రియల్ ఎస్టేట్, బంగారం పెట్టుబడుల కన్నా షేర్ మార్కెట్ అసెట్ క్లాస్ పరంగా ఎక్కువ లాభాలు తెస్తుందని అనేక సందర్భాల్లో నిరూపితం అయ్యింది ఎందుకంటే షేర్ మార్కెట్లో ఎప్పుడు అద్భుతం జరుగుతుందో తెలియదు. అంతే కాదు మీరు లాభాలను వెంటనే ఒడిసి పట్టుకోవచ్చు. ఈ పరిస్థితి మీకు రియల్ ఎస్టేట్, బంగారం లాంటి అసెట్ క్లాస్ లో కనిపించదు.ఈ రోజు 1 లక్ష పెట్టుబడికి రూ. 18 లక్షల ఆదాయం అందించిన స్టాక్ గురించి తెలుసుకుందాం.
Multibagger Stock: షేర్ మార్కెట్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి నిరంతరం పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా కాలంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య మరింత ఎక్కువైంది. రిటైల్ పెట్టుబడిదారులు తరచుగా మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి మంచి రాబడిని అందించగల పెన్నీ స్టాక్స్ కోసం వెతుకుతుంటారు. అయితే అలాంటి వారికి కొన్ని పెన్నీ స్టాక్స్ బంగారు బాతులు అనే చెప్పాలి. కొన్ని సార్లు ఇలాంటి స్టాక్స్ పై పెట్టే పెట్టుబడి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. అద్భుతమైన రాబడిని అందించిన రికార్డును కలిగి ఉన్నాయి. అడ్విక్ క్యాపిటల్ (Advik Capital Stock) కూడా అటువంటి స్టాక్‌లో ఒకటి, ఇది పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించింది.
ఒకటిన్నర సంవత్సరంలో స్టాక్ 1,700 శాతం పెరిగింది
ఏడాదిన్నర క్రితం, ఈ స్టాక్ విలువ బిఎస్‌ఇలో 0.29 పైసలు మాత్రమే. ప్రస్తుతం దీని విలువ రూ.4.97. గత వారం ఏప్రిల్ 12న ఈ స్టాక్ రూ.5.25 వద్ద ముగిసింది. ఈ విధంగా, గత 18 నెలల్లో, ఈ స్టాక్ 1,700 శాతం విపరీతమైన రాబడిని ఇచ్చింది. ఒక ఇన్వెస్టర్ 18 నెలల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో కేవలం రూ. 1 లక్ష మాత్రమే ఇన్వెస్ట్ చేసి, ఇప్పటి వరకు ఉంచినట్లయితే, ఆ పెట్టుబడి విలువ ఇప్పుడు రూ.18 లక్షలకు పెరిగి ఉండేది.
ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఇంత రాబడి వచ్చింది
ఇటీవలి కాలంలో కూడా ఈ స్టాక్ మంచి రాబడులను ఇచ్చింది. గత వారం ఈ షేరు 1.22 శాతం లాభపడింది. ఒక నెల విషయంలో మాట్లాడితే, ఈ కాలంలో అద్విక్ క్యాపిటల్ వాటా సుమారు 31 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో, ఇది దాదాపు 46 శాతం లాభపడగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు, ఈ స్టాక్ ధర 71 శాతం పెరిగింది. ఇది గత ఏడాది కాలంలో కూడా మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ సమయంలో దాని ధర దాదాపు 340 శాతం పెరిగింది.
గత 18 నెలల్లో, ఈ స్టాక్ సుమారు 1,700 శాతం లాభపడగా, అదే సమయంలో NSE యొక్క నిఫ్టీ 50 ఇండెక్స్ 50 శాతం మాత్రమే పెరిగింది. అదేవిధంగా, ఈ 18 నెలల్లో BSE సెన్సెక్స్ దాదాపు 48 శాతం పెరిగింది. ప్రస్తుతం అద్విక్ క్యాపిటల్ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.110 కోట్లు. డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభం రూ. 15 లక్షలు కాగా, ఆదాయం రూ. 6.13 కోట్లు.గా ఉంది.
అయితే పెన్నీ స్టాక్స్ కాస్త రిస్క్ తో కూడిన వ్యవహారం ఎందుకంటే, ఈ స్టాక్స్ ను ఎంపిక చేసుకునే సమయంలో కంపెనీ త్రైమాసిక ఫలితాలు, అలాగే కంపెనీ ఫండమెంటల్స్, వ్యాపార సరళిని చూడాల్సి ఉంటుంది. ఒక్కో సారి ఈ స్టాక్స్ భారీగా పతనమై కోల్డ్ స్టోరేజీలో సరుకుగా ఎదుగు బొదుగు లేకుండా మిగిలిపోతుంటాయి. ఒక్కో సారి డీలిస్ట్ అయిపోతుంటాయి. అలాంటప్పుడు మరింత ప్రమాదకరం అనే చెప్పాలి.
