Asianet News TeluguAsianet News Telugu

మణికొండ జడ్పీ హైస్కూల్‌లో ‘ఆర్క్ సెర్వ్’ వార్షికోత్స‌వం

హైదరాబాద్‌లోని మణికొండ జడ్పీ హైస్కూల్‌లో ఆర్క్ సెర్వ్ సంస్థ ప‌దో వార్షికోత్స‌వం నిర్వహించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ARC Serve Celebrates 5th Anniversary with Student Awards and School Improvements GVR
Author
First Published Aug 13, 2024, 10:03 AM IST | Last Updated Aug 13, 2024, 10:03 AM IST

హైద‌రాబాద్: ఆర్క్ సెర్వ్ సంస్థ త‌న ప‌దో వార్షికోత్స‌వాన్ని మ‌ణికొండ‌లోని జ‌డ్పీ హైస్కూలు విద్యార్థుల‌తో క‌లిసి జరుపుకుంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు బ‌హుమ‌తులు ప్రదానం చేసింది. 2022లో మ‌ణికొండ జ‌డ్పీ హైస్కూలును ద‌త్త‌త తీసుకున్న‌ప్ప‌టి నుంచి ఆర్క్ సెర్వ్ సంస్థ త‌న సీఎస్ఆర్ కార్య‌క్ర‌మాల‌తో 1,473 మంది విద్యార్థుల చదువులకు ప్రోత్సాహం అందించింది. 

ARC Serve Celebrates 5th Anniversary with Student Awards and School Improvements GVR

అలాగే, ఉత్తమ ఫ‌లితాలు సాధించిన విద్యార్థులు డి. కుష్వంత్ ర‌ణ‌చంద్ర‌వ‌ర్మ (ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో 10/10), ఎస్. భార్గ‌వి (9.8/10), బాస‌ర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన ఎం. మిర్యామిల‌ను ఆర్క్ స‌ర్వ్ సంస్థ ఈ కార్య‌క్ర‌మంలో స‌త్క‌రించింది. అలాగే, వారికి ట్యాబ్‌లు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ఆర్క్ స‌ర్వ్ సంస్థ సీఈఓ క్రిస్ బాబెల్, ప్రొడ‌క్ట్ మేనేజ్‌మెంట్ ఈవీపీ మైఖేల్ లిన్, వైస్ ప్రెసిడెంట్, జీఎం అంబరీష్ కుమార్, హెచ్ఆర్ డైరెక్టర్ కరుణ గెడ్డం, ఫెసిలిటీస్, అడ్మినిస్ట్రేషన్ మేనేజర్, సిఎస్ఆర్ లీడ్ స్వాతి తిరునగరి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆర్క్ స‌ర్వ్ సంస్థ సీఈఓ క్రిస్ బాబెల్ మాట్లాడుతూ.. గ‌డిచిన రెండేళ్ల‌లో ఈ పాఠ‌శాల విద్యాప‌రంగా, మౌలిక వ‌స‌తుల ప‌రంగా ఎంతో పురోగ‌తి సాధించిందని తెలిపారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌న్నారు. ఇక్క‌డ త‌ర‌గ‌తి గ‌దులను అప్‌గ్రేడ్ చేయ‌డంతో పాటు క్రీడా మైదానాల‌నూ మెరుగుప‌రిచామ‌ని చెప్పారు. ఒక‌ప్పుడు 1,300కు పైగా విద్యార్థులు ఉండే ఈ స్కూల్లో ఇప్పుడు గ‌ణ‌నీయ‌మైన ప్ర‌గ‌తి క‌నిపిస్తోంద‌న్నారు. ఇక్క‌డి ఉపాధ్యాయుల కొర‌త‌ను తీర్చేందుకు పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్ర‌న్ అనే సంస్థ‌కు రూ. 8 ల‌క్ష‌ల విరాళం ఇస్తున్నామ‌ని, దీంతో ఆ సంస్థ ఉన్న‌త త‌ర‌గ‌తుల కోసం ఏడుగురు అద‌న‌పు ఉపాధ్యాయుల‌ను నియ‌మిస్తుంద‌ని తెలిపారు. తమ సంస్థ అందించిన ప్రోత్సాహం కారణంగా 2022-23 కంటే 2023-24లో పదో తరగతి పాస్‌ పర్సంటేజీ 10.78 శాతం పెరిగిందని తెలిపారు. 

విద్యార్థుల ఆరోగ్యం విష‌యంలోనూ ఆర్క్ సెర్వ్ సంస్థ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. రుతుక్ర‌మం విష‌యంలో విద్యార్థినుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, శానిట‌రీ నాప్కిన్ల పంపిణీతో పాటు నిర్మాణ్ సంస్థ స‌హ‌కారంతో కెరీర్ గైడెన్స్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. పిల్ల‌ల‌కు క్రీడా ప‌రిక‌రాలు, ఇత‌ర ప‌రిక‌రాలు అందిస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios