న్యూఢిల్లీ: సొంత ఇల్లు ఉన్నా ఆదాయం పన్నులో మినహాయింపులు పొందొచ్చనే విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం 2019-20 సార్వత్రిక బడ్జెట్​లో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏయే సందర్భాల్లో సొంతిల్లు ఉన్నవారు గృహ అలవెన్సులు క్లెయిమ్​ చేసుకునే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

సొంత ఇల్లు ఉన్న‌ా, ఇత‌ర కార‌ణాల చేత‌ అద్దె ఇంట్లో నివ‌సిస్తున్నట్ల‌యితే ఆదాయం పన్ను త‌గ్గించుకునేందుకు హెచ్ఆర్ఏ, గృహ రుణం రెండింటినీ క్లెయిమ్ చేయవచ్చు. జులైలో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో ప్ర‌భుత్వం మొత్తం గృహ రుణ మిన‌హాయింపు ప‌రిమితిని ఏడాదికి రూ.1.5 ల‌క్ష‌ల నుంచి రూ.3.5 ల‌క్ష‌ల‌కు పెంచింది. 

also read రెవెన్యూ పెంపే లక్ష్యం.. ఐటీ పేమెంట్స్ లో రిలీఫ్?

రూ.45 ల‌క్ష‌ల లోపు విలువైన గృహాల‌కు ఈ మినహాయింపు వ‌ర్తిస్తుంది. ఈ అదనపు మినహాయింపు వచ్చే ఏడాది మార్చి 31 తీసుకునే కొత్త గృహ రుణాలపై లభించనుంది. హెచ్ఆర్ఏ, గృహ రుణం రెండింటినీ క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉంది. 

కానీ అన్ని సందర్భాల్లోనూ హెచ్ఆర్ఏ, ఇంటి రుణం క్లెయిమ్ చేయడం సాధ్యం కాక‌పోవ‌చ్చు. ఇది వారు చెప్పే కార‌ణంపై ఆధార‌ప‌డి ఉంటుంది. మీరు అందించిన వివరాలను ఆదాయం పన్ను అధికారులు పరిశీలిస్తే, మీరు ఇల్లు కలిగి ఉన్న చోట నివసించకపోవడానికి త‌గిన‌ కారణం ఉండాలి.

సొంతింటిపై రుణం చెల్లిస్తూ ఉద్యోగం, ఇత‌ర కార‌ణాల రీత్యా వేరే నగరంలో ప‌నిచేస్తూ అక్కడ అద్దె చెల్లిస్తుంటే, రెండింటినీ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.ఒక చిన్న ఇల్లు క‌లిగి ఉండి కూడా పెద్ద ఇంట్లో వారి సౌక‌ర్యం కోసం అద్దెకు ఉన్నప్పుడు క్లెయిమ్ వర్తిస్తుంది. ఒక చోట ఇల్లు కొనుగోలు చేసినా, పిల్ల‌ల స్కూళ్లు, ఇత‌ర కార‌ణాలతో వెంట‌నే కొత్త ఇంటికి మార‌క‌పోవ‌డం వంటి సంద‌ర్భాల్లో రెండింటిపై ప‌న్ను మిన‌హాయింపు ల‌భించ‌వచ్చు. 

also read ఇండియాలో కోటీశ్వరుల క్లబ్‌ పెరుగుతోంది: 20 శాతం పెరిగిన ఐటీ రిటర్న్స్

సొంత ఇల్లు ఉన్న‌ా, అద్దె ఇంట్లో నివ‌సించ‌డానికి అర్థ‌వంత‌మైన కార‌ణం ఉంటే క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఇంటిపై గృహరుణం చెల్లిస్తూ, వేరే చోట అద్దె చెల్లిస్తున్నప్పుడు సొంతింటి ద్వారా వ‌చ్చిన అద్దె ఆదాయం లెక్కచూపాలి. ఈ సందర్భంలో కూడా, మీరు హెచ్ఆర్ఏ మినహాయింపు, గృహ రుణ మినహాయింపు రెండింటినీ క్లెయిమ్ చేయవచ్చు.

ఈ ఏడాది నుంచి రెండు ఆస్తులను ఒకరి సొంత నివాస ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే.. రెండింటిని ఆదాయపు పన్ను సొంత ఆస్తిగా ప‌రిగ‌ణించేందుకు అనుమతించింది. ఇంతకుముందు, ఒక ఆస్తిని మాత్రమే స్వీయ-ఆక్రమిత ఆస్తిగా ప‌రిగ‌ణించేది, మిగిలిన వాటిపై వ‌చ్చే అద్దెపై ప‌న్ను వసూలు చేసేది.