అమెరికాలో దారుణం...ఆఫీసులో హిందీలో ఫోన్ కాల్ చేసి బంధువులతో మాట్లాడినందుకు ఉద్యోగం నుంచి తొలగింపు...

ఆఫీసులో పనిలో ఉండగా బంధువులతో అత్యవసర సందర్భంలో హిందీలో మాట్లాడినందుకు ఓ భారతీయుడిని అమెరికన్ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన సర్వత్రా కలవరం లేపుతోంది. కేవలం వర్ణ వివక్ష ఆధారంగానే తనపై ఈ చర్య తీసుకున్నారని బాధిత ఉద్యోగి న్యాయస్థానం తలుపులు తట్టటం గమనార్హం అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

Atrocious in America Fired from job for calling relatives in Hindi in office MKA

అమెరికాలోని అలబామాలో ఓ భారతీయ అమెరికన్ ఇంజనీర్ తన బంధువుతో హిందీలో మాట్లాడినందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మీడియా  రిపోర్టు ప్రకారం బాధితుడు అలబామాలో సీనియర్ సిస్టమ్స్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.  హంట్స్‌విల్లే మిస్సైల్ డిఫెన్స్ కాంట్రాక్టర్ పార్సన్స్ కార్పొరేషన్‌లో సీనియర్ సిస్టమ్స్ ఇంజనీర్ అనిల్ వర్ష్నే ఇటీవల  తనపై చూపిన వివక్షను ఆరోపిస్తూ దావా వేశారు. ఇలాంటి చర్య వల్ల గతేడాది అక్టోబర్‌లో ఉద్యోగం లేకుండా పోయానని పేర్కొన్నారు.

భారతదేశంలో  ఆరోగ్యం బాగా లేని తన బావతో ఫోన్‌లో హిందీలో మాట్లాడినందుకు తనను ఉద్యోగం నుంచి తొలగించినట్లు అనిల్ పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే  సెప్టెంబర్ 26, 2022న అతని బావ KC గుప్తాతో మొబైల్‌లో వీడియో కాల్ చేసినట్లు తెలిపారు. తన బావ భారతదేశంలోని ఆసుపత్రిలో  క్రిటికల్ కండిషన్ లో ఉన్నారని  ఆయనను పలకరించేందుకు ఫోన్ చేసినట్లు తెలిపారు.

బాధితురాలి తరపున దాఖలైన వ్యాజ్యంలో, బావమరిది కాల్ రావడంతో, పరిస్థితి తీవ్రతను గ్రహించి, నేను ఖాళీగా ఉన్న గదిలోకి వెళ్లి వీడియో కాల్ అందుకున్నాను అని అలబామాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్‌లో జూన్‌లో దాఖలైన వ్యాజ్యంలో అనిల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో కంపెనీ ప్రతినిధి ఒకరు  వీడియో కాల్‌లో ఉన్నారని గుర్తించారని, అందుకు తాను అవును అనే సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. 

ఆ తర్వాత మరో ఉద్యోగి అనిల్ తో వీడియో కాల్ చేసేందుకు అనుమతి లేదని చెప్పడంతో వెంటనే ఫోన్ కట్ చేశాడు. అయితే తన బావ చావు బతుకుల్లో ఉన్న సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో వీడియో కాల్ మాట్లాడినట్లు అందుకు కంపెనీ ప్రతినిధులు వద్దని వారించగానే తాను కట్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే కంపెనీ మాత్రం అనిల్ తన భాషలో రహస్య సమాచారాన్ని  అవతలి వ్యక్తికి వెల్లడించడం ద్వారా భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డాడని  కంపెనీ పేర్కొంది. 

ఎలాంటి విచారణ లేకుండా తనను తొలగించడంపై అనిల్ తన బాధను వెల్లడించారు. మిస్సైల్ డిఫెన్స్ ఏజెన్సీలో తనను  బ్లాక్ లిస్ట్ లో సైతం ఉంచినట్లు వాపోయారు.  హిందీలో ఫోన్ కాల్ మాట్లాడిన పాపానికి  తన కెరీర్‌ను ముగించారని బాధితుడు  కోర్టులో నివేదించాడు.

అనిల్ కుటుంబం 1968లో US వెళ్లి హంట్స్‌విల్లేలో స్థిరపడింది, అక్కడ అతను అమెరికన్ పౌరసత్వం పొందాడు. ఆయన భార్య శశి సైతం 1989 నుంచి నాసాలో పనిచేస్తున్నారు. ఒకసారి సిస్టమ్స్ ఇంజినీరింగ్‌లో కాంట్రాక్టర్ ఆఫ్ ద ఇయర్‌గా అనిల్ అవార్డు పొందారు. అతను MDA నుండి భూమి ఆధారిత క్షిపణి రక్షణ కార్యక్రమంలో  సైతం పాల్గొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios