్, టాటా స్టీల్ లాభాల మీద ముగిశాయి. టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎల్ అండ్ టి, కోల్ ఇండియా, టైటాన్ షేర్లు నష్టాలతో ముగిశాయి.

also read చదువు మధ్యలోనే ఆపేసిన ఈ 22 ఏళ్ల యువకుడు.. ఇప్పుడు టి వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నాడు.. ...

 అలాగే నేడు రియాల్టీ కాకుండా మిగత అన్ని రంగాలు లాభాలతో  మూగిశాయి. వీటిలో ఎఫ్‌ఎంసిజి, మెటల్, ఐటి, ఆటో, పిఎస్‌యు బ్యాంక్, ఫైనాన్స్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంకులు, మీడియా, బ్యాంకులు, ఫార్మా ఉన్నాయి.

2021లో భారత ఆర్థిక వ్యవస్థ 12 శాతం వృద్ధి చెందుతుంది: మూడీస్
దేశ ఆర్థిక వ్యవస్థ 2021 క్యాలెండర్ సంవత్సరంలో 12 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది అని  మూడీస్ అనలిటిక్స్ అంచనా వేసింది. గతేడాది 7.1 శాతం క్షీణించిన తరువాత భారత ఆర్థిక వ్యవస్థకు   అవకాశాలు మరింత అనుకూలంగా మారాయని  తెలిపింది.

2020 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు 0.4 శాతంగా ఉందని, ఈ పనితీరు ఊహించిన దానికంటే చాలా మెరుగ్గా ఉంది మూడిస్ తెలిపింది. గత త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 7.5 శాతం పడిపోయిన సంగతి తెలిసిందే.  

 సెన్సెక్స్ నేడు ప్రారంభంలో 244.16 పాయింట్లు (0.50 శాతం) తగ్గి 48,972.36 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ 71.40 పాయింట్ల వద్ద 0.49 శాతం తగ్గి 14,486.50 వద్ద ప్రారంభమైంది. 
 
స్టాక్ మార్కెట్ గురువారం కూడా నష్టాలతో  ముగిసింది. సెన్సెక్స్ 585.10 పాయింట్ల వద్ద 1.17 శాతం తగ్గి 49216.52 వద్ద ఉండగా, అలాగే నిఫ్టీ 163.45 పాయింట్ల వద్ద 1.11 శాతం క్షీణించి 14557.85 వద్ద ముగిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios