భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు పని గంటలు, సెలవులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తాయి.

సెప్టెంబర్ నెల ముగుసి నవంబర్ నెల రాబోతుంది. అయితే మీరు ఈ వచ్చే నెలలో బ్యాంకుకు సంబంధించిన పని ఏదైనా ఉంటే ఈ తేదీలను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నవంబర్ నెలలో బ్యాంకులు 10 రోజుల పాటు మూసి ఉంటాయి. అక్టోబర్‌లో నవరాత్రి, దుర్గాపూజ, గాంధీ జయంతి, దసరా, దీపావళి సహ ఇతర పండుగలతో 21 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడ్డాయి .

భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు పని గంటలు, సెలవులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తాయి.

నవంబర్‌లో మొత్తం బ్యాంకులకు 10 సెలవులు రానున్నాయి. ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు అలాగే ఆదివారాలు వంటి సాధారణ సెలవులు కూడా ఉన్నాయి. అయితే బ్యాంకు సెలవుల్లో కొన్ని రాష్ట్రలను బట్టి ఉంటాయి అలాగే జాతీయ సెలవులలో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్‌లో బ్యాంక్ సెలవుల ఫుల్ లిస్ట్: 

నవంబర్ 1: కన్నడ రాజ్యోత్సవం/కుట్. బెంగళూరు, ఇంఫాల్‌లో బ్యాంకులు మూతపడనున్నాయి.

నవంబర్ 6: ఆదివారం

నవంబర్ 8: గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ/రహస్ పూర్ణిమ. అగర్తలా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గాంగ్టక్, గౌహతి, ఇంఫాల్, కొచ్చి, పనాజీ, పాట్నా, షిల్లాంగ్, తిరువనంతపురం మినహా అన్ని నగరాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 11: కనకదాస జయంతి/వంగల పండుగ. బెంగళూరు, షిల్లాంగ్‌లలో బ్యాంకులు మూతపడనున్నాయి

12 నవంబర్: రెండవ శనివారం

13 నవంబర్: ఆదివారం

నవంబర్ 20: ఆదివారం

23 నవంబర్: సెంగ్ కుట్స్నెమ్. షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి

నవంబర్ 26: నాల్గవ శనివారం

27 నవంబర్: ఆదివారం