వంట గ్యాస్‌ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. 14.2 కేజీల సబ్సిడీ లేని గ్యాస్‌ సిలిండర్ల ధర తాజాగా రూ. 50 పెరిగింది. చమురు కంపెనీలు ప్రతి నెలా ఎల్‌పిజి సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. పన్ను కారణంగా ప్రతి రాష్ట్రానికి ఎల్‌పిజి ధరలు తదనుగుణంగా మారుతూ ఉంటాయి.

దేశంలోని చమురు మార్కెటింగ్ సంస్థలు సబ్సిడీ లేకుండా అందించే 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.50 పెంచాయి. అలాగే ఐదు కిలోల చిన్న సిలిండర్ ధరను రూ .18 పెంచగా, 19 కిలోల సిలిండర్ ధరను రూ.36.50 పెంచారు. 

 ఐఓసిఎల్ వెబ్‌సైట్ ప్రకారం ఢీల్లీలో 14.2 కిలోల సబ్సిడీ లేని ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు రూ.594 నుండి రూ.644కి పెరిగింది. కోల్‌కతాలో రూ.620.50 నుండి రూ.670.50కి, ముంబైలో రూ.594 నుండి రూ.644కి, చెన్నైలో రూ.610 నుండి రూ.660 చేరింది.

19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర కూడా పెరిగింది. దేశ రాజధాని ఢీల్లీలో ప్రస్తుత ధర రూ.1296 గా మారింది. అంతకుముందు దీని ధర రూ.1241.50. ఇంతక్రితం 19 కేజీల సిలిండర్‌పై రూ. 54.5ను పెంచడంతో రెండు వారాల్లోనే వీటి ధరలు రూ. 100 పెరిగినట్లయ్యింది.

also read నేడు బిపిసిఎల్ బిడ్ వాల్యుయేషన్ కమిటీ సమావేశం; రేసులో వేదాంత, అపోలో గ్లోబల్.. ...

కోల్‌కతాలో, ముంబైలలో రూ .55 పెరిగి రూ.1296.00 నుండి రూ .1351.50, 1189.50 నుండి రూ .1244కు చేరుకుంది.  చెన్నైలో 56 రూపాయలు పెరిగి రూ.1354.00 నుండి రూ.1410.50కు చేరుకుంది.  

ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ కింద అందిస్తుంది. ప్రస్తుతం ప్రతి ఇంటిలో సంవత్సరానికి 14.2 కిలోల 12 సిలిండర్లపై ప్రభుత్వం సబ్సిడీ పొందవచ్చు.

వినియోగదారులు దీని కంటే ఎక్కువ సిలిండర్లు తీసుకోవాలనుకుంటే, వారు వాటిని మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంద్తుంది. ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధర మారుతుంది. దీని ధరలు సగటు అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌లు, విదేశీ మారక రేట్ల మార్పు వంటి అంశాలను నిర్ణయిస్తాయి. 

ఎల్‌పిజి సిలిండర్ల ధరను తనిఖీ చేయడానికి, మీరు ప్రభుత్వ చమురు సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడి కంపెనీలు ప్రతి నెలా కొత్త ధరలను జారీ చేస్తాయి. https://iocl.com/Products/IndaneGas.aspx  ఈ లింక్‌ పై క్లిక్ చేసి మీరు మీ నగరంలోని గ్యాస్ సిలిండర్ ధరను తనిఖీ చేయవచ్చు.