Asianet News TeluguAsianet News Telugu

Budbet 2024 : రాముడు చెప్పే 9 ఆర్థిక పాఠాలు... ఫాలో అయితే డబ్బే డబ్బు...

రామాయణం.. మావవాళికి ఆదర్శనీయం. సరిగ్గా గమనిస్తే అందులో నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన క్రమశిక్షణ.. ఆర్థిక పాఠాలు.. నేటి తరానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దీనికి ఓ అద్బుతమైన, ప్రత్యక్ష ఉదాహరణ రామసేతు నిర్మాణం. భారత్ నుంచి లంక వరకు నిర్మించిన ఈ ఇంజనీరింగ్ అద్భుతం ఆధునిక తరానికి రాముడు అందించిన ఓ ఆదర్శప్రాయమైన నమూనాగా చెప్పవచ్చు.

Budbet 2024 : 9 Money Lessons of Ramayana and lord rama - bsb
Author
First Published Jan 26, 2024, 9:25 AM IST

ఢిల్లీ : అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవంతో దేశంమంతా ఆధ్యాత్మికతలో.. రామనామ జపంలో మునిగి ఉంది. ఈ సమయంలో రాముడి నుంచి నేర్చుకోవాల్సిన వాటిల్లో ఆర్థిక పాఠాలూ ముఖ్యమే. ధర్మం పట్ల రాముడి నిబద్ధత దీర్ఘకాలంలో ఎలాంటి ఆర్థిక విజయాలను సాధించాడో గమనిస్తే.. రామాయణం, రాముడిని ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. 

రాముడి జీవితం నుండి నేర్చుకోవాల్సిన తొమ్మిది ముఖ్యమైన ఆర్థిక పాఠాలు ఇవి.. 

వివేకవంతమైన ఆర్థిక ప్రణాళిక
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా, వ్యక్తిగత ఫైనాన్స్‌లో, బాగా ఆలోచించదగిన ఆర్థిక ప్రణాళికతో ఉండడం చాలా కీలకం. ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకున్నా, బడ్జెట్‌ను రూపొందించుకున్నా లేదా వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టినా, ప్రణాళిక అనేది జీవితంలో ఎదురయ్యే అనిశ్చితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. 

ఊహించని సంఘటనలు ఎదురైనప్పటికీ బాధ్యతల పట్ల రాముని నిబద్ధత, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలను మార్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. సరైన బీమాను కొనుగోలు చేయడం, అత్యవసర పోర్ట్‌ఫోలియోను నిర్మించడం, సంపద సృష్టిలో భద్రత, రిస్క్ మేనేజ్‌మెంట్ కోసం పెట్టుబడులను వేరువేరువాటిల్లో పెట్టడం వంటివి ఉన్నాయి.

Budget Expectations 2024 : క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడులు పెడదామనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోవాలి...

ధర్మానికి కట్టుబడి ఉండడం.. వ్యక్తిగత ఫైనాన్స్‌లో, దీర్ఘకాలిక విజయానికి నైతిక ఆర్థిక పద్ధతులు అవసరం. ఆర్థిక నిర్ణయాలలో నిజాయితీ, చిత్తశుద్ధి, న్యాయాన్ని సమర్థించడం, 'త్వరగా ధనవంతులు అవ్వండి' లాంటి పథకాల ఆకర్షణకు దూరంగా ఉండటం, స్థిరమైన ఆర్థిక పునాదిని నిర్ధారిస్తుంది. 

నిరాడంబరం
అజ్ఞాతవాసం సమయంలో శ్రీరాముడి నిరాడంబరమైన జీవనశైలి.. పొదుపు,  సరళత ధర్మాలను బోధిస్తుంది. వ్యక్తిగత ఫైనాన్స్‌లో, పొదుపును జీవనశైలిలో భాగంగా మార్చుకోవడం, అనవసరమైన దుబారాను తగ్గించడం ఆర్థిక శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. చుట్టూ అనేక రకాల విలాసాలు ఈజీగా అందుబాటులో ఉన్నా.. పొదుపు మనస్తత్వం అలవాటు చేసుకోవడం, అవసరాలు, కోరికల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది. పొదుపు, ఆర్థిక క్రమశిక్షణ రెండింటినీ రాముడి జీవితం ప్రోత్సహిస్తుంది.

నేటి రోజుల్లో క్రెడిట్ కార్డ్  అప్పులను తీర్చడం, ఎక్కువ ఖర్చులను అరికట్టడం, క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాట్లను అనుసరించడం.. ఆర్థిక శ్రేయస్సుకు దోహదం చేస్తాయి. సహనం, పట్టుదల, కష్టపడి సంపాదించిన డబ్బును కాపాడుకోవడం రాముడినుంచి నేర్చుకోవచ్చు. 

రిస్క్ మేనేజ్‌మెంట్
రావణుడితో రాముడి యుద్ధం ధైర్యం, రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రాముఖ్యతను తెలుపుతుంది. అదేవిధంగా, వ్యక్తిగత ఫైనాన్స్‌లో, సంపద సృష్టికి, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి.. రాబోయే నష్టాలను అంగీకరించడం అవసరం. నష్టాలను అంచనా వేయడం, అనిశ్చితులను నావిగేట్ చేయగల ధైర్యం, ఆర్థిక నిపుణుల నుండి మార్గదర్శకత్వం పొందడం ఆర్థిక విజయానికి దోహదం చేస్తాయి.

విశ్వసనీయ ఆర్థిక సలహాదారు
రాముని విధేయత, మిత్రదేశాలతో బలమైన పొత్తులు వ్యక్తిగత ఫైనాన్స్‌లో విధేయతకున్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. ఆర్థిక సంబంధాలపై నమ్మకాన్ని పెంపొందించడం ఆర్థిక స్థిరత్వానికి కీలకం. పరస్పర గౌరవం, విశ్వాసం ఆధారంగా సంబంధాలను జాగ్రత్తగా పెంపొందించుకోవాలి. ఇదే ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి సహాయక వ్యవస్థను ఏర్పరుస్తుంది.

ఆర్థిక నిపుణులు సాధారణ పనులను మాత్రమే నిర్వహిస్తారనే అపోహకు విరుద్ధంగా, పెట్టుబడిదారులను ఆర్థిక విజయం వైపు నడిపించడంలో వారు కీలక పాత్ర పోషిస్తారు. ఆర్థిక నిపుణులు రిస్క్ ని అంచనా వేస్తారు, తగిన పెట్టుబడులను గుర్తిస్తారు. ఖాతాదారుల కోసం సాధించగల ఆర్థిక లక్ష్యాలను రూపొందిస్తారు. ఆర్థిక నిపుణులు ఆర్థిక ప్రపంచంలోని సంక్లిష్టతలను నావిగేట్ చేస్తారు.

ఆర్థిక సరిహద్దులు.. 
సంపద సృష్టి కోసం ఏది పడితే అది ఫాలో కాకూడదు. దీనికి రామాయణంలో సరైన ఉదాహరణ. సీతమీద రావణుడి వ్యామోహం. సీత వెంటపడి చివరికి ఏమయ్యాడో తెలుసు. అలాగే కోరికలను అదుపులో పెట్టుకోవాలి. అధిక ఆర్థిక లాభాల కోసం పెట్టుబడులను వెంబడించకుండా జాగ్రత్తపడాలి. ఆర్థిక సరిహద్దులను ఏర్పరచుకోవాలి. ఆకస్మిక నిర్ణయాలకు దూరంగా ఉండాలి. డబ్బును రెట్టింపు చేయడానికో, మదుపు చేయడానికో, అధిక లాభాలు పొందడానకో 'చిట్కా'లను అనుసరించడం కంటే మంచి పెట్టుబడి పద్ధతులపై దృష్టి పెట్టాలి.

క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళిక
లంకకు వంతెనను నిర్మించడంలో రాముడు సహనంతో వ్యవహరించిన విధానం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల శక్తిని గుర్తు చేస్తుంది. రెగ్యులర్, చిన్న పెట్టుబడులు కాలక్రమేణా గణనీయమైన సంపద సృష్టికి దారితీస్తాయి. పెట్టుబడి ప్రయాణంలో స్థిరత్వం, సహనం ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అలాగే, ప్రతి పెట్టుబడిదారుడు కొండమీదునన సంజీవనిని గుర్తించలేరు.  అలాంటి సమయంలో మొత్తం కొండనే ఎత్తుకోవాల్సి ఉంటుంది. రామాయణంలో హనుమంతుడు చేసినట్టుగా.. 

పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా స్టాక్-నిర్దిష్ట నష్టాలను తగ్గించుకోవచ్చు. మొత్తం ఇండెక్స్‌లో కొంత భాగాన్ని సొంతం చేసుకోవడం ద్వారా పనితీరు తక్కువగా ఉన్న స్టాక్‌ల ప్రభావం.. బాగా పని చేసే వాటితో సమానం అయ్యి.. మొత్తం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో
ఉడుతలు, ఎలుగుబంట్లు, గరుడ, కోతులతో కూడిన మిత్రరాజ్యాలు.. విభిన్నమైన సైన్యంపై రాముడు ఆధారపడటం, బాగా వైవిధ్యభరితమైన పెట్టుబడి పోర్ట్‌ఫోలియో అవసరాన్ని ప్రతిబింబిస్తుంది. పెట్టుబడిదారులు కేవలం పొదుపులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆధారపడకూడదు. నష్టాలను తగ్గించడానికి, పెట్టుబడుల్లో లాభాలు పొందడానికి అనేక విధాలుగా ఇన్వెస్ట్ చేయాలి.  

అహంకారం వద్దు
లంకాపతి రావణుని అహంభావం కారణంగా పతనం అవ్వడం.. పెట్టుబడిదారులకు ఒక హెచ్చరిక కథగా ఉపయోగపడుతుంది. అహంకారంతో పని చేయని ఆస్తులను పట్టుకుని వేళ్లాడడం.. ఆర్థిక విజయానికి ఆటంకం కలిగిస్తుంది. తప్పులను అంగీకరించడం, నష్టాలను తగ్గించుకోవడం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్థిరమైన ఆర్థిక శ్రేయస్సు కోసం చాలా ముఖ్యమైనవి.

చివరగా.. 
రాముని జీవితం జ్ఞానం, ఆధ్యాత్మికతకు మించినది. పెట్టుబడిదారులకు విలువైన అంశాలెన్నింటినో నేర్పిస్తుంది. వీటిని సరిగ్గా అందిపుచ్చుకుంటే.. ఆర్థికంగా విజయం మీదే అవుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios