న్యూఢిల్లీ: ఇండియాలో స్మార్ట్‌‌‌‌ఫోన్లు పెద్ద సంఖ్యలో ఉన్నా.. ఇంకా సగానికి పైగా జనాభా ఫీచర్ ఫోన్లే (చిన్నఫోన్లు) వాడుతున్నారు. ఫీచర్ ఫోన్లను, 2జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌నే చాలా మంది అమితంగా ఇష్టపడుతున్నట్టు కూడా నివేదికలొచ్చాయి. అయితే భారతదేశంలో ఫీచర్‌‌‌‌‌‌‌‌ ఫోన్లను వాడే వారి కోసం డిజిటల్ పేమెంట్ సొల్యుషన్స్‌ను రూపొందించాలని ఇండియన్ స్టార్టప్‌‌‌‌లకు, వ్యక్తులకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ ‌‌‌గేట్స్ సవాలు విసిరారు. 

బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ పీసీఐ), సీఐఐఈ డాట్ కోలతో కలిసి ఈ ‘గ్రాండ్‌‌‌‌ ఛాలెంజ్‌ ’ను లాంచ్ చేశారు. ఫీచర్ ఫోన్లకు డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్‌ అందించిన వారికి నగదు బహుమతి ప్రకటించారు.

ఇండియాలో సగానికి పైగా జనాభా ఫీచర్‌‌‌‌‌‌‌‌ ఫోన్లను వాడుతున్నా రు. స్మార్ట్‌ ‌‌‌ఫోన్లలో అందుబాటులో ఉండే సౌకర్యాలు ఈ ఫోన్లకు ఉండవు. మనీ ట్రాన్స్‌ ఫర్ చేసుకోవాలన్నా, ఆన్‌ లైన్ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా ఖచ్చితంగా స్మార్ట్‌‌‌‌ఫోన్‌ ఉండాల్సిందే. 

భారతదేశంలో స్మార్ట్‌‌‌‌ఫోన్ యూజర్లకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌‌‌‌‌‌‌ఫేస్(యూపీఐ) యాప్ ఉంది. ఈ యాప్‌‌‌‌ ద్వారా ఏ టైంలోనైనా మొబైల్ డివైజ్ ద్వారా వెంటనే మనీని ట్రాన్స్‌ ఫర్ చేసుకోవచ్చు. డిజిటల్ పేమెంట్స్ సాధనాల్లో యూపీఐ చాలా పాపులర్ అయింది. నెలకు కోట్ల కొద్ది లావాదేవీలు ఈ ప్లాట్‌‌‌‌ఫామ్‌ పైననే జరుగుతున్నాయి. 

also read:  వేటుపై పోరుకు చందాకొచ్చర్.. బాంబే హైకోర్టులో పిటిషన్

ఫీచర్ ఫోన్ యూజర్లకు కూడా ఇలాంటి సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు.. ఎన్‌పీసీఐ, సీఐఐఈ డాట్ కో, బిల్‌‌‌‌ గేట్స్ ఫౌండేషన్ కలిసి స్టార్టప్‌‌‌‌లకు, వ్యక్తులకు ఈ గ్రాండ్ ఛాలెంజ్‌ విసిరాయి. ఫీచర్ ఫోన్ యూజర్లకు పేమెంట్ సొల్యుషన్స్‌ను అందించాలని పేర్కొన్నా యి.

2020 జనవరి 12 వరకు దరఖాస్తులకు ఆహ్వానం
ఫీచర్‌‌‌‌‌‌‌‌ ఫోన్లకు యూపీఐ ఆధారిత పేమెంట్ సిస్టమ్‌ డెవలప్‌‌‌‌ చేసిన ఇండివిడ్యువల్‌‌‌‌కు లేదా స్టార్టప్‌‌‌‌కు 50 వేల డాలర్ల (రూ.35,89,788.46) రివార్డును అందిస్తామని బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ పీసీఐ), సీఐఐఈ డాట్ కో తెలిపాయి. తొలి రన్నరప్‌‌‌‌కు 30 వేల డాలర్లను(రూ.21,51,295.43), రెండో రన్నరప్‌‌‌‌కు 20 వేల డాలర్లను(రూ.14,28,587) నగదు బహుమతి కింద ఇస్తామని ప్రకటించాయి. 

అంతర్జాతీయ స్థాయిలో ఈ కాంపిటీషన్‌ సాగనున్నది. 2020 జనవరి 12 వరకు ఇండివిడ్యువల్స్, ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజస్‌‌‌‌ ఈ ఛాలెంజ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ పీసీఐ), సీఐఐఈ డాట్ కో పేర్కొన్నాయి. అప్లికేషన్లను కేవలం ఆన్‌ లైన్ ద్వారానే రిసీవ్ చేసుకోనున్నాయి. మోస్ట్ ప్రామిసింగ్‌ సొల్యు షన్స్‌ను సీఐఐఈ డాట్ కో, ఎన్‌ పీసీఐ షార్ట్‌‌‌‌లిస్ట్ చేస్తాయి. 

also read: తెలంగాణలో రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రంగం పెట్టుబడి

షార్ట్‌‌‌‌ లిస్ట్ అయిన స్టార్టప్‌‌‌‌లకు టెక్నికల్ అవసరాలను తీర్చడంతో పాటు, వారి సొల్యు షన్స్‌ను అభివృద్ధి చేసుకోవడానికి ఎన్‌పీసీఐ ఏపీఐ యాక్సస్‌‌ అందిస్తాయి.ఎంపికైన స్టార్టప్‌‌‌‌లు 2020 ఫిబ్రవరి 11న ముంబై ఈవెంట్‌‌‌‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అనంతరం 2020 మార్చి 14న విన్నర్లను ప్రకటిస్తారు. ‘ఫీచర్ ఫోన్లలో పేమెంట్లు : అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై బెంగళూరులో జరిగిన ప్యానల్ డిస్కషన్‌ లో ఈ గ్రాండ్ ఛాలెంజ్‌ను బిల్‌‌‌‌గేట్స్ ఫౌండేషన్‌ , ఎన్‌పీసీఐ, సీఐఐ డాట్ కో ప్రకటించాయి.