Asianet News TeluguAsianet News Telugu

బిట్ కాయిన్ ఫౌండర్ మృతి: లాకర్లలో రూ.1000 కోట్లు, దొరకని పాస్‌వర్డ్

వర్చువల్ కరెన్సీ.. క్రిప్టో కరెన్సీ.. బిట్ కాయిన్.. ఇన్వెస్టర్ల మదుపుతో అధిక లాభాలు గడించేందుకు వేదిక. పలు ప్రభుత్వాలు నిషేధించడంతో దాన్ని గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. కానీ బిట్ కాయిన్‌పై బహిరంగంగా ట్రేడింగ్ జరిపినన్ని రోజులూ దూసుకెళ్లింది. 

Bitcoin Exchange President Death puts Millions Out of Reach
Author
Toronto, First Published Feb 7, 2019, 12:13 PM IST

క్రిప్టో కరెన్సీ.. కాదంటే బిట్ కాయిన్.. కెనడాకు చెందిన క్వాడ్రిగా-సీఎక్స్‌ అనే కెనడా క్రిప్టో కరెన్సీ కంపెనీ అధ్యక్షుడు గెరాల్డ్‌ కాటెన్‌ అనుమానాస్పదంగా మరణించడంతో 137 బిలియన్ అమెరికన్‌ డాలర్ల క్రిప్టోకరెన్సీకి చెందిన ఖాతాల పరిస్థితి అయోమయంగా మారింది.

ఇటీవల రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఒక అనాదాశ్రయమంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన గెరాల్డ్ అనూహ్యంగా మరణించడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. లావాదేవీలు జరిపేందుకు అవసరమైన పాస్‌వర్డ్‌ ఎవరికీ తెలియకపోవడమే అసలు కారణం.

వివరాలు తెలుసుకోవడానికి పలు ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. చేసేదేమీ లేక కంపెనీ వర్గాలు కెనడా క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజిని సంప్రదించాయి. రక్షణ కల్పించాలని వేడుకున్నాయి. సానుకూలంగా స్పందించిన కెనడా క్రిప్టో కరెన్సీ ఏజెన్సీ రక్షణ కల్పిస్తామంటూ హామీ ఇచ్చింది. 

బుధవారం నాటి అంచనాల ప్రకారం సదరు క్రిప్టో కరెన్సీ విలువ రూ.1000 కోట్లు అని అంచనా. ఇటు రియల్ అటు వర్చువల్ ప్రపంచంలో అన్ బిలీవబుల్ గాధను అభివ్రుద్ధి చేసిన జెరాల్డ్ మరణం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణ వ్యక్తులకు క్రిప్టో కరెన్సీ సంగతి తెలియకున్నా.. అందులో సీ$ 190 మిలియన్లు లేదా రూ.1000 కోట్ల విలువ గల కరెన్సీ లాకర్లలో ఉండి పోయింది. 

కాటెన్‌ తరఫున ఖాతాలను నిర్వహించడానికి అనుమతించాలన్న అతని భార్య జెన్నీఫర్‌ రాబర్ట్‌సన్‌ అభ్యర్థనను నోవా స్కోటియా హైకోర్టు ఆమోదించింది. కాటెన్‌ వినియోగించిన కంప్యూటర్‌ పాస్‌వర్డ్‌ తెలియక దాన్ని ఎవరూ వాడలేకపోతున్నామని, దాదాపు 1.15 లక్షల ఖాతాల వివరాలు దానిలో ఉన్నట్లు రాబర్ట్‌సన్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఎంత వెతికినా ఇంట్లో పాస్‌వర్డ్‌కు చెందిన వివరాలు కూడా దొరకడం లేదని ఆమె తెలిపారు. దీంతో బిట్‌కాయిన్‌, లైట్‌ కాయిన్‌, ఎథిరియం వంటి డిజిటల్‌ కరెన్సీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం క్వాడ్రిగా సీఎక్స్‌ ఎ‍క్స్చేంజ్‌కు నోవా స్కోటియా ఉన్నత న్యాయస్థానం దివాలా రక్షణను మంజూరు చేసింది.

ఈ వేదికపై కరెన్సీ ట్రేడింగ్ కూడా నిలిపివేసింది. అలాగే  గెరాల్డ్‌  సెల్ ఫోన్లు, ఇతర కంప్యూటర్లలోని సమాచారం కోసం  సంబంధిత ఎన్క్రిప్షన్లను ఛేదించడానికి నిపుణులతో ప్రయత్నిస్తున్నామనీ,  కానీ ఫలితం లభించలేదన్నారు. క్వాడ్రిగాలో 363,000 యూజర్లు నమోదయ్యారు. 

క్రిప్టో కరెన్సీ రంగంలో నిపుణులైన వ్యక్తులు ఇరత కంప్యూటర్లు, కాటెన్‌ సెల్‌ఫోన్‌ నుంచి పాక్షిక సమాచారం రాబట్టారన్నారు. దీంతో ఇప్పటికైతే కొంత సొమ్మును గుర్తించగలిగారు. కాటెన్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని.. తనకు బెదిరింపులు సైతం వస్తున్నట్లు రాబర్ట్‌సన్‌ తెలిపారు. 

ఇదిలా ఉంటే మరోవైపు గెరాల్డ్‌ ఎలా చనిపోయాడు? నిజంగా చనిపోయాడా లేదా?  కంపెనీ మోసం  చేస్తోందా లాంటి పలు అనుమానాలు, ప్రశ్నలతో  ఆన్‌లైన్‌ దుమారం రేగింది. అంతేకాదు గెరాల్డ్‌ భార్య జెన్నిఫర్‌  రాబర్ట్‌సన్‌కు వేధింపులు,  బెదిరింపులు తీవ్రమయ్యాయి. దీంతో వీటి నుంచి తనకూ, కంపెనీకి రక్షణ కల్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. 

కాగా ఇండియాలో ఒక అనాధాశ్రయానికి సేవలందిస్తున్న క్రమంలో గెరాల్డ్‌ కాటన్‌  డిసంబరు 9న  చనిపోయారని  జనవరి 14న  సోషల్‌ మీడియా ద్వారా కంపెనీ ప్రకటించింది. 2013 డిసెంబర్ నెలలో గెరాల్డ్ విలియం కాటన్ ఖ్వాడ్రీగా-సీఎక్స్ ను ప్రారంభించారు. కస్టమర్లకు వారి రియల్, వర్చువల్ మనీ పొందేందుకు సమస్యలు రావడంతో కొద్ది నెలలుగా ఈ సంస్థ న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. 

అయితే గత డిసెంబర్ నాలుగో తేదీనే సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని ఫేస్ బుక్ లోనే కాటన్ ఖ్వాడ్రీగా-సీఎక్స్ పోస్ట్ చేసింది. తాజాగా సర్వీసులను మెరుగు పర్చడంపై కేంద్రీకరిస్తామని కూడా తెలిపింది. కెనడియన్లకు మెరుగైన క్రిప్టో కరెన్సీ సేవలు అందుబాటులోకి తెస్తామన్నది. ఈ లోగా దారుణం జరిగిపోవడంతో ఖ్వాడ్రిగా-సీఎక్స్ నుంచి తమ పెట్టుబడులు వస్తాయా? అని మదుపర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios