Chandrayaan-3 : చంద్రుడి ఉపరితలంపై పుష్కలంగా హీలియం-3 ఇంధనం..ఇది భారత్ చేతికి చిక్కితే..అమెరికా, చైనా వెనక్కే
చంద్రయాన్ - 3 మిషన్ ద్వారా భారత్ మరో సూపర్ పవర్ కాబోతోందా .. అవుననే డిఆర్డిఓకు చెందిన శాస్త్రవేత్త అంటున్నారు. చంద్రుని మీద ఉన్నటువంటి హీలియం 3 భారత్ చేతికి చిక్కినట్లయితే. ఇక అమెరికా చైనా దేశాల సైతం వెనక్కు నెట్టవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.
చంద్రయాన్ 3 మిషన్ ద్వారా భారతదేశం సరికొత్త సువర్ణ అధ్యాయం లిఖించబోతోంది. చంద్రుడు పై అడుగుపెట్టిన అనంతరం ఇస్రోబ్యోమనవక అందించే వివరాలు ఎంతో విలువైనవని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు ముఖ్యంగా భవిష్యత్తు ఇంధన అవసరాలకు ఉపయోగపడే హీలియం 3 వంటి వనరులు చంద్రుడు పై పుష్కలంగా ఉండే అవకాశం ఉందని తద్వారా. మన దేశం ఇంధన రంగంలో అగ్రగామిగా ఎదిగే అవకాశం సైతం ఉందని డి ఆర్ డి ఓ కు చెందిన మాజీ చీఫ్ కంట్రోలర్ ఆర్అండ్ డీ, ఏఎస్ పిళ్లై . అభిప్రాయపడ్డారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలకమైనటువంటి అంశాలను పేర్కొన్నారు.
చంద్రయాన్ విజయం భారతదేశ రోదసి చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించే అవకాశం ఉందని పేర్కొన్నారు అలాగే చంద్రయాన్ 3 మిషన్ ద్వారా భారతదేశం అమెరికా రష్యా చైనా సరసన చేరుతుందని పేర్కొన్నారు ఇప్పటివరకు కేవలం మూడు దేశాలు మాత్రమే చంద్రుడు పై తమ ప్రయోగాలను విజయవంతంగా సఫలీకృతం చేసుకున్నాయి. అయితే ఈ సందర్భంగా పిల్లై కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు అందులో ప్రధానమైనది భవిష్యత్తు ఇంధన అవసరాలకు ఉపయోగపడే హీలియం 3 గురించి ఆయన ప్రధానంగా పేర్కొన్నారు.
హీలియం 3 అనేది నాన్ రేడియో యాక్టివ్ ఐసోటోప్, ఇది ఒక జడ వాయువు ఇందులో ఒక న్యూట్రాన్ రెండు ప్రోటాన్లు ఒక న్యూక్లియస్ ఉంటాయి. భూమ్మీద ఇలాంటి మూలకం కనుగొనడం చాలా కష్టం. కానీ కొద్ది మొత్తంలో సహజవాయువులో హీలియం 3 ట్రేసెస్ రూపంలో దొరుకుతుంది కానీ పెద్ద మొత్తంలో లభించదు.
అదే చంద్రుడిపై అయితే హీలియం 3 పెద్ద మొత్తంలో లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొంటున్నారు. అణు ఇంధనాన్ని నియంత్రించే ఈ ఐసోటోప్ వల్ల భవిష్యత్తులో అను విద్యుత్ ఉత్పత్తికి చాలా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొంటున్నారు. చంద్రుడి ఉపరితలంపై హీలియం 3 పుష్కలంగా లభించే అవకాశం ఉందని ఇందుకు కారణం చెబుతూ చంద్రుడి ఉపరితలంపై వాతావరణం లేకపోవడంతో సూర్యకాంతి నేరుగా చంద్రుని తాకుతుందని అందుకే అక్కడ హీలియం 3 విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొంటున్నారు. చంద్రయాన్ మిషన్లో ఇది ఒక ప్రధాన భాగం అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ హీలియం - 3 మూలకం పెద్ద మొత్తంలో లభిస్తే అది భారత్ ఇంధన అవసరాలను తీర్చడంలో చాలా ఉపయోగపడుతుందని పిల్లని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే చంద్రయాన్ 3 ప్రయోగం సఫలం కావాలని ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. అటు శాస్త్రవేత్తలకు మద్దతుగా ప్రజలు తమ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు చంద్రయాన్ 3 విజయం కోసం ఆకాంక్షిస్తున్నారు.